అందుకే రోహిత్ భాయ్.. దినేశ్ కార్తీక్ పీక పట్టుకున్నాడు: సూర్యకుమార్ యాదవ్

నాగ్‌పూర్: మైదానంలో నవ్వులు పూయించేందుకే టీమిండియా వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ పీకను రోహిత్ శర్మ పట్టుకున్నాడని స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు. ఇది చాలా సరదా ఘటనని స్పష్టం చేశాడు. ఆస్ట్రేలియాతో మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా శుక్రవారం నాగ్‌పూర్ వేదికగా జరగనున్న రెండో టీ20 నేపథ్యంలో సూర్యకుమార్ యాదవ్ గురువారం మీడియాతో మాట్లాడాడు. జర్నలిస్ట్‌లు అడగిన ప్రశ్నలకు సరదాగా సమాధానాలు చెప్పాడు. ఈ క్రమంలోనే తొలి టీ20లో డీఆర్‌ఎస్ విషయంలో అలసత్వంగా ఉన్న దినేశ్ కార్తీక్‌పై రోహిత్ శర్మ ఆగ్రహం వ్యక్తం చేసిన ఘటనను సూర్య ముందు ప్రస్తావించగా.. అతను అసలు విషయం వెల్లడించాడు.

వారిద్దరి మధ్య ఆ సాన్నిహిత్యం ఉంది..

వారిద్దరి మధ్య ఆ సాన్నిహిత్యం ఉంది..

'మైదానంలో చాలా ఒత్తిడి ఉంటుంది. కాబట్టి అప్పుడప్పుడు సరదా ఘటనలతో పరిస్థితులను మాములగా చేయాల్సి ఉంటుంది. కానీ ఫోకస్ మాత్రం గేమ్‌పైనే ఉంటుంది. డీఆర్‌ఎస్ విషయంలో కొన్నిసార్లు తప్పులు జరగడం సహజం. బ్యాట్‌ ఎడ్జ్ సౌండ్ కీపర్లకు వినపడకపోవచ్చు. ఇక రోహిత్, దినేశ్ కార్తీక్ చాలా ఏళ్లుగా కలిసి ఆడుతున్నారు. సరదాగా తిట్టుకునేంత సాన్నిహిత్యం వారి మధ్య ఉంది.'అని సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు. ఇక మ్యాక్స్‌వెల్ ఔట్ విషయంలో కార్తీక్ స్పష్టత ఇవ్వలేదు. కానీ రిప్లేలో అతను ఔటైన్లు తేలింది.

 బుమ్రా రెడీ..

బుమ్రా రెడీ..

ఇక జస్‌ప్రీత్ బుమ్రా ఫిట్‌గా ఉన్నాడని, రెండో టీ20లో ఆడుతాడని సూర్య స్పష్టం చేశాడు. ముందుగా తనకు తెలియదని ఆటపట్టించిన సూర్య ఆ తర్వాత అసలు విషయం చెప్పాడు.'వాస్తవానికి బుమ్రా గాయం గురించి నాకు అవగాహనలేదు. అది నా పనికూడా కాదు. ఫిజియో, టీమ్‌మేనేజ్‌మెంట్‌‌ను అడిగితే సమాధనం చెబుతారు(నవ్వుతూ). కానీ జట్టులో ప్రతీ ఒక్కరు ఫిట్‌గా ఉన్నారు. బుమ్రా సైతం పూర్తిగా కోలుకున్నాడు. రెండో టీ20లో బరిలోకి దిగుతాడు. ఈ విషయంలో దిగులుపడాల్సిన పనిలేదు'అని సూర్య బదులిచ్చాడు.

బౌలర్ల తప్పులేదు..

బౌలర్ల తప్పులేదు..

తొలి టీ20 ఓటమిలో బౌలర్లు తప్పులేదని, ప్రత్యర్థి బ్యాటర్లు అద్భుతంగా ఆడారని సూర్య చెప్పుకొచ్చాడు. 'గత మ్యాచ్ తర్వాత ఫలితంపై మేం ఎలాంటి చర్చ చేయలేదు. కానీ ఆ మ్యాచ్ సుదీర్ఘంగా సాగడంతో పాటు డ్యూ ప్రభావం కనిపించింది. అంతేకాకుండా ఆస్ట్రేలియా బ్యాటర్లు అద్భుతంగా ఆడారు. ఆరంభం నుంచే మాపై ఎదురుదాడికి దిగారు. మేం మా సాయశక్తులా ప్రయత్నించాం. హర్షల్ పటేల్ గాయం నుంచి కోలుకొని బరిలోకి దిగాడు. అతనికి కాస్త టైమ్ పడుతోంది. హర్షల్ స్లోయర్ బాల్స్‌‌ను విభిన్న వేరియేషన్స్‌తో వేస్తాడు. వాటిని ఎదుర్కోవడం చాలా కష్టం.

 అందరూ బాగానే ఆడారు..

అందరూ బాగానే ఆడారు..

పిచ్ కండిషన్స్ బట్టే భారత బ్యాటర్లు ఆడారు. ప్రతీ ఒక్కరు పరిస్థితులకు తగ్గట్లు తమ బాధ్యతలను నిర్వర్తించారు. ఓపెనర్లు, మిడిలార్డర్ బ్యాటర్లు అందరూ వారి బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించారు. పరిస్థితులకు తగ్గట్లు ఆడటమే నా పని. ఎక్కడైనా నేను బ్యాటింగ్ చేయగలను. జట్టులో నా బాధ్యత ఏంటో నాకు తెలుసు. ఆస్వాదిస్తూ నా పనేంటో నేను చేసుకుపోతున్నాను.'అని సూర్య చెప్పుకొచ్చాడు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Thursday, September 22, 2022, 22:21 [IST]
Other articles published on Sep 22, 2022

Latest Videos

  + More
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Yes No
  Settings X