RCB Playing 11 VS MI: పడిక్కల్ ఆగయా.. అజారుద్దీన్‌కు చాన్స్.. ముంబై‌తో తొలి పోరుకు ఆర్‌సీబీ తుది జట్టు ఇదే!

చెన్నై: గత కొన్ని రోజులుగా ఎదురుచూస్తున్న సందర్భం రానే వచ్చింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 సీజన్‌‌ మరికొద్ది గంటల్లోనే షురూ కానుంది. తొలి మ్యాచ్ డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్, ఇప్పటి వరకు టైటిల్ గెలవని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) మధ్య జరగనుంది. విజయంతో ఈ ఐపీఎల్ జర్నీని ప్రారంభించాలని ఇరు జట్ల తహతహలాడుతున్నాయి.

తమ ఆధిపత్యాన్ని కొనసాగించాలని రోహిత్ శర్మ నేతృత్వంలోని ముంబై ఇండియన్స్ భావిస్తుండగా.. ఫస్ట్ మ్యాచ్‌లో పటిష్ట ముంబైకి షాకిచ్చి రెట్టించిన ఉత్సాహంలో దూసుకోపోవాలనే పట్టుదలతో ఆర్‌సీబీ ఉంది. ఇరు జట్ల బలబలాల నేపథ్యంలో సమతూకంగానే ఉండటంతో హోరాహోరీ పోరు తప్పదు. అభిమానులకు కావాల్సిన మజా ఫస్ట్ మ్యాచ్‌లోనే లభించనుంది.

పడిక్కల్ ఆగయా..

పడిక్కల్ ఆగయా..

అయితే ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ బరిలోకి దిగే తుది జట్టుపై అందరిలో ఆసక్తి నెలకొంది. గత సీజన్‌లో ఓపెనర్‌గా రఫ్పాడించిన అనామక క్రికెటర్ దేవదత్ పడిక్కల్ ఈ సీజన్‌కు ముందు కరోనా బారిన పడటం ఆ జట్టును డైలామాలో పడేసింది. కానీ ప్రస్తుతం అతను కరోనా నుంచి పూర్తిగా కోలుకొని టీమ్ క్యాంప్‌లో కలిసాడు. బీసీసీఐ నిబంధన ప్రకారం హార్ట్ స్క్రీనింగ్ కూడా చేయించుకొని ప్రాక్టీస్ కూడా షురూ చేశాడు. కాబట్టి అతనికి ఫస్ట్ మ్యాచ్ ఆడేందుకు లైన్ క్లియర్ అయింది. ఇటీవల ఇంగ్లండ్‌తో ముగిసిన టీ20 సిరీస్‌లో ఓపెనర్‌గా రాణించిన కోహ్లీ.. ఐపీఎల్‌లో కూడా ఇన్నింగ్స్ ఆరంభిస్తానని తెలిపాడు. ఈ క్రమంలో పడిక్కల్‌తో కలిసి కోహ్లీ ఇన్నింగ్స్ ప్రారంభించనున్నాడు.

అజారుద్దీన్‌కే అవకాశం..

అజారుద్దీన్‌కే అవకాశం..

ఇక ఫస్ట్ డౌన్‌లో తమిళనాడు క్రికెటర్‌కు అజారుద్దీన్‌కు అవకాశం దక్కనుంది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అతను విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగాడు. పైగా అతను స్పెషలిస్ట్ కీపర్. దాంతో అతని జట్టులో చోటు ఖాయం. అతను మూడులో బ్యాటింగ్ వస్తే.. నాలుగులో ఏబీ డివిలియర్స్ బరిలోకి దిగనున్నాడు. ఇక ఏబీడీ వయసు పెరిగినా తనలో సత్తా ఏమాత్రం తగ్గలేదని గత సీజన్‌తోనే నిరూపించాడు. ఈ సారి అతనిపై కీపింగ్ బాధ్యతలు లేనందున మరింత దూకుడుగా ఆడే చాన్స్ ఉంది. ఆ తర్వాత ఐదో స్థానంలో గ్లేన్ మ్యాక్స్‌వెల్ బరిలోకి దిగనున్నాడు. భారీ మొత్తాన్ని చెల్లించి మ్యాక్సీని తీసుకోవడం ఐదో స్థానంలో ఆడించాలనే వ్యూహంలో భాగమే. కోహ్లి, డివిలియర్స్‌లు కాకుండా ఇన్నింగ్స్‌ చివర్లో మెరుపు షాట్లు ఆడే ఒక బ్యాట్స్‌మన్‌ అవసరం ఉన్న టీమ్‌ ఇప్పుడు ఆసీస్‌ ఆటగాడిపై ఆశలు పెట్టుకుంది. పైగా మ్యాక్సీ బౌలింగ్ కూడా చేయగలడు.

