న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Team India: టీమిండియా వైఫల్యం చూసి.. కెప్టెన్‌తోపాటు అతన్నీ మార్చాలంటున్న టీమిండియా మాజీ లెజెండ్

Team India need to change not only captain also coach says Harbhajan

భారత జట్టుకు గడ్డుకాలం నడుస్తోంది. అద్భుతమైన ఆటగాళ్లున్నప్పటికీ ముఖ్యమైన సమయాల్లో వాళ్లంతా చేతులెత్తేయడంతో భారత జట్టు ఎలాంటి పెద్ద టోర్నమెంట్లనూ గెలవలేకపోతోంది. ఆసియా కప్‌లో కోహ్లీ అద్భుతంగా రాణించినా ట్రోఫీ నెగ్గలేదు. అలాగే ప్రపంచకప్‌లో కోహ్లీ, సూర్యకుమార్ ఇద్దరూ అదరగొట్టినా ఫైనల్ చేరలేదు. దీంతో జట్టు సారధిని మార్చాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు.

కెప్టెన్‌తో పాటు కోచ్‌నూ మార్చాలి..

కెప్టెన్‌తో పాటు కోచ్‌నూ మార్చాలి..

భారత జట్టు కెప్టెన్‌ను మార్చాలని డిమాండ్ చేస్తున్న జాబితాలో మాజీ లెజెండరీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కూడా చేరాడు. భారత జట్టు సారధిగా హార్దిక్ పాండ్యాను నియమించాలని భజ్జీ అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం అద్భుత ఫామ్‌లో ఉన్న పాండ్యాకు ఈ బాధ్యతలు అప్పగిస్తే కచ్చితంగా ఫలితం ఉంటుందన్నాడు. అలాగే కెప్టెన్‌తోపాటు కోచ్‌ను కూడా మారిస్తే మంచిదంటూ బాంబు పేల్చాడు.

భజ్జీ వింత డిమాండ్

భజ్జీ వింత డిమాండ్

టీమిండియా కెప్టెన్సీ మార్పుపై చర్చ నడుస్తున్న సమయంలో కోచ్‌ను కూడా మార్చాలని భజ్జీ అనడం సంచలనంగా మారింది. ద్రావిడ్ అద్భుతమైన ఆటగాడని కొనియాడిన భజ్జీ.. ఇటీవలి కాలంలో టీ20 ఫార్మాట్ ఆడి, రిటైరయిన వాళ్లకు కోచింగ్ బాధ్యతలు అప్పగించాలన్నాడు. గుజరాత్ టైటాన్స్ హెడ్ కోచ్‌గా సేవలందించిన ఆశిష్ నెహ్రాకు ఈ బాధ్యతలు ఇవ్వచ్చని, లేదంటే హెడ్ కోచ్‌గా ద్రావిడ్‌ను కొనసాగిస్తూనే నెహ్రా వంటి వారికి కూడా కోచింగ్ బృందంలో చోటు కల్పిస్తే బాగుంటుందని భజ్జీ చెప్పాడు.

 ఐపీఎల్‌లో సక్సెస్ జోడీ

ఐపీఎల్‌లో సక్సెస్ జోడీ

ఈ ఏడాది ఐపీఎల్‌లో కోచ్, కెప్టెన్ జోడీగా అద్భుతాలు సృష్టించిన నెహ్రా, పాండ్యాను భజ్జీ ప్రతిపాదించాడు. నెహ్రాది అద్భుతమైన క్రికెటింగ్ బుర్ర అని చెప్పిన భజ్జీ.. కేవలం నెహ్రానే తీసుకోవాలని సూచించలేదు. పొట్టి ఫార్మాట్ ఆడి, ఇటీవల రిటైరయిన ఎవరికైనా సరే భారత కోచింగ్ బృందంలో చోటు కల్పించాలని సూచించాడు. ఇలా ఆడిన వాళ్లకు ఈ ఫార్మాట్‌పై మరింత అవగాహన ఉంటుందని అభిప్రాయపడ్డాడు.

Story first published: Friday, November 11, 2022, 16:30 [IST]
Other articles published on Nov 11, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X