న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ధోనీ హెల్మెట్‌పై జాతీయ జెండా ఉండకూడదట

There's A Reason Why MS Dhoni's Helmet Does Not Have The National Flag

హైదరాబాద్: దేశం తరపున ఆడే ఆటగాళ్లు జాతీయ జెండాను ధరించడమే గౌరవంగా భావిస్తారు. ఇక క్రికెటర్లైతే మైదానంలో బౌండరీలతో చెలరేగినప్పుడు, అనుకోని విజయాలను అందుకున్నప్పుడు హెల్మెట్‌పై ఉన్న జాతీయ జెండాను ముద్దాడతారు. కానీ, ధోనీ హెల్మెట్‌పై జాతీయ జెండా ఎందుకుండదు.?

Dhoni's Helmet Doesn't Have National Flag, Know Why ?
హెల్మెట్‌పై జాతీయ జెండా.. ధోనీ నో

హెల్మెట్‌పై జాతీయ జెండా.. ధోనీ నో

సచిన్‌, కోహ్లీ, సెహ్వాగ్‌లతో పాటు ఇతర ప్రముఖ ఆటగాళ్లు అందరూ సెంచరీ పూర్తి చేయగానే హెల్మెట్‌ను ముద్దాడతారు. కానీ ధోని మాత్రం అందుకు విరుద్ధంగా ఉంటాడు. మరి భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించి వన్డే, టీ20, వరల్డ్ కప్ ఇన్ని విజయాలు తెచ్చిపెట్టిన ధోనీ మాత్రం హెల్మెట్‌పై జాతీయ జెండాను ఉంచుకోడు.

చట్టంలో పేర్కొన్నట్లు అది తప్పంట

చట్టంలో పేర్కొన్నట్లు అది తప్పంట

ఒకవేళ అలా ఉంచుకున్నా అది నేరమంట. అందుకు గల కారణాలు ఇలా ఉన్నాయి. భారతీయ ప్రతీకలను అవమానించే నిరోధక చట్టం 1971లో పేర్కొన్నట్లు ధోని క్రికెట్‌ ఆడుతున్నప్పుడు భారత జెండాను తలపై ధరించకూడదు. ఎందుకుంటే భారతీయ జెండాను భూమిపై పడేయడం, కాళ్ల కింద ఉంచడం వంటివి చేయడం మాతృభూమి భారతదేశాన్ని అవమానించినట్లే.

 తలెత్తి సెల్యూట్‌ చేయాల్సిన జెండాను

తలెత్తి సెల్యూట్‌ చేయాల్సిన జెండాను

దేశం మొత్తం తలెత్తి సెల్యూట్‌ చేయాల్సిన జెండాను నేలపై ఉంచితే, భారతదేశాన్ని అవమానపరిచినట్లే. కీపింగ్‌ చేస్తున్నప్పుడు ధోని కొన్ని సార్లు హెల్మెట్‌ను నేలపై ఉంచుతాడు. ఆ సమయంలో హెల్మెట్‌పై జెండా ఉంటే ధోని భారత దేశాన్ని అవమానపరిచినట్లు అవుతుంది.

2011 వరకూ హెల్మెట్‌పై ధరించిన ధోని

2011 వరకూ హెల్మెట్‌పై ధరించిన ధోని

ఈ కారణంగానే ధోని హెల్మెట్‌పై భారత జెండా ఉండదు. 2011 వరకూ హెల్మెట్‌పై భారత జెండాను ధరించిన ధోని, ఆర్మీ లెఫ్టినెంట్‌గా గౌరవించబడినప్పటి నుంచి ధరించడంలేదు. ఇది దేశంపై ధోనికి ఉన్న గౌరవానికి చిన్న ఉదాహరణ మాత్రమే.

Story first published: Wednesday, March 7, 2018, 14:59 [IST]
Other articles published on Mar 7, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X