'ఆసీస్ పేస్‌ బౌలింగ్‌ ఎక్కడైనా సత్తాచాటగలదు.. భారత్ మాత్రం'!!

సిడ్నీ: భారత్‌ బౌలింగ్‌పై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్‌ వా ప్రశంసల వర్షం కురిపించారు. అదే సమయంలో లోపాలను కూడా ఎత్తిచూపారు. భారత బౌలింగ్‌ డామినేషన్‌ పీక్స్‌లో ఉందంటూనే.. డామినేషన్‌ అనేది కేవలం స్వదేశానికి మాత్రమే పరిమితమైందన్నారు. ఈ విషయంలో ఆసీస్‌ బౌలర్లే ముందంజలో ఉన్నారు, వారి పేస్‌ బౌలింగ్‌ ఎక్కడైనా సత్తాచాటగలదు అని స్టీవ్‌ వా చెప్పుకొచ్చారు. ఆదివారం లారియస్‌ అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొన్న వా పీటీఐతో మాట్లాడారు.

శాయ్ ట్రయల్స్‌కి నో.. భారత్ బోల్ట్ సంచలన ప్రకటన!!

సొంత గడ్డపైనే ఆధిపత్యం:

సొంత గడ్డపైనే ఆధిపత్యం:

'ప్రస్తుత భారత్‌ పేస్ బౌలింగ్‌ ప్రపంచంలోనే అత్యుత్తమంగా ఉంది.పేసర్లు విజృంభించి బౌలింగ్‌ చేస్తూ విజయాలు అందిస్తున్నారు. అయితే ఆ డామినేషన్‌ అనేది సొంత గడ్డపైనే కావడం కాస్త ఆందోళనకరం. ఈ విషయంలో ఆసీస్‌ బౌలర్లే ముందంజలో ఉన్నారు. ఆస్ట్రేలియా పేస్‌ బౌలింగ్‌ ఎక్కడైనా సత్తాచాటగలదు. ఇరు జట్లలో భీకరమైన బౌలర్లు ఉన్నారు. టెస్టుల్లో 20 వికెట్లను సాధించే సత్తా వారికి ఉంది' అని స్టీవ్‌ వా అన్నారు.

బుమ్రాను అలానే బౌలింగ్‌ చేయనివ్వండి:

బుమ్రాను అలానే బౌలింగ్‌ చేయనివ్వండి:

'భారత్‌ కంటే ఆసీస్‌ బౌలింగే బెటర్‌ కచ్చితంగా చెప్పగలను. స్వదేశం, విదేశాల్లోనూ రాణించే బౌలర్లు ఆ జట్టు సొంతం. టీమిండియా బౌలింగ్‌ ప్రదర్శన స్వదేశానికి పరిమితమైపోతుంది. భారత్‌లో మ్యాచ్‌లు ఆడుతున్నప్పుడు పేసర్ల బౌలింగ్‌ ప్రమాదకరంగా ఉంటుంది. ఆస్ట్రేలియా పర్యటనకు వచ్చినప్పుడు మాత్రం బలహీనంగా కనిపిస్తోంది. జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌ వైవిధ్యం బాగుంది. అయితే అతని బౌలింగ్‌ను మార్చుకోవాలని చాలా మంది కోచ్‌లు చెబుతున్నారు. బౌలింగ్‌లో వేగం పెంచకపోతే వికెట్లు తీయడం కష్టమని అంటున్నారు. అతన్ని సహజసిద్ధమైన బౌలింగ్‌ చేయనివ్వండి' అని స్టీవ్‌ వా సూచించారు.

భారత్‌కు పెద్ద అవగాహన లేదు:

భారత్‌కు పెద్ద అవగాహన లేదు:

'గత పర్యటనలో ఆస్ట్రేలియాను సొంతగడ్డపైనే భారత్‌ ఓడించి టెస్టు సిరీస్‌ దక్కించుకొంది. అది భారత జట్టుకు గొప్ప విషయమే అయినా.. అప్పుడు డేవిడ్‌ వార్నర్‌, స్టీవ్‌ స్మిత్‌ వంటి స్టార్‌ ఆటగాళ్లు లేరు. ఇప్పుడు వారి చేరికతో జట్టు బలంగా మారింది. ఇక మార్నస్‌ లబుషేన్‌ జట్టులో కలిశాడు. పిచ్‌లు, డే/నైట్‌ మ్యాచ్‌లు ఆస్ట్రేలియ జట్టుకు అనుకూలం. అక్కడి పరిస్థితులపై భారత్‌కు పెద్ద అవగాహన లేదు' అని స్టీవ్‌ వా పేర్కొన్నారు.

కోహ్లీలో ఆ పద్ధతి నచ్చింది:

కోహ్లీలో ఆ పద్ధతి నచ్చింది:

భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ సవాళ్లు స్వీకరించే పద్ధతి నాకు బాగా నచ్చుతుంది. ప్రపంచంలో మేటి జట్టుగా ఉండాలంటే.. విదేశాల్లో వీలైనన్ని విజయాలు సాధించాలి. ప్రస్తుత భారత జట్టు కూడా పటిష్టంగా ఉంది. బహుశా టెస్ట్ సిరీస్‌ చాలా గొప్పగా ఉండే అవకాశముంది' అని స్టీవ్‌ వా చెప్పుకొచ్చారు. ఈ ఏడాది చివర్లో భారత్‌ నాలుగు టెస్టుల సిరీస్‌ కోసం ఆస్ట్రేలియా వెళ్తున్న విషయం తెలిసిందే.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
 
Story first published: Monday, February 17, 2020, 20:42 [IST]
Other articles published on Feb 17, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X