ముగ్గురు ఆల్‌రౌండర్లు..

ముగ్గురు ఆల్‌రౌండర్లు..

ఆరు, ఏడు, ఎనిమిది స్థానాల్లో ముగ్గురు ఆల్‌రౌండర్లు బరిలోకి దిగనున్నాడు. వాషింగ్టన్ సుంధర్ డానియల్ క్రిస్టియన్, కైల్ జెమీసన్ తుది జట్టులో అవకాశం దక్కించుకోన్నారు. ఈ ముగ్గురు అంచనాలు అందుకుంటే ఆర్‌సీబీ లోయరార్డర్ కూడా బలమవుతోంది. సుందర్ ఇటీవల మంచి ప్రదర్శన కనబర్చాడు. వేలంలో భారీ ధరకు కొనుగోలు చేసిన కైల్ జేమీసన్, మహ్మద్ సైనీ, డానియల్ క్రిస్టియన్‌లతో కూడిన పేస్ విభాగాన్ని మహ్మద్ సిరాజ్ నడిపించనున్నాడు. ఇక స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా యుజ్వేంద్ర చాహల్ జట్టులో కొనసాగనున్నాడు. అతనికి తోడు సుందర్, గ్లేన్ మ్యాక్స్‌వెల్ బౌలింగ్ చేయగలరు.

రజత్ పటిదార్/ సచిన్ బేబీ..

రజత్ పటిదార్/ సచిన్ బేబీ..

ఎక్స్‌ట్రా బ్యాట్స్‌మన్ కావాలని భావిస్తే మాత్రం నవ్‌దీప్ సైనీని పక్కనపెట్టి సచని బేబీ లేదా యువ ఆటగాడు రజత్ పటిదార్‌ను తీసుకునే అవకాశం ఉంది. వీరిని మిడిలార్డర్‌లో ఆడించే అవకాశం ఉంది. సచిన్ బేబీ అనుభవం కలిగిన ఆటగాడు కాగా.. రజత్ పటిదార్ దేశవాళీలో సత్తా చాటిన యువ ఆటగాడు. మధ్యప్రదేశ్ తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడే పటిదార్ టీ20 స్ట్రైక్‌రేట్ 143.53 అద్భుతంగా ఉంది. దేశవాళీ క్రికెట్‌లో ఇప్పటి వరకు 22 టీ20 మ్యాచ్‌లు ఆడిన పటిదార్ 34.95 సగటుతో 6 హాఫ్ సెంచరీలు చేశాడు. అత్యధిక స్కోర్ 96. పైగా పటిదార్‌ను ఆర్‌సీబీ ఏరీ కోరి తీసుకుంది. అంతేకాకుండా ఆర్‌సీబీ డైరెక్టర్ మైక్ హెసన్ కూడా ఈ యువ ఆటగాడిపై గట్టి నమ్మకంతో ఉన్నాడు. ఈ సీజన్‌లో రాణిస్తాడని ఇప్పటికే ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేశాడు. ఈ లెక్కన ఈ యువ ఆటగాడికి అవకాశం దక్కవచ్చు.

ఆర్‌సీబీ తుది జట్టు:

దేవదత్ పడిక్కల్, విరాట్ కోహ్లీ(కెప్టెన్), మహ్మద్ అజారుద్దీన్(కీపర్), ఏబీ డివిలియర్స్, గ్లేన్ మ్యాక్స్‌వెల్, డాన్ క్రిస్టియన్, వాషింగ్టన్ సుందర్, కైల్ జెమీసన్, మహ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్, నవదీప్ సైనీ/ రజత్ పటిదార్/సచిన్ బేబీ

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Thursday, April 8, 2021, 15:37 [IST]
Other articles published on Apr 8, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X