న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రోహిత్ ఖాతాలో అరుదైన మైలురాయి: 294 మ్యాచ్‌ల్లో 294 సిక్సులు

Asia Cup 2018: Rohit Sharma Catches Record of 294 Sixes In 294 Matches
Rohit Sharma’s 100th innings as an opener & 294 matches and 294 sixes in international cricket

హైదరాబాద్: ఆసియా కప్ టోర్నీలో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. మంగళవారం దుబాయి వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్ అంతర్జాతీయ క్రికెట్‌లో రోహిత్ శర్మకు ఇది 294వ మ్యాచ్ కావడం. ఓపెనర్‌గా రోహిత్ శర్మకు ఈ మ్యాచ్ 100వ ఇన్నింగ్స్ కావడం విశేషం.

294వ మ్యాచ్‌లో 294వ సిక్స్

అయితే, తన 294వ మ్యాచ్‌లో రోహిత్ శర్మ 294వ సిక్సుని బాదాడు. మంగళవారం పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ మూడు సిక్సులు బాదడం ద్వారా ఈ మైలురాయిని అందుకున్నాడు. ఇందుకు సంబంధించిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. రోహిత్ శర్మ ఇప్పటివరకు 25 టెస్టుల్లో 29 సిక్సులు, 185 వన్డేల్లో 176 సిక్సులు, 84 టీ20ల్లో 89 సిక్సులు బాదాడు.

హైఓల్టేజ్ మ్యాచ్‌లో భారత్ అద్భుత విజయం

హైఓల్టేజ్ మ్యాచ్‌లో భారత్ అద్భుత విజయం

ఇదిలా ఉంటే, ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూసిన ఓ హైఓల్టేజ్ మ్యాచ్‌లో భారత్ అద్భుత విజయాన్ని అందుకుంది. గతేడాది ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఓటమికి యూఏఈ వేదికగా జరుగుతున్న ఆసియా కప్ టోర్నీలో పాకిస్థాన్‌పై భారత జట్టు బదులు తీర్చుకుంది. మంగళవారం దుబాయి ఇంటర్నేషన్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో పాక్‌పై టీమిండియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

పాక్‌పై బంతుల పరంగా ఇదే అతిపెద్ద విజయం

పాక్‌పై బంతుల పరంగా ఇదే అతిపెద్ద విజయం

చిరకాల ప్రత్యర్ధి పాకిస్థాన్‌పై బంతుల పరంగా భారత్‌కు ఇదే అతిపెద్ద విజయం కావడం విశేషం. పాకిస్థాన్ నిర్దేశించిన 163 పరుగుల విజయ లక్ష్యాన్ని టీమిండియా 29 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసి లక్ష్యాన్ని చేధించింది. భారత జట్టులో కెప్టెన్ రోహిత్ శర్మ (52) హాఫ్ సెంచరీతో రాణించగా, మరో ఓపెనర్ శిఖర్ ధావన్ (46) పరుగులతో తృటిలో హాఫ్ సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు.

భువీకి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు

భువీకి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు

అనంతరం క్రీజులోకి వచ్చిన అంబటి రాయుడు(31 నాటౌట్), దినేశ్ కార్తీక్ (31 నాటౌట్) పరుగులతో భారత జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. పాక్ బౌలర్లలో ఫహీమ్ అష్రఫ్, షాదబ్ ఖాన్ చెరో వికెట్ తీసుకున్నారు. అంతకముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ జట్టు భారత బౌలర్లలో భువనేశ్వర్ (3/15), కేదార్ జాదవ్ (3/23), బుమ్రా (2/23) విజృంభించడంతో 43.1 ఓవర్లలో 162 పరుగులకే ఆలౌటైంది. భువనేశ్వర్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.

Story first published: Thursday, September 20, 2018, 12:38 [IST]
Other articles published on Sep 20, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X