న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టీ20 క్రికెట్‌లో రోహిత్ శర్మ అరుదైన ఘనత

By Nageshwara Rao
Rohit Sharma becomes 1st Indian to hit 300 sixes in T20 cricket

హైదరాబాద్: ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్ టోర్నీలో భాగంగా శుక్రవారం రాత్రి ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో కింగ్స్‌ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ 6 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.

తాజా విజయంతో టోర్నీలో ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్‌ ఆశలు సజీవంగా ఉంచుకుంది. శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో రెండు సిక్సర్లు బాదిన ముంబై కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. టీ20 క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత బ్యాట్స్‌మెన్‌గా రికార్డు సృష్టించాడు.

ముజీబ్‌ బౌలింగ్‌లో రోహిత్ శర్మ సిక్సర్

ముజీబ్‌ బౌలింగ్‌లో రోహిత్ శర్మ సిక్సర్

ఇన్నింగ్స్ 17వ ఓవర్‌లో ముజీబ్‌ ఉర్‌ రెహ్మాన్ వేసిన బంతిని రోహిత్‌ శర్మ సిక్సర్‌గా మలిచాడు. దీంతో టీ20ల్లో రోహిత్ శర్మ అన్ని టోర్నీల్లో కలిపి 301 సిక్సర్లు బాదాడు. టీ20 ఫార్మాట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో క్రిస్‌గేల్‌(844) అగ్ర స్థానంలో కొనసాగుతున్నాడు.

అత్యధిక సిక్సులు బాదిన ఆటగాడిగా క్రిస్ గేల్

అత్యధిక సిక్సులు బాదిన ఆటగాడిగా క్రిస్ గేల్

ఆ తర్వాతి స్థానంలో కీరన్‌ పొలార్డ్‌(525), బ్రెండన్‌ మెకల్లమ్‌(445), డ్వేన్‌ స్మిత్‌(367), షేన్‌ వాట్సన్‌(357), డేవిడ్‌ వార్నర్‌ (319), రోహిత్‌ శర్మ (301) అ తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు. ఇప్పటివరకు ఐపీఎల్‌లో 168 మ్యాచ్‌లాడిన రోహిత్ శర్మ 4427 పరుగులు చేశాడు.

ఐపీఎల్‌లో రోహిత్‌ శర్మ అత్యధిక స్కోరు 109

ఐపీఎల్‌లో రోహిత్‌ శర్మ అత్యధిక స్కోరు 109

ఐపీఎల్‌లో రోహిత్‌ శర్మ అత్యధిక స్కోరు 109. ఇక, ఐపీఎల్ 11వ సీజన్‌లో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తోన్న రోహిత్ శర్మ 11 సిక్సులు, 21 బౌండరీలు నమోదు చేశాడు. రోహిత్ శర్మ నాయకత్వంలో ముంబై ఇండియన్స్ రెండుసార్లు ఐపీఎల్ ట్రోఫీ అందుకుంది.

ఆదివారం కోల్‌కతాతో మ్యాచ్

ఆదివారం కోల్‌కతాతో మ్యాచ్

ఇక, అంతర్జాతీయ టీ20ల్లో 79 మ్యాచ్‌లు ఆడిన రోహిత్‌ శర్మ 1852 పరుగులు చేశాడు. వీటిలో రెండు సెంచరీలతో పాటు, 14 హాఫ్‌ సెంచరీలు కూడా ఉన్నాయి. అంతర్జాతీయ టీ20ల్లో రోహిత్‌ అత్యధిక స్కోరు 118. కాగా, టోర్నీలో భాగంగా ముంబై ఇండియన్స్ తన తదుపరి మ్యాచ్‌ని కోల్‌కతాతో తలపడనుంది. ఈ మ్యాచ్ ఆదివారం వాంఖడె స్టేడియంలో జరగనుంది.

Story first published: Saturday, May 5, 2018, 13:49 [IST]
Other articles published on May 5, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X