న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ద్రవిడ్‌కి ఫోన్‌ చేశా, అప్పుడే నాలో కాస్త ఆందోళన తగ్గింది: విహారి

By Nageshwara Rao
India vs England 2018 5 Test 3 Day : Rahul Dravid Eased My Nerves Says Hanuma Vihari
Speaking to Rahul Dravid eased my nerves: Hanuma Vihari

హైదరాబాద్: ఓవల్ వేదికగా ఆతిథ్య ఇంగ్లాండ్‌తో జరుగుతున్న చివరి టెస్టులో తెలుగు క్రికెటర్‌ హనుమ విహారి అరుదైన రికార్డుని నమోదు చేశాడు. అరంగేట్రం చేసిన తొలి టెస్టులోనే హాఫ్ సెంచరీ సాధించి భారత క్రికెట్ మాజీ దిగ్గజాల సరసన నిలిచాడు.

ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా ఆతిథ్య ఇంగ్లాండ్‌తో జరుగుతున్న చివరి టెస్టులో హార్దిక్ పాండ్యా స్థానంలో జట్టులో చోటు దక్కించుకున్నాడు. అంతర్జాతీయ టెస్టు అరంగేట్రం చేసిన హనుమ విహారి క్లిష్ట సమయంలో హాఫ్‌ సెంచరీ సాధించి భారత్‌ను గట్టెక్కించాడు. రవీంద్ర జడేజాతో కలిసి 77 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.

26వ భారత క్రికెటర్‌గా హనుమ విహారి

26వ భారత క్రికెటర్‌గా హనుమ విహారి

దీంతో అరంగేట్ర టెస్టులో హాఫ్‌ సెంచరీ సాధించిన 26వ భారత క్రికెటర్‌గా హనుమ విహారి గుర్తింపు పొందాడు. మ్యాచ్ అనంతరం విహారి మాట్లాడుతూ "చివరి టెస్టులో ఆడనున్నట్లు మ్యాచ్‌ ప్రారంభానికి ఒక రోజు ముందు తెలిసింది. కాస్త ఆందోళనకు గురయ్యాను. వెంటనే భారత్‌-ఏ జట్టు కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌కి ఫోన్‌ చేసి విషయం చెప్పాను" అని అన్నాడు.

ద్రవిడ్ నాతో చాలా సేపు మాట్లాడారు

ద్రవిడ్ నాతో చాలా సేపు మాట్లాడారు

"ద్రవిడ్ నాతో చాలా సేపు మాట్లాడారు. నీలో ఎంతో ప్రతిభ ఉంది. పాజిటివ్ దృక్పదంతో మైదానంలోకి వెళ్లి నీ గేమ్‌ను ఎంజాయ్‌ చేస్తూ ఆడుకో అని ద్రవిడ్‌ సలహా ఇచ్చారు. ఆయన మాటలు విన్నాక నాలో కాస్త ఆందోళన తగ్గింది. నేను ఈరోజు ఇక్కడ ఉన్నానంటే అందుకు కారణం ఆయనే" అని హనుమ విహారి ద్రవిడ్‌పై ప్రశంసలు కురిపించాడు.

ద్రవిడ్‌ లెజెండ్‌ ఆటగాడు

"ఇండియా-ఏ జట్టుతో ప్రారంభమైన నా జర్నీ ద్రవిడ్ సర్ పాత్ర ఎంతో కీలకం. ద్రవిడ్‌ లెజెండ్‌ ఆటగాడు. బ్యాటింగ్ డిపార్ట్‌మెంట్‌లో ఆయన నాకిచ్చే సలహాలు నాకు ఎంతగానో ఉపయోగపడ్డాయి" అని హనుమ విహారి తెలిపాడు. ఇక, తాను మైదానంలోకి వచ్చిన కోహ్లీ ఇచ్చిన మద్దతుపై కూడా విహారి స్పందించాడు.

క్రీజులో కోహ్లీ

క్రీజులో కోహ్లీ

"నిజం చెప్పాలంటే క్రీజులోకి వచ్చిన సమయంలో కాస్త ఒత్తిడికి గురయ్యా. మైదానంలోకి వచ్చే సమయంలో క్రీజులో విరాట్‌ కోహ్లీ ఉన్నాడు. మరోవైపు అండర్సన్‌, స్టువర్ట్‌ బ్రాడ్‌ లాంటి మేటి బౌలర్లు ఉన్నారు. తొలి మ్యాచ్‌ ఆడుతోన్న నాకు మరో ఎండ్‌లో ఉన్న కోహ్లీ ఉండటం కలిసొచ్చింది" అని అన్నాడు.

కోహ్లీ విలువైన సూచనలు

"ఆ సమయంలో నాకు కోహ్లీ ఎన్నో విలువైన సూచనలు అందించాడు. దీంతో మైదానంలో నా పని కాస్త సులువైంది. ఎలాంటి ఒత్తిడి లేకుండా సులువుగా ఆడగలిగాను. ఇక, జడేజాతో కలిసి భాగస్వామ్యాలు నమోదు చేయాలని భావించా. స్టువర్ట్ బ్రాడ్, ఆండర్సన్ ఇద్దరూ వరల్డ్ క్లాస్ బౌలర్లు. వారిద్దరూ 990కిపైగా వికెట్లు తీశారు. దీంతో పాజిటివ్ దృక్పధంతో ఆటను ప్రారంభించా. ఈ సమయంలో కోహ్లీతో కలిసి స్ట్రయిక్ రోటేట్ చేస్తూ భాగస్వామ్యాన్ని నిర్మించా" అని హనుమ విహారి తెలిపాడు.

భారత్ తరుపున నాలుగో ఆటగాడిగా విహారి

ఈ మ్యాచ్‌లో హాఫ్‌ సెంచరీ సాధించిన 26వ భారత క్రికెటర్‌గా హనుమ విహారి గుర్తింపు పొందాడు. భారత్ తరఫున ఇప్పటి వరకు రసీ మోడీ, సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్ మాత్రమే ఈ ఘనత అందుకున్నారు. తాజాగా ఆ జాబితాలో హనుమ విహారి చోటు దక్కించుకున్నాడు. 1946లో రసీ మోడీ 57 పరుగులతో నాటౌట్‌గా నిలవగా.. 1996లో లార్డ్స్‌ టెస్ట్‌లో సౌరవ్ గంగూలీ 131 పరుగులు, రాహుల్ ద్రవిడ్ 95 పరుగులతో ఈ ఘనత సాధించారు.

Story first published: Monday, September 10, 2018, 16:58 [IST]
Other articles published on Sep 10, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X