న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సిరిస్ ఫలితం తేల్చే వన్డే: విశాఖ చేరుకున్న భారత్, లంక జట్లు

By Nageshwara Rao
Team India arrives in Visakhapatnam for series-deciding third ODI vs Sri Lanka

హైదరాబాద్: మూడు వన్డేల సిరిస్‌లో భాగంగా చివరిదైన మూడో వన్డే కోసం భారత్, శ్రీలంక జట్లు గురువారం విశాఖపట్నం చేరుకున్నాయి. ఆటగాళ్లతో పాటు ఇరు దేశాలకు అధికారులు సైతం విశాఖకు చేరుకున్నారు. విశాఖలోని వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి ఏసీఏ వీడీసీఏ క్రికెట్‌ స్టేడియంలో ఆదివారం (డిసెంబర్ 17) మూడో వన్డే జరగనుంది.

విమానాశ్రయం నుంచి నేరుగా హోటల్‌కి చేరుకున్న ఆటగాళ్లకు ఘనస్వాగతం లభించింది. తమ అభిమాన క్రికెటర్లను చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు బస చేసిన హోటల్‌ వద్దకు చేరుకోవడంతో సందడి నెలకొంది. శుక్ర, శనివారాల్లో ఉదయం తొమ్మిది గంటలకు శ్రీలంక, సాయంత్రం టీమిండియా నెట్‌ ప్రాక్టీస్‌ చేయనుంది.

ఇక, మ్యాచ్‌కి సంబంధించిన టికెట్లను నగరంలోని పీఎంపాలెంలోని ఇందిరా ప్రియదర్శిని మునిసిపల్‌ స్టేడియం, పోలీస్‌ బ్యారక్స్‌ గ్రౌండ్‌, మద్దిలపాలెం మెయిన్‌ రోడ్డులోని ఎస్‌ఎస్‌ఎన్‌ బేకరీ, వాల్తేరు జంక్షన్‌ వద్దనున్న ఫ్రెష్‌ చాయిస్‌ బేకరీ వద్ద ఏర్పాటు చేసిన కేంద్రాల్లో టికెట్లను విక్రయిస్తున్నారు.

Team India arrives in Visakhapatnam for series-deciding third ODI vs Sri Lanka

మరికొన్ని టిక్కెట్లను ఆన్‌లైన్‌ ద్వారానే విక్రయిస్తున్నారు. స్టేడియంలో ఒక కౌంటర్‌ ఏర్పాటు చేయగా... స్థానికంగా ఉన్న మాల్స్‌ ద్వారా మంగళవారం టిక్కెట్లు విక్రయించారు. ఎక్కువ మంది అభిమానులు రూ.500 విలువ కలిగిన టిక్కెట్లను కొనుగోలు చేసేందుకు పోటీ పడ్డారు.

ముందుగా ప్రకటించిన విధంగా ఆధార్‌ కార్డు ద్వారా ఒకరికి పరిమితంగా నాలుగు టిక్కెట్లు మాత్రమే ఇవ్వగా రూ.500 విలువ గల టిక్కెట్లు పూర్తిగా అమ్ముడయ్యాయి. రూ.1200 విలువ గల టిక్కెట్ల అమ్మకాలు కొంతవరకు జరగ్గా... మిగతా రూ.1,800, 2,500, 3,500, రూ.6,000 విలువ గల టిక్కెట్లను కొనుగోలు చేసేందుకు అభిమానులు పెద్దగా ఆసక్తి చూపలేదు.

ఇక, ఇప్పటివరకు ఈ స్టేడియంలో జరిగిన అన్ని మ్యాచ్‌ల్లో టీమిండియా విజయం సాధించింది. ఈ స్టేడియంలో చివరిసారిగా గతేడాది న్యూజిలాండ్‌తో టీమిండియా వన్డే మ్యాచ్ ఆడింది. ఆ మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఓటమిపాలైంది. విశాఖపట్నం స్టేడియంలో టీమిండియాకు అనేక తీపి జ్ఞాపకాలు న్నాయి.

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని వన్డేల్లో తొలి సెంచరీ చేసింది ఇక్కడే. పాకిస్థాన్‌తో జరిగిన ఆ మ్యాచ్‌లో ధోని 148 పరుగులు చేశాడు. అతని కెరీర్‌కు ఈ మ్యాచే టర్నింగ్ పాయింట్ అని క్రీడా విశ్లేషకులు చెబుతుంటారు. అయితే విశాఖపట్నం వన్డేలో విరాట్ కోహ్లీ ఆడకపోవడం చాలా మందిని నిరుత్సాహానికి గురి చేస్తోంది.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Friday, December 15, 2017, 10:31 [IST]
Other articles published on Dec 15, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X