న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

గుర్రుగా చూశాడని డీమెరిట్ పాయింట్ యాడ్ చేసిన ఐసీసీ

Rubel receives demerit point for Code of Conduct breach

హైదరాబాద్: తన నిర్ణయం కాదన్నందుకు అంపైర్ వైపు కోపంగా చూసిన క్రికెటర్‌‌కు మ్యాచ్ రిఫరీ నుంచి పరాభవం ఎదురైంది. ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్ వేదికగా రాజీవ్ గాంధీ ఇంటర్నేషణల్ స్టేడియంలో అఫ్ఘనిస్థాన్ వర్సెస్ బంగ్లాదేశ్ టీ 20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో అఫ్ఘనిస్థాన్ ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది. చేధనకు దిగిన అఫ్ఘనిస్థాన్‌ పరుగులు నియంత్రించాలని యోచనలో బంగ్లాదేశ్ బాగానే కష్టపడింది. సరిగ్గా 8.5 ఓవర్లో రూబెల్ హుస్సేన్ వేసిన బంతిని అఫ్ఘాన్ బ్యాట్స్‌మన్ షేన్‌వారీ ఎదుర్కొన్నాడు. అది కాస్త స్టంప్స్ పక్కనుంచి రహీమ్ చేతికి క్యాచ్‌గా చిక్కింది.

దీంతో రూబెల్ హుస్సేన్ ఎల్బీడబ్ల్యూగా భావించి అప్పీలు కోరాడు. దానిని మైదానంలో ఫీల్డ్ అంపైర్‌ తిరస్కరించాడు... అంపైర్‌ నిర్ణయంపై అసహనం వ్యక్తం చేస్తూ.. గుర్రుగా చూడటంతో రూబెల్ అసహనం వ్యక్తం చేశాడు. మైదానంలో అంపైర్‌ నిర్ణయంపై అలా అసహనం వ్యక్తం చేయడం క్రమశిక్షణరాహిత్యం కిందకే వస్తుందంటూ.. ఐసీసీ తేల్చి చెప్పింది. అంతేకాదు, దీనికి శిక్ష విధిస్తూ.. అతని ఖాతాలో ఒక డీమెరిట్ పాయింట్‌ని కూడా చేర్చింది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేయగా.. లక్ష్యాన్ని అఫ్గానిస్థాన్ మరో 7 బంతులు మిగిలి ఉండగానే 135/4తో ఛేదించింది. కాగా, ఈ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లలోనూ ఒక్కరు కూడా హాఫ్ సెంచరీ చేయలేకపోయారు. బౌలర్‌గా మాత్రం రషీద్ ఖాన్ చెలరేగి ఆడి 4 వికెట్లు తీయగలిగాడు.

రెండో మ్యాచ్‌తో పాటు, తొలి మ్యాచ్‌లోనూ అఫ్గాన్ జట్టే గెలుపొందగా.. ఆఖరిదైన మూడో టీ20 మ్యాచ్‌ను ఇరు జట్లు నామమాత్రంగా ఆడనున్నాయి. ఈ మ్యాచ్ కూడా గెలిస్తే అఫ్ఘనిస్థాన్ సిరీస్ గెలుచుకుని సగర్వంగా వెళుతుంది. బంగ్లాదేశ్‌కు మాత్రం ఒక్క మ్యాచ్ కూడా గెలవలేకపోయిందనే పరాభవం మూటగట్టుకొని వెనుదిరుగుతోంది. ఈ మ్యాచ్ గురువారం రాత్రి 8 గంటలకి జరగనుంది.

Story first published: Thursday, June 7, 2018, 13:15 [IST]
Other articles published on Jun 7, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X