న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

INDvsNZ : టీమిండియా 400 స్కోరు చేస్తుంది.. మాజీ లెజెండ్ ధీమా!

 Team India can score 400 runs in INDvsNZ third ODI

న్యూజిల్యాండ్‌తో వన్డే సిరీస్‌ క్లీన్ స్వీప్ చేయడానికి టీమిండియా అడుగు దూరంలో ఉంది. అంతేకాదు, వన్డేల్లో నెంబర్ వన్ జట్టుగా నిలిచేందుకు కూడా ఆ జట్టు ఒకే అడుగు దూరంలో ఉంది. ఇండోర్ వేదికగా జరిగే మూడో వన్డేలో గెలిస్తే సిరీస్‌ క్లీన్ స్వీప్‌తోపాటు వన్డేల్లో నెంబర్ వన్ ర్యాంకు కూడా భారత్ వశం అవుతుంది. ఈ క్రమంలో కీలకంగా మారిన ఈ మ్యాచ్‌ గురించి మాజీ క్రికెటర్, ప్రముఖ కామెంటేటర్ ఆకాష్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

400 పరుగులు చేసినా..

400 పరుగులు చేసినా..

'ఈ మ్యాచ్‌లో ఏం ఆశించాలి? టీమిండియా నుంచి ఎలాంటి ఆట చూడాలని అనుకుంటామో అది చూపించేసిందీ జట్టు. మూడో వన్డేలో కనుక ముందుగా బ్యాటింగ్ చేస్తే.. టీమిండియా 400 పరుగుల స్కోరు చేసినా నేను ఆశ్చర్యపోను. ఈ స్టేడియంలో టీ20ల్లోనే 200-225 పరుగుల స్కోర్లు నమోదవుతాయి' అని ఆకాష్ చోప్రా చెప్పాడు. ప్రస్తుతానికి టీమిండియాలో ఎలాంటి సమస్యలు లేవని అభిప్రాయపడ్డాడు. తొలి వన్డేలో భారత బౌలింగ్ బలహీనంగా ఉందని విమర్శలు వచ్చినా.. రెండో వన్డేలో పుంజుకున్న బౌలర్లు కివీస్‌ను 108 పరుగులకే ఆలౌట్ చేసిన సంగతి తెలిసిందే.

బ్యాటర్లకు మంచి అవకాశం..

బ్యాటర్లకు మంచి అవకాశం..

న్యూజిల్యాండ్ జట్టు బలహీనంగా ఉందని స్పష్టం చేసిన ఆకాష్ చోప్రా.. 'ప్రత్యర్థి చాలా బలహీనమైన జట్టు. ఇక్కడి పిచ్ ఫ్లాట్‌గా ఉంటుంది. దానికితోడు స్టేడియం చిన్నది. ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు బ్యాటర్లంతా కూడా రికార్డులు మెరుగు పరుచుకోవడానికి చూడాలి. ఎందుకంటే ఎక్కడ జరిగా.. అంతర్జాతీయ మ్యాచ్ అంటే అంతర్జాతీయ మ్యాచే కదా' అని వివరించాడు. అయితే మంచు ప్రభావం కారణంగా టాస్ గెలిచిన జట్టు ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకునే అవకాశాలే ఇక్కడ ఎక్కువగా ఉన్నాయని చెప్పాడు.

భారత్ ముందున్న సమస్య అదే..

భారత్ ముందున్న సమస్య అదే..

డెడ్ రబ్బర్ మ్యాచ్ అంటే దీనిలో గెలిచినా, ఓడినా పెద్దగా ప్రభావం ఉండదని ఆకాష్ చోప్రా అన్నాడు. ప్రత్యర్థి జట్టు గౌరవం కాపాడుకోవడానికి ఆడుతుందని, టీమిండియా మాత్రం నాణ్యమైన ఆట ఆడేందుకు ప్రయత్నిస్తుందని చెప్పాడు. ఇలాంటి పరిస్థితిల్లో మ్యాచ్‌లో మరిన్ని పరుగులు నమోదవుతాయని అభిప్రాయపడ్డాడు. మైదానం చిన్నది కాబట్టి ఛేజింగ్ చేయాలని కెప్టెన్లు అనుకోవడంలో ఎలాంటి తప్పు లేదని విశ్లేషించాడు. ప్రస్తుతానికి భారత జట్టులో ఎలాంటి లోటుపాట్లు లేవన్న ఆకాష్ చోప్రా.. చివర్లో టెయిలెండర్ల వికెట్లు తీయలేకపోవడమే భారత్ ముందున్న సమస్య అని స్పష్టం చేశాడు. శ్రీలంకతో ఆడినప్పుడు దాసున్ షనక, కివీస్ తొలి వన్డేలో బ్రేస్ వెల్ వికెట్లు తీయడంలో జట్టు విఫలం అవడాన్ని గుర్తుచేశాడు.

Story first published: Tuesday, January 24, 2023, 13:04 [IST]
Other articles published on Jan 24, 2023
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X