న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

విహారికి ఓపెనర్‌గా అవకాశం ఇవ్వాలి, వరుస సిరీస్‌లలో విఫలమే కారణం

Sanjay Manjrekar gave advice to Team India, said - Send these two players to the opening

హైదరాబాద్: పరిమిత ఓవర్ల ఫార్మాట్ మినహాయిస్తే టీమిండియా.. భారత ఓపెనర్ జోడీ ఘోరంగా విఫలమవుతోంది. ఇంకా చక్కబడతారంటూ ఎదురుచూస్తున్న కోహ్లీకి మొండిచేయి చూపిస్తున్నారు రెగ్యూలర్ ఓపెనర్లు. ఆస్ట్రేలియా వేదికగా యువ క్రికెటర్‌గా పృథ్వీ షా రాణిస్తాడని ఆశపడిన తరుణంలో తొలి టెస్టు మ్యాచ్‌‌కు ముందే జరిగిన వార్మప్ మ్యాచ్‌లో గాయం తగలడంతో టెస్టుకు దూరమైయ్యాడు. ఈ క్రమంలో ఓపెనర్‌గా అవకాశం దక్కించుకున్నా మురళీ విజయ్ ఆకట్టుకోలేకపోయాడు. అతనికి జోడిగా మరో ఎండ్‌లో ఆడుతున్న రాహుల్ మరింత ఘోరంగా పెవిలియన్ చేరుకుంటున్నాడు.

విజయ్‌ను ఓపెనర్‌గా కొనసాగిస్తూనే..

విజయ్‌ను ఓపెనర్‌గా కొనసాగిస్తూనే..

ఈ నేపథ్యంలో వరుసగా వైఫల్యాలు ఎదుర్కొంటున్న ఓపెనర్లను తప్పించాలని వారి స్థానంలో మయాంక్‌ అగర్వాల్‌ టెస్టుల్లోకి తీసుకోవాలంటూ సూచిస్తున్నారు సీనియర్లు. మాజీ క్రికెటర్‌ సంజయ్‌ మంజ్రేకర్‌ మాత్రం మురళీ విజయ్‌ను ఓపెనర్‌గా కొనసాగిస్తూనే.. అతడికి జోడీగా మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌ హనుమ విహారికి ప్రమోషన్‌ ఇవ్వాలంటున్నాడు. మంచి టెక్నిక్‌తోపాటు ఓర్పుగా క్రీజులో నిలబడడం హనుమకు ప్లస్‌ అని విశ్లేషించాడు.

మెరుపులు మెరిపించే రోహిత్‌నైనా

మెరుపులు మెరిపించే రోహిత్‌నైనా

పరిమిత ఓవర్లలో మెరుపులు మెరిపించే రోహిత్‌నైనా

దేశవాళీ టోర్నీల్లో నిలకడగా ఆడుతున్న మయాంక్ అగర్వాల్‌ను ఉన్న ఫలంగా ఆసీస్‌కు పంపించారు. ఈ అన్‌క్యాప్‌డ్ ప్లేయర్‌కు అరంగేట్రం చేసే అవకాశం ఇవ్వొచ్చు కదా అంటే మేనేజ్‌మెంట్ ఆ దిశగా ఆలోచనలు చేయదు. పోనీ పరిమిత ఓవర్లలో మెరుపులు మెరిపించే రోహిత్‌నైనా ఓపెనర్‌గా పంపొచ్చు. లేదంటే రహానేతో ఓ ప్రయోగం చేసి చూడొచ్చు. సంజయ్ మంజ్రేకర్ చెప్పినట్లు ఆల్‌రౌండర్‌గా ఆడుతున్న హైదరాబాదీ హనుమ విహారికి ఓ అవకాశం ఇవ్వాల్సింది.

అవసరాల రీత్యా శైలిని మార్చుకున్న రాహుల్‌

అవసరాల రీత్యా శైలిని మార్చుకున్న రాహుల్‌

కేఎల్‌ రాహుల్‌ భారత జట్టులోకి టెస్టు ఓపెనర్‌గానే అరంగ్రేటం చేశాడు. ఆరంభంలో తిరుగులేని డిఫెన్స్‌‌తో రాణించాడు. కానీ ఆధునిక క్రికెట్‌ అవసరాల రీత్యా రాహుల్‌ శైలిని మార్చుకున్నాడు. షార్ట్ ఫార్మాట్ టీ20 దూకుడుకు తగినట్టు రాహుల్‌ తన శైలిని మార్చుకున్నాడు. ప్రతి బంతినీ బౌండరీకి తరలించాలనే నెపంతో హిట్టింగ్ టార్గెట్‌గా కొనసాగాడు. ఇలాగే గతేడాది ఐపీఎల్‌లోనూ అదరగొట్టాడు. కళ్లుచెదిరే టీ20 ఫామ్‌ అతనిలోని టెస్టు శైలిని మార్చేసింది.

 పృథ్వీ, ధావన్ ఉంటే రాహుల్, మురళీకి చోటు దక్కదు

పృథ్వీ, ధావన్ ఉంటే రాహుల్, మురళీకి చోటు దక్కదు

శిఖర్ ధావన్ ఉద్వాసనతో మురళీ విజయ్‌కు ఓపెనింగ్ స్థానాన్ని ఖరారు చేసింది మేనేజ్‌మెంట్. కానీ జట్టు అసలు ఉద్దేశాన్ని విజయ్ ఏమాత్రం అర్థం చేసుకోవడం లేదు. సీనియర్‌గా మెరుగైన ప్రదర్శన చూపెడతాడని భావించినా.. రాహుల్ తరహాలోనే వైఫల్యాన్ని కొనసాగిస్తున్నాడు. వాస్తవానికి పృథ్వీ, ధావన్ ఉంటే రాహుల్, మురళీకి టెస్ట్‌ల్లో చోటు అనేదే దక్కదు. కానీ ఆ ఇద్దరు లేకపోవడంతో వచ్చిన అవకాశాన్ని అందుకోవడంలో వీళ్లు విఫలమవుతున్నారు. నాలుగు ఇన్నింగ్స్‌లో కలిపి మురళీ 49 పరుగులు చేశాడు.

Story first published: Saturday, December 22, 2018, 11:16 [IST]
Other articles published on Dec 22, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X