Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SA vs NZ: శతక్కొట్టిన ఫిన్ అలెన్.. ఫైనల్‌ చేరిన న్యూజిలాండ్!

ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీలో న్యూజిలాండ్ ఫైనల్ చేరింది. బుధవారం కోల్‌కతా వేదికగా జరిగిన తొలి సెమీఫైనల్లో సమష్టిగా రాణించిన న్యూజిలాండ్ 9 వికెట్ల తేడాతో సౌతాఫ్రికాను చిత్తు చేసింది. పూర్తిగా ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా మూడు విభాగాల్లో తేలిపోయింది. ఫిన్ అలెన్(33 బంతుల్లో 10 ఫోర్లు, 8 సిక్సర్లతో 100 నాటౌట్) రికార్డ్ సెంచరీతో సౌతాఫ్రికా పతనాన్ని శాసించాడు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 169 పరుగులు చేసింది. మార్కో యాన్సెన్(30 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్‌లతో 55 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో రాణించగా.. డెవాల్డ్ బ్రెవిస్(27 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 34), ట్రిస్టన్ స్టబ్స్‌(24 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 29) పర్వాలేదనిపించారు. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. న్యూజిలాండ్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ(2/34), కోల్ మెక్‌కాంచీ(2/9), రచిన్ రవీంద్ర(2/29) రెండేసి వికెట్లు తీయగా.. లాకీ ఫెర్గూసన్, జేమ్స్ నీషమ్ చెరో వికెట్ పడగొట్టారు.

Finn Allen Unbeaten 100 Powers New Zealand Past South Africa Into T20 World Cup 2026 Final

చిత్తుగా ఓడిన సౌతాఫ్రికా..

అనంతరం న్యూజిలాండ్ 12.5 ఓవర్లలో వికెట్ నష్టానికి 173 పరుగులు చేసి 43 బంతులు మిగిలి ఉండగానే విజయాన్నందుకుంది. ఫిన్ అలెన్(33 బంతుల్లో 10 ఫోర్లు, 8 సిక్స్‌లతో 100 నాటౌట్) సెంచరీతో చెలరేగగా.. టీమ్ సీఫెర్ట్(33 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 58) హాఫ్ సెంచరీతో రాణించాడు. సౌతాఫ్రికా బౌలర్లలో కగిసో రబడా ఒక్కడే ఒక వికెట్ తీసాడు. గురువారం భారత్, ఇంగ్లండ్ మధ్య జరిగే రెండో సెమీఫైనల్లో గెలిచే జట్టుతో ఆదివారం అహ్మదాబాద్ వేదికగా న్యూజిలాండ్ ఫైనల్ ఆడనుంది.

ఈ మెగా టోర్నీలో ఓటమెరుగని జట్టుగా సెమీఫైనల్ చేరిన సౌతాఫ్రికా.. కీలక మ్యాచ్‌లో అనూహ్యంగా తేలిపోయి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయింది. దాంతో ఈ మ్యాచ్ పూర్తిగా ఏకపక్షంగా సాగింది. బ్యాటింగ్ వైఫల్యం సౌతాఫ్రికా పతనాన్ని శాసించింది. టీ20 ప్రపంచకప్ చరిత్రలో న్యూజిలాండ్ ఫైనల్ చేరడం ఇది రెండోసారి. టీ20 ప్రపంచకప్ 2021 టోర్నీలోనూ న్యూజిలాండ్ ఫైనల్ చేరి ఓటమిపాలైంది.

ఓపెనర్లే బాదేసారు..

170 పరుగుల లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ తమ ఇన్నింగ్స్‌ను దూకుడుగా ప్రారంభించింది. రబడా వేసిన రెండో ఓవర్ తొలి బంతికే టీమ్ సీఫెర్ట్ ఇచ్చిన ఈజీ క్యాచ్‌ను వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ వదిలేసాడు. బ్రెవిస్ పట్టాల్సిన క్యాచ్‌ను అతన్ని అడ్డుకొని డికాక్ అందుకునే ప్రయత్నం చేశాడు. కానీ బంతి దగ్గరకు చేరుకోలేక మూల్యం చెల్లించుకున్నాడు. ఈ అవకాశంతో సీఫెర్ట్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 28 బంతుల్లో సీఫెర్ట్.. 19 బంతుల్లో ఫిన్ ఎలెనన్ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు.

ప్రమాదకరంగా మారిన ఈ జోడీని రబడా విడదీసాడు. టీమ్ సీఫెర్ట్‌ను క్లీన్ బౌల్డ్ చేసి తొలి వికెట్‌కు నమోదైన 117 పరుగుల భాగస్వామ్యానికి తెరదించాడు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. రచిన్ రవీంద్ర(13 నాటౌట్) సాయంతో ఫిన్ అలెన్ విధ్వంసం సృష్టించాడు. మార్కో యాన్సెన్ వేసిన 13వ ఓవర్‌లో ఫిన్ అలెన్ వరుసగా 4, 4, 6, 6, 4 బాది 33 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే ఫాస్టెస్ సెంచరీ బాదిన బ్యాటర్‌గా ఫిన్ అలెన్ నిలిచాడు.

Story first published: Wednesday, March 4, 2026, 22:18 [IST]
Other articles published on Mar 4, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+