న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Virat Kohli : కోహ్లీని తెగ ఇబ్బంది పెట్టేస్తున్న కివీ స్పిన్నర్.. అదే బాటలో ఈ ఐదుగురు!

These are the spinners who troubled Virat Kohli

మోడర్న్ క్రికెట్‌లో అత్యుత్తమ బ్యాటర్లలో విరాట్ కోహ్లీ ఒకడు. కానీ అతన్ని కూడా కొందరు బౌలర్లు చాలా తిప్పలు పెట్టారు. ముఖ్యంగా ఎడం చేతి వాటం స్పిన్నర్లను ఎదుర్కోవడంలో కోహ్లీ చాలా సార్లు తడబడ్డాడు.

తాజాగా న్యూజిల్యాండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో కూడా అదే సీన్ కనిపిస్తోంది. కివీస్ బౌలర్ మిచెల్ శాంట్నర్ అతన్ని తక్కువ స్కోర్లకే పెవిలియన్ చేర్చాడు. ఈ క్రమంలో కోహ్లీని ఇబ్బంది పెట్టిన పలువరు ఎడం చేతి వాటం స్పిన్నర్ల వివరాలు చూస్తే..

మిచెల్ శాంట్నర్

మిచెల్ శాంట్నర్

న్యూజిల్యాండ్ స్పిన్నర్ శాంట్నర్ బౌలింగ్‌లో కోహ్లీ చాలా సార్లు తడబడ్డాడు. ప్రస్తుతం జరుగుతున్న వన్డే సిరీస్‌లో కూడా కోహ్లీని శాంట్నర్ అడ్డుకుంటూనే ఉన్నాడు. ఇప్పటి వరకు జరిగిన రెండు వన్డేల్లో కోహ్లీని శాంట్నరే అవుట్ చేయడం గమనార్హం. శాంట్నర్ బౌలింగ్‌ను సరిగా రీడ్ చేయలేకపోతున్న కోహ్లీ.. అతని బౌలింగ్‌లోనే వికెట్ పారేసుకుంటున్నాడు. ఇప్పటి వరకు కోహ్లీని శాంట్నర్ మూడు సార్లు అవుట్ చేసి ఉండటం గమనార్హం.

తైజుల్ ఇస్లాం

తైజుల్ ఇస్లాం

బంగ్లాదేశ్ యువ బౌలర్ తైజుల్ ఇస్లాం కూడా కోహ్లీని బాగానే ఇబ్బంది పెట్టాడు. బంగ్లాదేశ్‌లో టీమిండియా పర్యటించినప్పుడు కోహ్లీకి తైజుల్ కొరకరాని కొయ్యగా మారాడు. స్పిన్‌ను ఎదర్కోవడం కోహ్లీకి కొత్తేం కాదు. స్పిన్ సమస్య ఉన్న ఆటగాడే అయితే కోహ్లీ క్రికెట్ కెరీర్ ఇంత గొప్పగా ఉండేది కాదు. అలాంటి కోహ్లీని టెస్టు క్రికెట్‌లో తైజుల్ రెండు సార్లు అవుట్ చేశాడు. ఈ రెండు సార్లూ కూడా కోహ్లీ ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరడం విశేషం.

షకీబల్ హసన్

షకీబల్ హసన్

కోహ్లీని అన్ని ఫార్మాట్లలో ఇబ్బంది పెట్టిన ఎడం చేతి వాటం స్పిన్నర్ ఎవరైనా ఉన్నారంటే అది షకీబల్ హసనే. గతేడాది చివర్లో బంగ్లాదేశ్ వేదికగా జరిగిన వన్డే సిరీస్‌లో కూడా షకీబల్ హసన్ బౌలింగ్‌లో ఆడటానికి కోహ్లీ ఇబ్బంది పడ్డాడు. ఆ సిరీస్‌లో షకీబల్ బౌలింగ్‌లో రెండు సార్లు అవుటయ్యాడు. కోహ్లీని ఎక్కువ సార్లు అవుట్ చేసిన స్పిన్నర్లలో షకీబల్ హసన్ కూడా ఒకడు. అతను వన్డేల్లో కోహ్లీని మూడు సార్లు అవుట్ చేయగా.. టెస్టుల్లో ఒకసారి, ఐపీఎల్‌లో కూడా ఒకసారి అవుట్ చేశాడు.

కేశవ్ మహరాజ్

కేశవ్ మహరాజ్

సౌతాఫ్రికా ప్రీమియమ్ స్పిన్నర్ కేశవ్ మహరాజ్ కూడా కోహ్లీని బాగానే ఇబ్బంది పెట్టాడు. గతేడాది ఆరంభంలో భారత్, సౌతాఫ్రికా వన్డే సిరీస్‌లో కోహ్లీని కేశవ్ అవుట్ చేసిన బంతి అందరికీ షాకిచ్చింది. కేశవ్ డెలివరీని లెగ్ సైడ్ ఆడేందుకు కోహ్లీ బ్యాక్ ఫుట్ తీసుకున్నాడు. కానీ ఆ బంతి అతను అనుకున్నంత టర్న్ అవలేదు. దీంతో ఎడ్జ్ తీసుకున్న బంతి గాల్లోకి లేచింది. కోహ్లీని వన్డేల్లో కేశవ్ మహరాజ్ రెండు సార్లు అవుట్ చేశాడు. ఈ రెండు సార్లూ కూడా కోహ్లీ క్యాచ్ అవుట్ అవడం గమనార్హం.

రవీంద్ర జడేజా

రవీంద్ర జడేజా

అంతర్జాతీయ స్థాయిలో జడ్డూ, కోహ్లీ ఎప్పుడూ తలపడలేదు కానీ.. ఐపీఎల్ సమయంలో మాత్రం వీళ్లిద్దరూ బాగానే పోటీ పడ్డారు. కోహ్లీని 2018లో జడేజా బౌల్డ్ చేయడం ఇప్పటికీ అభిమానులు మర్చిపోలేరు. తన పిన్ పాయింట్ యాక్యురసీతో బ్యాటర్లను ఇబ్బంది పెట్టే జడ్డూ.. కోహ్లీని కూడా కట్టడి చేశాడనే చెప్పాలి. జడ్డూ బౌలింగ్‌తో పాటు ఐపీఎల్ జరిగేది భారత్‌లో కావడంతో స్పిన్నర్లదే పైచేయి అవడం తెలిసిందే. కానీ కోహ్లీని జడేజా ఈ టోర్నీలో మూడు సార్లు అవుట్ చేశాడనే విషయం మర్చిపోకూడదు.

Story first published: Sunday, January 22, 2023, 18:15 [IST]
Other articles published on Jan 22, 2023
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X