న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

INDvsNZ : గాయంతో టీ20 సిరీస్ యువ బ్యాటర్ దూరం?.. రిప్లేస్ చేసే సత్తా వీళ్లకే..!

These players can replace Ruturaj in INDvsNZ T20I series

కివీస్‌తో టీ20 సిరీస్‌కు ముందు టీమిండియాకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ గాయంతో జట్టుకు దూరమైనట్లు తెలుస్తోంది. హైదరాబాద్, మహారాష్ట్ర జట్ల మధ్య రంజీ మ్యాచ్ సందర్భంగా అతని మణికట్టుకు గాయమైంది. దీంతో అతను టీమిండియాతో కలవకుండా నేషనల్ క్రికెట్ అసోసియేషన్‌కు వెళ్లాడు. ఈ క్రమంలో అతను కివీస్ సిరీస్‌కు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి అతని స్థానాన్ని ఎవరు భర్తీ చేయాలి?
యశస్వి జైస్వాల్

యశస్వి జైస్వాల్

2019లో అండర్-19 వరల్డ్ కప్ సమయంలో పరుగుల వరద పారించిన యశస్వి జైస్వాల్ తనకంటూ పేరు సంపాదించుకున్నాడు. ఆ తర్వాత ఐపీఎల్‌లో కూడా రాణించాడు. దీనికితోడు దేశవాళీల్లో మహారాష్ట్ర తరఫున ధారాళంగా పరుగులు చేశాడు. గతేడాది ఐపీఎల్‌లో కూడా అతను ఆకట్టుకున్నాడు. ఆరంభంలో కొన్ని ఇన్నింగ్సుల్లో తడబడిన అతను.. ఆ తర్వాత తన ఆటతీరు మెరుగు పరుచుకున్నాడు. ఐపీఎల్‌లో మొత్తం 23 మ్యాచుల్లో 130 స్ట్రైక్‌రేటుతో 547 పరుగులు చేశాడు. భవిష్యత్తులో కచ్చితంగా భారత క్రికెట్‌లో సత్తా చాటే ఈ ఆటగాడిని సీనియర్ ఆటగాళ్లతో కలిసి డ్రెస్సింగ్ రూం పంచుకకునే అవకాశం వస్తే మంచిదని నిపుణులు అంటున్నారు.

నారాయణ్ జగదీశన్

నారాయణ్ జగదీశన్

పరిమిత ఓవర్ల క్రికెట్‌లో సూపర్ ఫామ్‌లో ఉన్నాడీ తమిళనాడు క్రికెటర్. ఇటీవల ముగిసిన విజయ్ హజారే ట్రోఫీలో మొత్తం 8 మ్యాచుల్లో 838 పరుగులు చేశాడీ బ్యాటర్. ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున ఆడే అతను.. అరుణాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 141 బంతుల్లోనే 277 పరుగులు చేశాడు. ఇది లిస్ట్ ఏ మ్యాచుల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు కావడం గమనార్హం. ఇంత మంచి ఫామ్‌లో ఉన్న అతనికి టీమిండియాలో అవకాశం ఇవ్వాలని సెలెక్టర్లు అనుకున్నా ఆశ్చర్యం లేదు.

యష్ ధుల్

యష్ ధుల్

అండర్-19 వరల్డ్ కప్ నెగ్గిన యష్ ధుల్.. ఆ తర్వాత వెనక్కు తిరిగి చూసుకోలేదు. తను ఆడిన ప్రతి ఫార్మాట్లో చక్కగా రాణిస్తున్నాడు. ముఖ్యంగా పరిమిత ఓవర్ల క్రికెట్లో అతను అద్భుతంగా ఆడుతున్నాడు. తొలిసారి సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆడిన అతను 72.60 సగటుతో 363 పరుగులు చేశాడు. రంజీ ట్రోఫీలో కూడా అరంగేట్రం చేసిన ధుల్.. దీనిలో కూడా బాగానే రాణించాడు. భవిష్యత్తులో ఈ ఢిల్లీ కుర్రాడు కచ్చితంగా టీమిండియాకు ఆడతాడని అందరూ అనుకుంటున్నారు. ఈ క్రమంలో రుతురాజ్ ఆడకపోతే అతనికి అవకాశం ఇవ్వడం కూడా మంచిదే.

Story first published: Thursday, January 26, 2023, 15:05 [IST]
Other articles published on Jan 26, 2023
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X