న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

WTC Final డ్రాగా ముగిస్తే..విజేతను ప్రకటించడానికి ఐసీసీ ఒక సూత్రాన్ని కనుగొనాలి! ఫుట్‌బాల్‌, టెన్నిస్‌ మాదిరి!

Sunil Gavaskar wants a formula to determine WTC Final winner in case of a draw
WTC Final Day 5: ఇంకో Test Match పెట్టి విజేతను ప్రకటించాలి.. సాధ్యమేనా ? | ICC || Oneindia Telugu

సౌథాంప్టన్‌: భారత్‌, న్యూజిలాండ్‌ జట్ల మధ్య సౌథాంప్టన్‌ వేదికగా జరుగుతున్న ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌ మ్యాచ్‌ డ్రాగా ముగిస్తే.. విజేతను ప్రకటించడానికి అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఒక సూత్రాన్ని కనుగొనాలని టీమిండియా దిగ్గజం సునీల్‌ గవాస్కర్ అభిప్రాయపడ్డారు. ఫుట్‌బాల్‌, టెన్నిస్‌లో మాదిరి డబ్ల్యూటీసీ ఫైనల్‌లో కూడా విజేతను నిర్ణయించడానికి ఏదైనా మార్గం చూడాలన్నారు. శుక్రవారం ప్రారంభమైన ఛాంపియన్‌షిప్‌ ఫైనల్ మ్యాచ్‌లో వరుణుడు పదేపదే అంతరాయం కలిగిస్తున్న సంగతి తెలిసిందే. దాంతో ఇప్పటికే నాలుగు రోజుల ఆటలో రెండు రోజులకుపైగా నిలిచిపోయింది. ఈ మ్యాచ్‌కు రిజర్వ్‌డే కేటాయించినా ఫలితం తేలేలా కనిపించడం లేదు..

Usain Bolt: బోల్ట్‌కు క‌వ‌లలు.. వైరల్ అయిన చిన్నారుల పేర్లు!!Usain Bolt: బోల్ట్‌కు క‌వ‌లలు.. వైరల్ అయిన చిన్నారుల పేర్లు!!

ఫుట్‌బాల్‌, టెన్నిస్‌ మాదిరి:

ఫుట్‌బాల్‌, టెన్నిస్‌ మాదిరి:

తాజాగా సునీల్‌ గవాస్కర్ ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ... 'సౌథాంప్టన్‌లో ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే తొలిసారి నిర్వహిస్తున్న ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ డ్రాగా ముగిసేలా కనిపిస్తోంది. దాంతో భారత్, కివీస్ ట్రోఫీని పంచుకునే అవకాశం ఉంది. ఐసీసీ ఫైనల్స్‌లో ఒక ట్రోఫీని ఇలా రెండు జట్లు పంచుకోవడం ఇదే తొలిసారి కానుంది. ఫుట్‌బాల్‌ ఆటలో విజేతను ప్రకటించాలంటే వాళ్లకు పెనాల్టీ షూట్‌ఔట్ లేదా మరో పద్ధతిని అవలంబిస్తారు. టెన్నిస్‌లో ఐదు సెట్లు నిర్వహిస్తారు. దాంతో పాటు టై బ్రేకర్‌ కూడా ఉంటుంది. అలాగే ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ డ్రాగా పూర్తయితే విజేతను ప్రకటించడానికి ఒక సూత్రాన్ని కనుగొనాలి. ఈ విషయంపై ఐసీసీ క్రికెట్‌ కమిటీ ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవాలి' అని సన్నీ అన్నారు.

ఇంకో టెస్టు మ్యాచ్‌ను నిర్వహించాలి:

ఇంకో టెస్టు మ్యాచ్‌ను నిర్వహించాలి:

ఈ ఫైనల్‌ మ్యాచ్‌ అనంతరం భారత్‌, న్యూజిలాండ్‌ జట్లు ఇంగ్లండ్‌లోనే ఉంటున్న నేపథ్యంలో టీమిండియా దిగ్గజం సునీల్‌ గవాస్కర్ ఐసీసీకి మరో అద్భతమైన సూచన కూడా చేశారు. ఈ మ్యాచ్‌ తర్వాత మూడు, నాలుగు రోజుల వ్యవధిలో ఇంకో టెస్టు మ్యాచ్‌ను నిర్వహించాలని, దాన్ని ఫైనల్‌గా పరిగణించాలని చెప్పారు. ప్రస్తుత డబ్ల్యూటీసీ ఫైనల్‌ మ్యాచ్‌లో ఫలితం తేలదని స్పష్టంగా తెలుస్తోంది. దీంతో భారత్‌, న్యూజిలాండ్‌ జట్ల మధ్య మరో మ్యాచును నిర్వహించి విజేతను ప్రకటించాలని సన్నీ అంటున్నారు. సన్నీ చెప్పినట్టు ఇప్పటికిప్పుడు ఇది సాధ్యమయ్యే పనికాదు.

 ఇంగ్లండ్‌లో నిర్వహించకూడదు:

ఇంగ్లండ్‌లో నిర్వహించకూడదు:

డబ్ల్యూటీసీ ఫైనల్‌ లాంటి కీలకమైన మ్యాచ్‌లను ఇంగ్లండ్‌లో నిర్వహించరాదని ఆ జట్టు మాజీ సారథి కెవిన్‌ పీటర్సన్‌ అభిప్రాయపడ్డారు. ఇది చెప్పడానికి బాధగా ఉన్నా.. ఇలాంటి అత్యంత కీలకమైన మ్యాచ్‌లను ఇంగ్లండ్‌లో నిర్వహించకూడదు. నా అభిప్రాయం ప్రకారం డబ్ల్యూటీసీ ఫైనల్‌ లాంటి కీలక మ్యాచ్‌లను ఎప్పుడూ దుబాయ్‌లో నిర్వహించాలి. అది తటస్థ వేదిక. అత్యద్భుతమైన స్టేడియం. కచ్చితమైన వాతావరణ పరిస్థితులు ఉంటాయి. ఆటగాళ్లు ప్రాక్టీస్‌ చేసుకునేందుకు తగిన వసతులు ఉన్నాయి. అంతర్జాతీయ ప్రయాణ సౌకర్యం కలిగిన ప్రదేశం. అన్నిటికీ మించి ఐసీసీ కార్యాలయం కూడా స్టేడియం పక్కనే ఉంది' అని పీటర్సన్‌ అన్నారు.

Story first published: Tuesday, June 22, 2021, 11:12 [IST]
Other articles published on Jun 22, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X