న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బుమ్రా కన్నా షహీన్ చాలా గొప్ప.. అంత ట్యాలెంట్ బుమ్రాకు లేదు!

 Pakistan former cricketer insults Jasprit Bumrah after comparing him with Shaheen Afridi

టీమిండియా స్టార్ పేసర్ బుమ్రాను పాక్ మాజీ ఆటగాడు మరోసారి అవమానించాడు. తమ పేసర్ షహీన్‌కు ఉన్న ట్యాలెంట్ బుమ్రాకు లేదంటూ కారుకూతలు కూశాడు. అతను ఇలాంటి కామెంట్స్ చేయడం ఇదేం కొత్త కాదు. గతంలో కూడా బుమ్రాను 'బేబీ బౌలర్' అంటూ ఎగతాళి చేశాడా పాక్ మాజీ ఆల్‌రౌండర్. అతనే అబ్దుల్ రజాక్. అతను తాజాగా చేసిన కామెంట్స్ వైరల్ కావడంతో.. క్రీడాభిమానులు అతనిపై మండిపడుతున్నారు.

షహీన్ ట్యాలెంట్ బుమ్రాకు లేదట!

షహీన్ ట్యాలెంట్ బుమ్రాకు లేదట!

పాక్‌కు చెందిన ఒక వార్తా సంస్థకు ఇటీవల ఇంటర్వ్యూ ఇచ్చిన రజాక్.. బుమ్రా, షహీన్ ఇద్దరినీ పోలుస్తూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. 'షహీన్ అద్భుతమైన బౌలర్. బుమ్రా అతని దరిదాపుల్లో కూడా లేడు. అంత ట్యాలెంట్ ఉంది షహీన్ దగ్గర' అన్నాడు. ఈ మాటలు క్రీడాభిమానులకు రుచించలేదు. అయితే రజాక్ ఇలా బుమ్రాను టార్గెట్ చేయడం ఇదేం తొలిసారి కాదు. గతంలో ఒకసారి బుమ్రా గురించి మాట్లాడుతూ.. అతనో 'బేబీ బౌలర్' అనేశాడు. 'నేను ఆడే సమయంలో వసీం అక్రమ్, గ్లెన్ మెక్‌గ్రాత్ వంటి వారిని ఎదుర్కొన్నా.. నా ముందు బుమ్రా చాలా పిల్ల బౌలర్. నేను ఇంకా ఆడుతూ ఉంటే బుమ్రాకు చుక్కలు చూపించేవాడిని' అన్నాడు.

గాయం నుంచి కోలుకోని బుమ్రా..

గాయం నుంచి కోలుకోని బుమ్రా..

ప్రస్తుతం బుమ్రా వెన్నునొప్పితో జాతీయ జట్టుకు దూరమైన సంగతి తెలిసిందే. ఆసియా కప్ ముందు అతను ఈ గాయం నుంచి కోలుకుంటాడని బీసీసీఐ భావించింది. కానీ అది జరగలేదు. ఆ తర్వాత టీ20 వరల్డ్ కప్ ఆడేందుకు అతన్ని హడావుడిగా రెడీ చేయడానికి ప్రయత్నించింది. కానీ ఆ స్ట్రాటజీ మిస్‌ఫైర్ అవడంతో బుమ్రా మళ్లీ ఆస్పత్రి పాలయ్యాడు. దీంతో టీ20 వరల్డ్ కప్‌లో కూడా బుమ్రా ఆడలేదు. అతను ఇంకా తన గాయం నుంచి కోలుకోలేదు. దీంతో చాలా కీలకమైన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తొలి రెండు టెస్టులకు కూడా అతన్ని ఎంపిక చేయలేదు.

అఫ్రిదీ కూడా ఆటకు దూరం..

అఫ్రిదీ కూడా ఆటకు దూరం..

షహీన్ అఫ్రిదీ కూడా పాక్ జట్టుకు దూరమయ్యాడు. మోకాలి గాయంతో ఆసియా కప్‌లో అతను కూడా ఆడలేదు. ఆ తర్వాత టీ20 వరల్డ్ కప్‌లో జట్టుతో కలిశాడు. ఆ టోర్నీ ఫైనల్‌లో ఫీల్డింగ్ చేస్తూ డైవ్ చేయడంతో అతని గాయం తిరగబెట్టింది. దీంతో మళ్లీ జట్టుకు దూరమయ్యాడు. ప్రస్తుతం పాక్ ఆడుతున్న ఏ సిరీసులోనూ షహీన్ ఆడటం లేదు. ఈ ఏడాది జరిగే పాకిస్తాన్ సూపర్ లీడ్ సమయానికి అతను కోలుకుంటాడని అంటున్నారు. అప్పటి వరకు అతను ఆటకు దూరమవ్వక తప్పదని సమాచారం. ఈ క్రమంలో రజాక్ చేసిన కామెంట్స్‌పై క్రీడాభిమానులు మండి పడుతున్నారు. వీళ్లిద్దరూ ఆయా జట్లలో కీలకమైన ఆటగాళ్లని, వాళ్లను పోల్చి నీ చెత్తబుద్ధి బయటపెట్టాల్సిన అవసరం లేదని తిట్టిపోస్తున్నారు.

Story first published: Tuesday, January 31, 2023, 14:20 [IST]
Other articles published on Jan 31, 2023
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X