న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సూపర్ ఫామ్‌లో ఉన్న టీమిండియా స్టార్.. రికార్డుల మీద రికార్డులు బద్దలు!

 Shubman Gill broke many records in INDvsNZ series

టీమిండియా యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఎడాపెడా సెంచరీలు బాదేస్తూ జట్టులో తన స్థానం పదిలం చేసుకుంటున్నాడు. ఈ క్రమంలో ఎన్నో రికార్డులు కూడా బద్దలు కొట్టాడు. వాటిలో కొన్ని కీలకమైన రికార్డులు ఒకసారి పరిశీలిస్తే..

కోహ్లీని దాటేశాడు..

కోహ్లీని దాటేశాడు..

టీమిండియా తరఫున వన్డేల్లో అత్యంత వేగంగా వెయ్యి పరుగులు చేసిన ఆటగాడిగా గిల్ రికార్డు సృష్టించాడు. కివీస్‌తో హైదరాబాద్‌లో జరిగిన తొలి వన్డేలో గిల్ డబుల్ సెంచరీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే భారత్ తరఫున వన్డేల్లో వెయ్యి పరుగులు కూడా పూర్తి చేసుకున్నాడు. ఈ ఘనతను గిల్ కేవలం 19 ఇన్నింగ్సుల్లోనే సాధించాడు. విరాట్ కోహ్లీ, శిఖర్ ధవన్‌ను కూడా అతను దాటేశాడు. అలాగే ఓపెనర్‌గా కూడా వేగంగా 1075 పరుగులు చేశాడు. ఈ క్రమంలో సచిన్ టెండూల్కర్‌ను కూడా దాటేశాడు.

ఫాస్టెస్ట్ సెంచరీలు

ఫాస్టెస్ట్ సెంచరీలు

వన్డేల్లో ఫామ్ అందుకోవడానికి గిల్ చాలానే టైం తీసుకున్నాడు. తను ఆడిన తొలి పది మ్యాచుల్లో హాఫ్ సెంచరీలతోనే సరిపెట్టుకున్న ఈ యువ ఆటగాడు.. ఆ తర్వాతనే సరైన ఫామ్ అందుకున్నాడు. కివీస్‌తో జరిగిన మూడో వన్డేలో అతను 112 పరుగులు చేశాడు. ఇది గిల్ కెరీర్‌లో నాలుగో వన్డే సెంచరీ. ఈ సెంచరీతో భారత్ తరఫున అత్యంత వేగంగా నాలుగు సెంచరీలు చేసిన ఆటగాడిగా కూడా గిల్ రికార్డు సాధించాడు. అతను కేవలం 21 ఇన్నింగ్సుల్లోనే ఈ ఘనత సాధించడం గమనార్హం.

సూపర్‌గా రాణిస్తున్న గిల్

సూపర్‌గా రాణిస్తున్న గిల్

వన్డేల్లో అద్భుతంగా ఆడుతున్న ఆటగాళ్ల యావరేజ్ 50 పైన ఉంటుంది. అదే చాలా గొప్ప. కానీ గిల్ ఈ విషయంలో తనదైన లీగ్‌లో ఉన్నాడు. తొలి 20 ఇన్నింగ్సులు ఆడిన ఏ ఆటగాడిని చూసినా.. అందరి కన్నా గిల్ యావరేజ్ ఎక్కువగా ఉంది. అతను ఆడిన 21 వన్డేల్లో అతని సగటు 73.76 ఉంది. ఇది తొలి 20 ఇన్నింగ్సుల్లో వన్డే చరిత్రలోనే ఎక్కువ. ఇంతకుముందు సౌతాఫ్రికా బ్యాటర్ రాసీ వాన్ డర్ డస్సెన్ పేరిట ఈ రికార్డు ఉండేది. అతను 69.3 సగటుతో బ్యాటింగ్ చేశాడు.

డబుల్ సెంచరీలోనూ రికార్డే

డబుల్ సెంచరీలోనూ రికార్డే

హైదరాబాద్‌లో జరిగిన వన్డేలో శుభ్‌మన్ గిల్ డబుల్ సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో 149 బంతుల్లో 208 పరుగులు చేశాడీ యంగ్ ఓపెనర్. దీంతో వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన అత్యంత చిన్న వయస్కుడిగా అతను రికార్డు సృష్టించాడు. ఇంతకుముందు ఈ రికార్డు ఇషాన్ కిషన్ పేరిట ఉండేది. అతను 24 సంవత్సరాల 145 రోజుల వయసులో డబుల్ సెంచరీ చేశాడు. గిల్ 23 సంవత్సరాల 132 రోజుల వయసులోనే డబుల్ సెంచరీ సాధించాడు.

టాప్ స్కోరింగ్‌లోనూ రికార్డే

టాప్ స్కోరింగ్‌లోనూ రికార్డే

కివీస్ టూర్‌లో గిల్ మరో రికార్డు కూడా బద్దలు కొట్టాడు. ఈ సిరీస్‌లో సూపర్ ఫామ్‌లో కనిపించిన అతను.. డబుల్ సెంచరీ, సెంచరీతో రాణించాడు. ఈ సిరీస్‌లో అతను మూడు వన్డేల్లో కలిపి 360 పరుగులు చేశాడు. దీంతో మూడు వన్డేల సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ రికార్డును సమం చేశాడు. బాబర్ కూడా 2016లో వెస్టిండీస్‌పై మూడు వన్డేల సిరీస్‌లో 360 పరుగులు చేశాడు.

Story first published: Thursday, January 26, 2023, 13:35 [IST]
Other articles published on Jan 26, 2023
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X