న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోహ్లీ, బుమ్రాలే స్ఫూర్తి.. టీ20 ప్రపంచకప్‌ ఆడటమే లక్ష్యం!!

Takes inspiration from Virat Kohli, Jasprit Bumrah while on recuperation says Hardik Pandya

ముంబై: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా రీ ఎంట్రీపై పూర్తి స్పష్టత ఇచ్చాడు. ఫిట్‌నెస్‌ విషయంలో విరాట్ కోహ్లీ, జస్ప్రిత్‌ బుమ్రాలే నాకు స్ఫూర్తి. ప్రణాళిక ప్రకారమే శస్త్ర చికిత్సకు వెళ్లాను. ఐపీఎల్‌, టీ20 ప్రపంచకప్‌ ఆడాలనుకున్నా. అన్నింటికన్నా టీ20 ప్రపంచకప్‌ ఆడటమే నాకు ముఖ్యం అని హార్దిక్‌ తెలిపాడు. వెన్నులో శస్త్ర చికిత్స అనంతరం హార్దిక్‌ ప్రస్తుతం కోలుకుంటున్నాడు. తాజాగా ఓ మీడియాతో మాట్లాడిన హార్దిక్‌ పలు విషయాలను పంచుకున్నాడు.

అజర్ వెంట సానియా.. సీఎం కేసీఆర్‌కు వివాహ ఆహ్వానం!!అజర్ వెంట సానియా.. సీఎం కేసీఆర్‌కు వివాహ ఆహ్వానం!!

 తప్పనిసరి పరిస్థితుల్లో సర్జరీ:

తప్పనిసరి పరిస్థితుల్లో సర్జరీ:

'ప్రస్తుతం వెన్ను గాయం నుంచి కోలుకుంటున్నా. మొదటగా శస్త్రచికిత్సకు వెళ్లకూడదనుకున్నా. దీనికోసం ఇతర మార్గాలను సైతం పరీక్షించా. లాభం లేకపోయింది. తప్పనిసరి పరిస్థితుల్లో సర్జరీకి వెళ్లా. వెన్నులో గాయమైనప్పుడు పూర్తి స్థాయిలో ఆడలేకపోతున్నానని అర్థమైంది. జట్టుకు నష్టం కలిగిస్తున్నాననే భావన నాలో ఏర్పడింది. అప్పుడే శస్త్రచికిత్స చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నా' అని హార్దిక్‌ తెలిపాడు.

గాయాలు మన చేతుల్లో ఉండవు:

గాయాలు మన చేతుల్లో ఉండవు:

'గాయాలనేవి మన చేతుల్లో ఉండవు. 4-5 ఏళ్లు ఆడాక నాకు ఈ విషయం తెలిసొచ్చింది. ఆటగాళ్లు గాయాల బారిన పడకుండా తగిన ఏర్పాట్లు చేసుకున్నా.. క్రీడాకారుల జీవితాల్లో అవి భాగమే. గాయాల బారిన పాడమని ఎవరూ చెప్పలేరు. నేనిప్పుడు చాలా బాగున్నా. శస్త్రచికిత్స తర్వాత రాణించడం అంత తేలిక కాదు. అయినా అన్ని విభాగాల్లో రాణించడానికి ప్రయత్నిస్తున్నా. నేను ఇప్పుడు మరింత దృఢంగా ముందుకు వస్తా' అని హార్దిక్‌ అన్నాడు.

ప్రణాళిక ప్రకారమే సర్జరీ:

ప్రణాళిక ప్రకారమే సర్జరీ:

'సర్జరీని ఆలస్యం చేసుంటే వచ్చే ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్‌ అవకాశల్ని కోల్పోయేవాడిని. భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొనే సరైన సమయంలో సర్జరీ చేయించుకున్నా. ఇప్పుడు నా వెన్నులో మార్పుల్ని అర్థం చేసుకోగలుగుతున్నా. ఇదే సరైన సమయమని భావించే సర్జరీకి వెళ్లా. ఒకవేళ నాలుగు నెలలు విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చినా.. న్యూజిలాండ్‌ సిరీస్‌కు ముందు లేదా మధ్యలో జట్టులో చేరేవాడిని. అదే నా ప్రణాళిక. కొన్ని అంతర్జాతీయ మ్యాచ్‌లతో పాటు ఐపీఎల్‌, టీ20 ప్రపంచకప్‌ ఆడాలనుకున్నా. ఏదేమైనా టీ20 ప్రపంచకప్‌ ఆడటమే ముఖ్యం' అని హార్దిక్‌ పేర్కొన్నాడు.

మానసికంగా బలంగా తయారయ్యా:

మానసికంగా బలంగా తయారయ్యా:

'రీ ఎంట్రీ వినడానికి బాగున్నా.. వాస్తవ పరిస్థితుల్లో అంత సులభం కాదు. మనకు ఒకరి నుంచి ఎంతో స్ఫూర్తి అవసరం. సానుకూల ధోరణితో నన్ను నేను మెరుగుపర్చుకుంటా. గాయాల నుంచి కోలుకున్న ప్రతీసారి మరింత దృఢంగా తయారవుతాననే విషయం అర్థమైంది. గాయ నుంచి కోలుకునే సమయంలో నేను కొత్త విషయాలను నేర్చుకున్నా. శారీరకంగా ఎప్పుడైనా కోలుకోగలను. కానీ మానసికంగా ఆరోగ్యంగా ఉండటమే ముఖ్యం. నా జీవితంలో జరిగిన అనేక సంఘటనల ద్వారా మానసికంగా బలంగా తయారయ్యా' అని హార్దిక్‌ వివరించాడు.

కోహ్లీ, బుమ్రాలే స్ఫూర్తి:

కోహ్లీ, బుమ్రాలే స్ఫూర్తి:

'రీ ఎంట్రీకి సిద్ధంగా లేకపోతే తొందరపడాల్సిన అవసరం లేదు. సరైన శిక్షణ లేకపోతే కూడా మళ్లీ గాయాల బారిన పడే అవకాశం ఉంటుంది. గాయాల నుంచి కోలుకున్న పేసర్లు పాట్‌ కమిన్స్‌, జస్ప్రిత్‌ బుమ్రాలను చూశా. రీ ఎంట్రీతో వారు మరింత బలంగా మారారు. ఫిట్‌నెస్‌ విషయంలో విరాట్ కోహ్లీ అమోగం. అతను ఎంతో మందికి స్ఫూర్తి. కోహ్లీ, బుమ్రాలే నాకు స్ఫూర్తి' అని హార్దిక్‌ చెప్పుకొచ్చాడు.

Story first published: Tuesday, December 10, 2019, 19:09 [IST]
Other articles published on Dec 10, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X