న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

స్పోర్ట్స్ అవార్డులు 2018: కోహ్లీకి ఖేల్ రత్న, సిక్కీ రెడ్డికి అర్జున అవార్డు

SPORTS AWARDS -2018 announced: Mirabai Chanu and Virat Kohli to get Rajiv Gandhi Khel Ratna

హైదరాబాద్: క్రీడారంగంలో అత్యున్నత పురస్కారమైన రాజీవ్‌ ఖేల్‌రత్న అవార్డుని టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ అందుకోనున్నాడు. 2018 సంవత్సరానికి గానూ క్రీడా పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం గురువారం ప్రకటించింది. దీంతో ఈ ఏడాది కోహ్లీతో పాటు వెయిట్‌లిఫ్టర్‌ మీరాబాయి చానులకు ఖేల్‌రత్న అవార్డుని కేంద్రం ఇవ్వనుంది.

ఇమ్రాన్ ఖాన్ హగ్ అడిగినప్పుడు కోహ్లీ వెన్ను చూపగలడా?'ఇమ్రాన్ ఖాన్ హగ్ అడిగినప్పుడు కోహ్లీ వెన్ను చూపగలడా?'

ఈ ఏడాది మొత్తం 20 మంది అర్జున, నలుగురికి ధ్యాన్‌చంద్‌, 8 మందికి ద్రోణాచార్య అవార్డులను అందుకోనున్నారు. అథ్లెట్స్‌ నీరజ్‌ చోప్రా, హిమాదాస్‌, మహిళా క్రికెటర్‌ స్మృతి మంధానకు అర్జున అవార్డు ప్రకటించారు. 2017-18 సంవత్సరానికి గానూ మౌలానా అబుల్‌ కలామ్‌ ఆజాద్‌ ట్రోఫీని అమృత్‌సర్‌కు చెందిన గురునానక్‌ దేవ్‌ యూనివర్శిటీకి ప్రకటించారు.

సెప్టెంబరు 23న భారత్xపాక్ మ్యాచ్, పూర్తి షెడ్యూల్ వివరాలుసెప్టెంబరు 23న భారత్xపాక్ మ్యాచ్, పూర్తి షెడ్యూల్ వివరాలు

ఈ క్రీడా పురస్కారాలను సెప్టెంబర్ 25న రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చేతుల మీదుగా రాష్ట్రపతి భవన్‌లో జరిగే ఓ కార్యక్రమంలో క్రీడాకారులు ఈ అవార్డులు అందుకోనున్నారు. అవార్డుతో పాటు ఖేల్‌ రత్న అవార్డు గ్రహీతలకు రూ. 7.5 లక్షలు, అర్జున, ద్రోణాచార్య, ధ్యాన్‌చంద్‌ అవార్డు గ్రహీతలకు రూ. 5లక్షల చొప్పున నగదు బహుమతి అందిస్తోన్న సంగతి తెలిసిందే.

ఈ ఏడాది క్రీడా పురస్కారాల గ్రహీతలు వీరే..:

రాజీవ్‌ గాంధీ ఖేల్‌ రత్న:
మీరాబాయి ఛాను - వెయిట్‌లిఫ్టింగ్‌
విరాట్‌ కోహ్లీ - క్రికెట్‌


ద్రోణాచార్య అవార్డు:
సుబేదార్‌ చెనంద అచ్చయ్య కట్టప్ప - బాక్సింగ్‌
విజయ్‌ శర్మ - వెయిట్‌లిఫ్టింగ్‌
ఎ. శ్రీనివాసరావు - టేబుల్‌ టెన్నిస్‌
సుఖ్‌దేవ్‌ సింగ్‌ పన్ను - అథ్లెటిక్స్‌
క్లారెన్స్‌ లోబో - హాకీ(లైఫ్‌టైమ్‌)
తారక్‌ సిన్హా - క్రికెట్‌(లైఫ్‌టైమ్‌)
జీవన్‌ కుమార్‌ శర్మ - జూడో(లైఫ్‌టైమ్‌)
వీఆర్‌ బీడు - అథ్లెటిక్స్‌(లైఫ్‌టైమ్‌)


అర్జున అవార్డు:
నీరజ్‌ చోప్రా - అథ్లెటిక్స్‌
సుబేదార్‌ జిన్సన్‌ జాన్సన్‌ - అథ్లెటిక్స్‌
హిమా దాస్‌ - అథ్లెటిక్స్‌
ఎన్‌. సిక్కీరెడ్డి - బ్యాడ్మింటన్‌
సుబేదార్‌ సతీశ్‌ కుమార్‌ - బాక్సింగ్‌
స్మృతి మంధాన - క్రికెట్‌
శుభాంకర్‌ శర్మ - గోల్ఫ్
మన్‌ప్రీత్‌ సింగ్‌ - హాకీ
సవిత - హాకీ ‌
కల్నల్ రవి రాథోడ్‌ - పోలో
రహీ సర్నోబత్‌ - షూటింగ్‌
శ్రేయాసి సింగ్‌ - షూటింగ్‌
మనికా బత్రా - టేబుల్‌ టెన్నిస్‌
సతియాన్‌ - టేబుల్‌ టెన్నిస్‌
రోహన్‌ బోపన్న - టెన్నిస్‌
సుమిత్‌ - రెజ్లింగ్
పూజా కడియన్‌ - వుషు
అంకుర్‌ ధమా - పారా అథ్లెటిక్స్‌
మనోజ్‌ సర్కార్‌ - పారా బ్యాడ్మింటన్‌
అంకుర్‌ మిట్టల్‌ - షూటింగ్‌


ధ్యాన్‌చంద్‌ అవార్డు:
సత్యదేవ్‌ ప్రసాద్‌ - ఆర్చరీ
భరత్‌ కుమార్‌ ఛెత్రీ - హాకీ
బాబీ అలోయ్‌సియస్‌ - అథ్లెటిక్స్‌
చౌగలే దాదు దత్తాత్రేయ - రెజ్లింగ్‌


మౌలానా అబుల్‌ కలామ్‌ ఆజాద్‌ (MAKA) ట్రోఫీ 2017-18
గురునానక్‌ దేవ్‌ యూనివర్శిటీ - అమృత్‌సర్‌


రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహాన్ పురస్కార్ 2018
యూత్ టాలెంట్‌ని గుర్తించినందుకు - రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్
కార్పోరేట్ సోషల్ రెస్పాన్స్‌బులిటీ ద్వారా ఆటలను ప్రోత్సహించినందుకు - జెఎస్‌డబ్ల్యూ స్పోర్ట్స్
క్రీడల అభివృధ్ది - ఇషా ఔట్‌రీచ్

Story first published: Thursday, September 20, 2018, 17:06 [IST]
Other articles published on Sep 20, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X