పింక్ వన్డే హీరోకు రెండు వారాల క్రితం మ్యాచ్ టికెట్లే దొరకలేదు

Posted By:
Pink ODI hero Klaasen couldn't even get tickets to the match two weeks ago

హైదరాబాద్: భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జోహెన్స్ బర్గ్ వేదికగా జరిగిన నాలుగో వన్డే (పింక్ వన్డే)లో 27 బంతుల్లో 43 పరుగులు చేసి రాత్రికి రాత్రి హీరో అయ్యాడు సఫారీ జట్టు ఆటగాడు హెన్రిచ్‌ క్లాసెన్‌. అంతకముందు వరుసగా మూడు వన్డేల్లో వరుస ఓటములతో తీవ్ర ఒత్తిడిలో ఉన్న దక్షిణాఫ్రికా జట్టుకి నాలుగో వన్డేలో విజయాన్ని అందించాడు.

అలాంటి హెన్రిచ్‌ క్లాసెన్‌ రెండు వారాల క్రితం భారత్‌-దక్షిణాఫ్రికా మధ్య జరిగే నాలుగో వన్డేను కుటుంబసభ్యులతో కలిసి ప్రత్యక్షంగా చూసేందుకు నిర్వాహకులను టికెట్లు అడిగితే అతనికి టికెట్లు దొరకలేదు. దీంతో ఈ మ్యాచ్ గురించి ఆలోచించడం మానేశాడు. కానీ, ఒకరోజు ఏకంగా దక్షిణాఫ్రికా క్రికెట్‌ బోర్డు నుంచి అతడికి ఫోన్ వచ్చింది.

Pink ODI hero Klaasen couldn't even get tickets to the match two weeks ago

'జట్టులో వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్‌ క్వింటన్ డీకాక్‌ గాయపడ్డాడు. దీంతో అతడు భారత్‌తో జరిగే వన్డే సిరీస్‌తో పాటు టీ20 సిరిస్‌కు దూరమయ్యాడు. అతని స్థానంలో నిన్ను జట్టులోకి ఎంచుకున్నాం' అని బోర్డు ఆధికారి ఒకరు తెలిపారు. దీంతో అతడి సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి.

అంతేకాదు ఏ మ్యాచ్‌ చూసేందుకు అతనికి టిక్కెట్లు దొరకలేదో ఆ మ్యాచ్‌లో కీలక ఇన్నింగ్స్‌ ఆడి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. నాలుగో వన్డేలో హెన్రిచ్‌ క్లాసెన్‌ 27 బంతుల్లో 43 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు ఫోర్లు, ఒక సిక్సు ఉన్నాయి. నాలుగో వన్డేలో మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు కూడా అందుకున్నాడు.

మ్యాచ్ అనంతరం హెన్రిచ్‌ క్లాసెన్‌ మీడియాతో మాట్లాడుతూ 'కొద్ది రోజుల క్రితం జొహానెస్‌బర్గ్‌లో జరగబోయే ఈ పింక్ వన్డేను కుటుంబసభ్యులతో కలిసి చూడాలనుకున్నాను. కానీ, టిక్కెట్లు దొరకలేదు. ఆ తర్వాత అనుకోకుండా ఒక రోజు బోర్డు సెలక్టర్ల నుంచి ఫోన్‌ వచ్చింది. డీకాక్‌ స్థానంలో జట్టులోకి రావాల్సిందిగా కోరారు' అని అన్నాడు.

'టిక్కెట్ల కోసం ప్రయత్నిస్తున్న నాకు ఏకంగా జట్టులో చోటు దక్కడంతో నా ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. కేప్‌టౌన్‌లో జరిగిన వన్డేలో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాను. ఈ మ్యాచ్‌లో 6 పరుగులే చేశాను. జట్టు ఓటమి పాలైంది. జొహానెస్‌బర్గ్‌ వన్డే మాకు చాలా కీలకమైంది' అని క్లాసెన్ పేర్కొన్నాడు.

'ఇది ఓడితే మేము సిరీస్‌ చేజార్చుకున్నట్లే. కీలక మ్యాచ్‌లో బాగా ఆడటం సంతోషంగా ఉంది. మ్యాచ్‌లో అభిమానులందించిన మద్దతు మరవలేనిది. ఇలాంటి అనుభవం నేను గతంలో ఎన్నడూ చూడలేదు. నాలుగో వన్డేలో విజయం జట్టులో తప్పక ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది' అని క్లాసెన్‌ వివరించాడు.

'ఏబీ డివిలియర్స్ తిరిగి జట్టులోకి రావడంతో డ్రెస్సింగ్ రూమ్‌లో కొత్త వాతావరణం నెలకొంది. డివిలియర్స్ రాకతో జట్టులో కొత్త ఉత్సాహాం రావడంతో పాటు పింక వన్డేలో మా రికార్డుని తిరిగి నిలబెట్టుకోవడం కూడా సంతోషంగా ఉంది' అని క్లాసెన్ తెలిపాడు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Monday, February 12, 2018, 15:40 [IST]
Other articles published on Feb 12, 2018
POLLS

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి