న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

#ShameOnICC: నాలుగు మ్యాచ్‌ల వర్షార్ఫణంపై ట్విట్టర్‌లో 'ట్రెండ్'

#ShameOnICC: Indian Fans Unleash Their Wrath Upon ICC After Another World Cup Washout

హైదరాబాద్: ప్రపంచకప్‌లో భాగంగా గురువారం భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దైన తర్వాత ట్విట్టర్‌లో ట్రెంట్ అవుతోన్న హ్యాష్ ట్యాగ్ #ShameOnICC.ఎడతెరిపి లేని వర్షం కారణంగా పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన మ్యాచ్ చివరకు వర్షం ఎంతకూ తగ్గకపోవడంతో అంఫైర్లు మ్యాచ్‌ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

అంతేకాదు "ప్రపంచకప్ కోసం ఇంగ్లాండ్‌ను ఎందుకు ఎంపిక చేశారు", "ధోని గ్లోవ్స్‌పై ఎంతకంత ఫోకస్", "వర్షాలకు ప్రత్యామ్నాయ వేదికలను ఎందుకు ఎంపిక చేయలేదు" అంటూ ఐసీసీకి పలు ప్రశ్నలు సంధిస్తున్నారు. ఈ టోర్నీకి ముందు ఒక ప్రపంచకప్‌లో వర్షం వల్ల రద్దయిన గరిష్ట మ్యాచ్‌ల సంఖ్య రెండు.

ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న

ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న

అయితే, ప్రస్తుతం ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌లో మాత్రం మూడో వంతు పూర్తయ్యేసరికే నాలుగు మ్యాచ్‌లు వర్షార్ఫణమయ్యాయి. అందులోనూ నాలుగు రోజుల వ్యవధిలో మూడు మ్యాచ్‌లు రద్దవడంతో క్రికెట్‌ అభిమానులు నిరాశకు గురవుతున్నారు. ప్రపంచకప్‌ను ప్రత్యక్షంగా వీక్షించాలని వేలాది మంది ఇంగ్లండ్‌లో అడుగుపెట్టారు.

తాహతకు మించి ఖర్చుపెట్టి

తాహతకు మించి ఖర్చుపెట్టి

కొంతమంది అభిమానులు తమ తాహతకు మించి ఖర్చుపెట్టి మరీ మ్యాచ్‌లు చూసేందుకు ఇంగ్లాండ్‌కు పయనమయ్యారు. ప్రస్తుతం వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. గురువారం భారత్-న్యూజిలాండ్ రద్దవడంపై ఓ అభిమాని మాట్లాడుతూ "ఈ మ్యాచ్ చూసేందుకు సింగపూర్ నుంచి వచ్చా. సుమారు రూ. 70 వేలు వెచ్చించి టిక్‌ట్ కొనుగోలు చేశా. అదంతా వృథా అయినట్లే" అని అన్నాడు.

ఆదివారం భారత్-పాక్ మ్యాచ్

ఆదివారం భారత్-పాక్ మ్యాచ్

మరోవైపు టోర్నీకే హై ఓల్టేజ్ మ్యాచ్‌గా నిలిచే భారత్-పాక్ మ్యాచ్ ఆదివారం మాంచెస్టర్ వేదికగా జరగనుంది. ఇప్పిటకే, ఈ మ్యాచ్ టికెట్లు మొత్తం అమ్ముడుపోయాయి. బ్లాక్ మార్కెట్‌లో ఈ మ్యాచ్ టికెట్ దాదాపు రూ. 2 లక్షలు పలుకుతోంది. వర్షం కారణంగా ఈ మ్యాచ్ కూడా రద్దైతే అభిమానులు ఎంతో అసహనానికి గురవుతారు.

ఐసీసీ నిబంధనల ప్రకారం

ఐసీసీ నిబంధనల ప్రకారం

ఐసీసీ నిబంధనల ప్రకారం ఒక్క బంతి కూడా పడకుండా మ్యాచ్ రైద్దెతే టికెట్ డబ్బులు తిరిగేస్తోంది. కానీ, మ్యాచ్ చూడడానికి వచ్చిన వారిలో అధిక శాతం మంది టికెట్లు థర్డ్‌పార్టీ వద్ద నుంచి కొనుగోలు చేసినవారే కావడంతో దీని వల్ల వారికి ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. ఇక, ప్రసార హక్కులు పొందిన సంస్థలకు ఇన్సూరెన్స్ రూపంలో భద్రత ఉంటుంది.

లక్షలు ఖర్చుపెట్టి భారత్ నుంచి ఇంగ్లాండ్‌కు

లక్షలు ఖర్చుపెట్టి భారత్ నుంచి ఇంగ్లాండ్‌కు

అయితే, లక్షలు ఖర్చుపెట్టి భారత్ నుంచి ఇంగ్లాండ్‌కు వెళ్లిన సగటు క్రికెట్ అభిమానికి మాత్రం నిరాశే మిగులుతుంది. మరోవైపు ప్రపంచకప్‌లో మ్యాచ్‌లు వరుసగా రద్దవుతున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. పాయింట్ల పట్టికలో నాలుగు విజయాలతో అన్ని జట్లనూ వెనక్కి నెట్టి వరుణుడు అగ్రస్థానానికి చేరినట్లు ఉన్న ట్వీట్ తెగ ఆకట్టుకుంటోంది.

Story first published: Friday, June 14, 2019, 13:33 [IST]
Other articles published on Jun 14, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X