న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

డే-నైట్‌ టెస్టుకు భారత మాజీ టెస్టు కెప్టెన్లు.. గెస్ట్ కామెంటేటర్‌గా ధోనీ!

India vs Bangladesh : MS Dhoni Could Be A Guest Commentator In Day-Night Test
Star plans to invite all India Test captains for Maiden Day-Night Test, MS Dhoni Guest Commentator

కోల్‌కతా: భారత పర్యటనలో బంగ్లాదేశ్‌ మూడు టీ20లు, రెండు టెస్టులు ఆడనుంది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ అనంతరం టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. నవంబర్ 14న తొలి టెస్ట్ జరగనుండగా... నవంబర్‌ 22 నుంచి కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా రెండో టెస్ట్ ప్రారంభం కానుంది. కోల్‌కతా టెస్ట్ భారత్-బంగ్లాదేశ్‌లకు తొలి డేనైట్‌ టెస్టు మ్యాచ్. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్‌కు ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలని ఒకవైపు భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు (బీసీసీఐ), మరోవైపు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ సన్నాహాలు చేస్తున్నాడు.

'పంత్ ఆటతీరు మార్చుకుంటున్నాడు.. కుదురుకొనేందుకు సమయం ఇవ్వాలి''పంత్ ఆటతీరు మార్చుకుంటున్నాడు.. కుదురుకొనేందుకు సమయం ఇవ్వాలి'

 డేనైట్‌ టెస్టుకు భారత మాజీ టెస్టు కెప్టెన్‌లు:

డేనైట్‌ టెస్టుకు భారత మాజీ టెస్టు కెప్టెన్‌లు:

భారత క్రికెట్‌ టెస్టు చరిత్రలో డేనైట్‌ టెస్టు ఆడటం ఇదే తొలిసారి కాబట్టి.. టీమిండియాకు సేవలందించిన టెస్టు కెప్టెన్లను అందరినీ ఆహ్వానించి వారి అనుభవాలను పంచుకోనుంది. గంగూలీ-బ్రాడ్‌ కాస్టర్‌ స్టార్‌ స్పోర్ట్స్‌ యాజమాన్యాలు సంయుక్తంగా భారత మాజీ కెప్టెన్లకు ఆహ్వానించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక 2001లో ఆసీస్‌పై కోల్‌కతాలో జరిగిన మ్యాచ్‌లో చిరస్మరణీయమైన విజయాన్ని అందించిన వీవీఎస్‌ లక్ష్మణ్‌, రాహుల్‌ ద్రవిడ్‌లకు కూడా ప్రత్యేక ఆహ్వానాలు పంపనున్నారు. వీరితో పాటు మరికొంత మందికి ఆహ్వానాలు అందే అవకాశం ఉంది.

కామెంటేటర్‌గా ధోనీ:

కామెంటేటర్‌గా ధోనీ:

భారత మాజీ కెప్టెన్‌లలో ఒకడైన ఎంఎస్‌ ధోనీ కామెంటేటర్‌ అవతారం ఎత్తే అవకాశం ఉన్నట్టు సమాచారం తెలుస్తోంది. ధోనీ చేత కామెంటరీ చెప్పించే ఏర్పాట్లను బీసీసీఐ పరిశీలిస్తోందట. దీనికి స్టార్‌ స్పోర్ట్స్‌ అంగీకారం తెలిపితే.. ధోనీని కామెంటరీ బాక్స్‌లో చూసే అవకాశం అభిమానులకు దక్కుతుంది. 2019 ప్రపంచకప్‌ తర్వాత ధోనీ ఏ మ్యాచ్‌లోనూ ఆడలేదు. దీంతో అతని అభిమానులు మిస్‌ అవుతున్నారు. ఒకవేళ ధోనీ వ్యాఖ్యాతగా వస్తే.. అతని అభిమానులు ఖుషీ అవుతారు.

విరామ సమయంలో మైదానంలోకి?:

విరామ సమయంలో మైదానంలోకి?:

కోల్‌కతా టెస్ట్ మొదటి రెండు రోజుల్లో భారత మాజీ టెస్టు కెప్టెన్‌లు మైదానంలో సందడి చేయనున్నారు. అందరు కెప్టెన్‌లు జాతీయ గీతం కోసం మైందానంలోకి వస్తారని తెలుస్తోంది. 4వ రోజు విరామ సమయంలో మైదానంలో సందడి చేస్తారట. రెగ్యులర్ కెప్టెన్‌లతో పాటు అప్పుడప్పుడు భారత టెస్ట్ జట్టుకు కెప్టెన్సీ చేసిన వారు దాదాపు 33 మంది ఉంటారు. సెహ్వాగ్, రహానేలు కూడా భారత టెస్ట్ జట్టుకు కెప్టెన్‌గా ఉన్న విషయం తెలిసిందే.

కోల్‌కతా మ్యాచ్‌కి ప్రధానులు:

కోల్‌కతా మ్యాచ్‌కి ప్రధానులు:

చారిత్రాత్మక మైదానమైన ఈడెన్‌ గార్డెన్స్‌లో బంగ్లాదేశ్‌కు తొలి టెస్టు కావడంతో.. ఈ టెస్టును వీక్షించాల్సిందింగా భారత ప్రధాని నరేంద్ర మోడీ, బంగ్లా ప్రధాని షేక్‌ హసీనాలకు కూడా ఇప్పటికే ఆహ్వానం పంపిన విషయం తెలిసిందే. సౌరవ్‌ గంగూలీ టెస్టు మ్యాచ్‌ను వీక్షించాల్సిందిగా ఇరు దేశాల ప్రధానులకు ఆహ్వానం పంపారు. మ్యాచ్‌లకు ఇలా దేశ ప్రధానులను ఆహ్వానించడం ఇదే తొలిసారి కాదు. 2011 ప్రపంచకప్‌ సెమీఫైనల్‌లో భాగంగా భారత్‌-పాక్‌ల మధ్య జరిగిన మ్యాచ్‌కు అప్పటి ఇరు దేశాల ప్రధానులు మన్మోహన్‌ సింగ్‌, యూసఫ్‌ రజా గిలానీలు హాజరయ్యారు.

Story first published: Tuesday, November 5, 2019, 17:01 [IST]
Other articles published on Nov 5, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X