న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఎవరికి దక్కేనో చోటు!: విండిస్ పర్యటనకు జులై 21న టీమిండియా ఎంపిక

India vs West Indies 2019 : Selection Committee To Meet On July 21 To Pick India's Squad For WI Tour
Selection Committee To Meet On July 21 To Pick Indias Squad For West Indies Tour


హైదరాబాద్: ప్రపంచకప్ ముగిసిన తర్వాత టీమిండియా విండిస్ పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనకు వెళ్లే టీమిండియాను సెల‌క్ష‌న్ క‌మిటీ జులై 21న ఎంపిక చేయ‌నుంది. ఆదివారం ముంబైలోని బీసీసీఐ హెడ్ క్వార్టర్స్‌లో జరిగే
సమావేశం అనంతరం ఎమ్మెస్కే ప్రసాద్ నాయకత్వంలోని సెలక్టర్లు జ‌ట్ల‌ను ప్రకటించనున్నారు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

జట్టు భవిష్యత్తును, వచ్చే ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని యువ ఆటగాళ్లను తీసుకునే అవకాశం ఉంది. ప్రపంచకప్‌లో పేలవ ప్రదర్శన చేసిన దినేష్ కార్తీక్, కేదార్ జాదవ్‌లు ఈ పర్యటనలో ఎంపికవడం అనుమానంగానే ఉంది.

విండిస్-ఏతో జరుగుతున్న మ్యాచ్‌ల్లో అద్భుత ప్రదర్శన చేస్తున్న మనీశ్ పాండే, దేశవాళీ క్రికెట్‌లో రాణించిన మయాంక్ అగర్వాల్, శ్రేయస్ అయ్యర్, శుభ్‌మన్ గిల్‌లవైపు సెలక్టర్లు మొగ్గు చూపే అవకాశం ఉంది. వీరిలో ఎవరో ఒకరిని నాలుగో స్థానంలో ఆడించే అవకాశం ఉంది. ఇక, యువ ఆటగాడు పృథ్వీషా రూపంలో మరో ఆప్షన్ ఉన్నప్పటికీ అతడు గాయం నుంచి ఇంకా కోలుకోపోవడంతో అతడికి కూడా చోటు దక్కకపోవచ్చు.

బుమ్రాకు విశ్రాంతి!

బుమ్రాకు విశ్రాంతి!

విండీస్ పర్యటనలో వన్డే, టీ20 సిరీస్‌ల నుంచి పేసర్ బుమ్రాకు విశ్రాంతినిచ్చి టెస్టు జట్టులోకి తీసుకోవాలని సెలక్టర్లు యోచిస్తున్నారు. భువనేశ్వర్, షమీ ప్రధాన బౌలర్లుగా ఎంపికవ్వడం లాంఛనంగానే కనిపిస్తోంది. అలాగే చాహల్, కుల్‌దీప్ స్పిన్నర్లుగా ఉంటారు. వీరితో పాటు బౌలింగ్ యువ పేసర్లు నవ్‌దీప్ సైనీ, ఖలీల్ అహ్మద్, లెగ్‌స్పిన్నర్ దీపక్ చాహర్‌లను సెలక్టర్లు పరిగణలోకి తీసుకోనున్నారు.

కోహ్లీ ఉంటాడా లేదా?

కోహ్లీ ఉంటాడా లేదా?

విండీస్ పర్యటనలో టీ20, వన్డే సిరీస్‌లకు విశ్రాంతి తీసుకొని కెప్టెన్ కోహ్లీ టెస్టులు ఆడుతాడని తొలుత వార్తలు వచ్చాయి. అయితే ఆ తర్వాత గురువారం స్వదేశానికి రావడంతో విశ్రాంతి వద్దని వెస్టిండిస్ పర్యటనకు సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సొంతగడ్డపై బిజీ షెడ్యూల్ నేపథ్యంలో కోహ్లీకి విశ్రాంతినిచ్చి రోహిత్‌కు విండీస్ పర్యటనలో టీ20, వన్డేల పగ్గాలు అప్పగించే అవకాశాలు ఉన్నాయి.

ధోనీపై ఏం తేలుస్తారో?

ధోనీపై ఏం తేలుస్తారో?

వెస్టిండిస్ పర్యటనకు ధోని ఎంపకవుతాడా? లేదా అని అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న. సెలక్టర్లు సైతం ఈ అంశంపై జులై 21న జరిగే సమావేశంలో చర్చించనున్నారు. ఈ క్రమంలో సెలక్టర్లు ధోనితో మాట్లాడే అవకాశం ఉంది. మరి ధోనీకి రిటైరవ్వాలని చెబుతారా? లేక విశ్రాంతినిస్తారా? అనేది ఉత్కంఠగా మారింది. పలువురు మాజీ క్రికెటర్లు ఏ విషయం అనేది ధోనికి ముందుగానే చేబితే బాగుంటుందని అంటున్నారు.

Story first published: Friday, July 19, 2019, 18:05 [IST]
Other articles published on Jul 19, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X