న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఇయర్ ఎండ్ 2018: మొత్తం ఐదు, టెస్టుల్లో కోహ్లీ అరుదైన ఘనత

Team india captain virat kohli top five test centuries in 2018

హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ 2018లో టెస్టు క్రికెట్‌లో రికార్డుల మోత మొగించాడు. ఈ ఏడాది విరాట్ కోహ్లీ ఐదు సెంచరీలు నమోదు చేశాడు. ఇంగ్లాండ్‌తో టెస్ట్ సిరీస్‌లో రెండు, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌, ఆస్ట్రేలియా జట్లపై ఒక్కో సెంచరీ సాధించాడు.

ఓ ఇంటివాడైన కేరళ క్రికెటర్ సంజు శాంసన్ (ఫోటోలు)ఓ ఇంటివాడైన కేరళ క్రికెటర్ సంజు శాంసన్ (ఫోటోలు)

దీంతో టెస్టుల్లో విరాట్ కోహ్లీ సెంచరీల సంఖ్య 25కు చేరింది. అంతేకాదు కెప్టెన్‌గా కోహ్లీ చేసిన సెంచరీల సంఖ్య 18కి చేరింది. ఈ ఏడాది టెస్టుల్లో కోహ్లీ మరో మైలురాయిని అందుకున్నాడు. అతి తక్కవ టెస్ట్‌ల్లో 25 సెంచరీలు నమోదు చేసిన భారత క్రికెటర్‌గా టెస్టుల్లో అరుదైన ఘనత సాధించాడు.

సెంచూరియన్‌లో 153 పరుగులు

సెంచూరియన్‌లో 153 పరుగులు

ఈ ఏడాది జనవరి 13న సఫారీ గడ్డపై సెంచూరియన్ వేదికగా ఆతిథ్య దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్ట్‌ మ్యాచ్‌ రెండో ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లీ 153 పరుగులతో సెంచరీ సాధించాడు. టెస్టుల్లో కోహ్లీకి ఇది 21వ సెంచరీ.

బర్మింగ్‌హామ్‌లో 149 పరుగులు

బర్మింగ్‌హామ్‌లో 149 పరుగులు

ఈ ఏడాది ఆగస్టు 1న బర్మింగ్‌హామ్ వేదికగా ఆతిథ్య ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టెస్టు, రెండో ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లీ 149 పరుగులు చేశాడు. టెస్టుల్లో కోహ్లీకి ఇది 22వ సెంచరీ.

నాటింగ్‌హామ్‌లో 103 పరుగులు

నాటింగ్‌హామ్‌లో 103 పరుగులు

ఈ ఏడాది ఆగస్టు 20న నాటింగ్‌హామ్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో టెస్ట్‌ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 103 పరుగులతో సెంచరీతో చెలరేగాడు. టెస్టుల్లో కోహ్లీకి ఇది 23వ సెంచరీ.

రాజ్ కోట్‌లో 139 పరుగులు

రాజ్ కోట్‌లో 139 పరుగులు

స్వదేశంలో అక్టోబర్ 4న రాజ్‌కోట్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్ట్‌, తొలి ఇన్నింగ్స్‌లో 139 పరుగులతో మెరిశాడు. టెస్టుల్లో కోహ్లీకి ఇది 24వ సెంచరీ.

పెర్త్‌లో 123 పరుగులు

పెర్త్‌లో 123 పరుగులు

ప్రస్తుతం కోహ్లీసేన ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా డిసెంబర్ 14న పెర్త్ వేదికగా ఆతిథ్య ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్ట్‌ మ్యాచ్‌, రెండో ఇన్నింగ్స్‌లో 123 పరుగులతో కోహ్లీ సెంచరీతో చెలరేగాడు. టెస్టుల్లో కోహ్లీకి ఇది 25వ సెంచరీ.

Story first published: Tuesday, December 25, 2018, 15:14 [IST]
Other articles published on Dec 25, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X