న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఎమ్మెస్కే ప్రసాద్ మనోగతం: ధోనీని సెలక్టర్లు ఫేర్‌వెల్ సిరిస్‌కే ఎంపిక చేస్తారా?

Reports: Selectors to pick MS Dhoni only for his farewell series


హైదరాబాద్:
భారత్‌లో దక్షిణాఫ్రికా పర్యటన ముగిసింది. వచ్చే నెలలో భారత పర్యటనకు బంగ్లాదేశ్ రానుంది. భారత పర్యటనలో భాగంగా బంగ్లాదేశ్ జట్టు మూడు టీ20లు, రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ ఆడనుంది. ఈ సిరిస్‌‌కు భారత జట్లను చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ గురువారం ఎంపిక చేసింది.

భారత జట్లను ప్రకటించడానికి ముందు సెలక్షన్ కమిటీ బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీతో సమావేశమైంది. ఈ సమావేశంలో టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని భవిష్యత్తు గురించి కూడా చర్చించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని జట్ల ప్రకటన అనంతరం ఛీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ స్వయంగా వెల్లడించాడు.

తన ఫేర్‌వెల్ సిరిస్‌కే ఎంపిక

తన ఫేర్‌వెల్ సిరిస్‌కే ఎంపిక

బంగ్లాదేశ్‌తో సిరీస్‌కు జట్టు ఎంపికకు ముందే ధోనీతో మాట్లాడామని ఎమ్మెస్కే తెలిపాడు. యువ ఆటగాళ్లను ప్రోత్సహించాలన్న ఆలోచనలకు ధోని సైతం మద్దతు తెలిపాడని అన్నాడు. రిటైర్మెంట్‌పై తుది నిర్ణయం ధోనీదేనని... మేం పూర్తిగా భవిష్యత్తుపై దృష్టి పెట్టామని ఎమ్మెస్కే ప్రసాద్ చెప్పుకొచ్చాడు. దీంతో ధోనీని తన ఫేర్‌వెల్ సిరిస్‌కే ఎంపిక చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

సెలక్షన్ కమిటీతో ధోని

సెలక్షన్ కమిటీతో ధోని

ఈ విషయమై సెలక్షన్ కమిటీతో ధోని మాట్లాడిటన్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా వచ్చే జనవరిలో ధోని పూర్తి ఫిట్‌నెస్‌తో సెలక్షన్ కమిటీకి అందుబాటులోకి రానున్నాడు. రిటైర్మెంట్‌పై వస్తోన్న ఊహాగానాలకు కూడా ధోని ముగింపు పలకనున్నట్లు తెలిసింది. తిరిగి మైదానంలో అడుగు పెట్టబోతున్నాడు. ఇప్పటికే ధోని తన ట్రైనింగ్‌ను ప్రారంభించాడు.

జిమ్‌లో ధోని కసరత్తులు

జిమ్‌లో ధోని కసరత్తులు

ఇందులో భాగంగా జిమ్‌లో ధోని కసరత్తులు చేసినట్లుగా తెలుస్తోంది. పూర్తి స్థాయి ఫిట్‌నెస్‌ అందుకోవడానికి జార్ఖండ్‌ అండర్‌-23 జట్టుతో కలిసి ధోని ప్రాక్టీస్ చేయనున్నాడు. జాతీయ ఛాంపియన్‌షిప్ టోర్నీలో భాగంగా జార్ఖండ్ అండర్-23 జట్టు తమ తొలి మ్యాచ్‌లో భాగంగా కేరళతో తలపడనుంది. వచ్చే గురువారం నుంచి ధోని జార్ఖండ్ అండర్-23 జట్టుతో కలిసి పాక్టీస్‌ చేయనున్నాడు.

తన ఫిట్‌నెస్ ట్రైనింగ్‌ను ప్రారంభించిన ధోని

తన ఫిట్‌నెస్ ట్రైనింగ్‌ను ప్రారంభించిన ధోని

"ధోని జార్ఖండ్ సీనియర్ జట్టుతో పాటు సపోర్టింగ్ స్టాఫ్‌తో మాట్లాడాడు. జిమ్‌లో కసరత్తులు చేయడం ద్వారా ధోని తన ఫిట్‌నెస్ ట్రైనింగ్‌ను ప్రారంభించాడు. ఇందులో భాగంగా ధోని బ్యాడ్మింటన్, టెన్నిస్, బిలియర్డ్స్ ఆడాడు. జనవరి నుంచి కాంపిటేటివ్ క్రికెట్ ఆడేందుకు ధోని సిద్ధమవుతున్నాడు. ఇందులో భాగంగానే సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ధోని భాగస్వామ్యం కాలేదు" అని జేఎస్‌సీఏ అధికారి ఒకరు తెలిపారు.

గంగూలీ సైతం

గంగూలీ సైతం

మరోవైపు ధోని రిటైర్మెంట్‌పై సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ "ధోని భారత జట్టుకు గర్వకారణమని, తన హయాంలో అతడికి సముచిత గౌరవం లభిస్తుంది" అని అన్నాడు. టీమిండియాకు రెండు ప్రపంచ‌కప్‌లు అందించిన మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి ఫేర్‌వెల్ సిరిస్ ఇచ్చే ఉద్దేశ్యంతో బీసీసీఐ ఉన్నట్లు గంగూలీ చెప్పకనే చెప్పాడు.

Story first published: Friday, October 25, 2019, 14:14 [IST]
Other articles published on Oct 25, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X