న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'మాజీ క్రికెటర్లూ.. యూట్యూబ్‌ ఛానెల్‌లను నడపవద్దు'

Pakistan Cricket Board Coaches Banned from Running YouTube Channels

కరాచీ: కాంట్రాక్ట్ కోచ్‌లు యూట్యూబ్ ఛానెల్‌లు నడపకుండా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) నిషేధించిందని సమాచారం తెలుస్తోంది. పాక్ దేశవాళీ క్రికెట్‌తో అనుబంధం ఉన్నవాళ్లు (మాజీ క్రికెటర్లు) తమ అభిప్రాయాలను యూట్యూబ్‌ ద్వారా వెల్లడించకూడదని ఆదేశించినట్టు తెలుస్తోంది. ఈ మేరకు కొత్త కోచ్‌లకు సమాచారం ఇవ్వబడిందట. ఇక ఇంటర్వ్యూలు నిర్వహించడానికి ముందస్తు అనుమతి తీసుకోవాలి పీసీబీ సూచిందట.

దేశవాళీ క్రికెట్‌ను సమూలంగా ప్రక్షాళన చేసేందుకు పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు నడుం బిగించింది. గతంలో జాతీయ జట్టుకు ఆడిన కొందరిని కోచ్‌లుగా ఎంపిక చేసింది. వీరితో కోచింగ్‌ ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది. మహ్మద్‌ యూసుఫ్‌ను బ్యాటింగ్‌ కోచ్‌గా నియమించింది. అబ్దుల్‌ రజాక్‌, ఐజజ్‌ చీమా, బాసిత్‌ అలీ, ఫైసల్‌ ఇక్బాల్‌, గులామ్‌ అలీ, హుమయూన్‌ ఫర్హత్‌, ఇర్ఫాన్‌ అలీ, జాఫర్‌ ఇక్బాల్‌ వంటి అంతర్జాతీయ క్రికెటర్లు దేశవాళీలో కోచింగ్‌ ఇవ్వనున్నారు.

మాజీ ఫస్ట్‌క్లాస్‌ క్రికెటర్లు అఫ్తాబ్‌ ఖాన్‌, అస్లామ్‌ ఖురేషీ, ఫహద్‌ మసూద్‌, హబీబ్‌ బాలూచ్‌, హఫీజ్‌ మజిద్‌ జహంగీర్‌, హనీఫ్‌ మాలిక్‌, మహ్మద్‌ సాధిక్‌ సైతం కోచింగ్‌ ప్యానెల్‌కు ఎంపికయ్యారు. కోచింగ్‌ ప్యానెల్‌కు ఎంపికైన ఎవ్వరూ యూట్యూబ్‌లో అభిప్రాయాలు వెల్లడించకూడదని పీసీబీ ఆదేశించిందట. ఎందుకంటే.. పాక్ మాజీ కెప్టెన్ ఇంజమామ్‌ ఉల్‌ హఖ్‌, మాజీ పేసర్ షోయబ్‌ అక్తర్‌, ఫైసల్‌ ఇక్బాల్‌ సహా మరికొందరు స్వేచ్ఛగా తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు.

మాజీలు అవసరమైతే పాక్‌ క్రికెట్‌ బోర్డును తీవ్రంగా విమర్శిస్తున్నారు. ముఖ్యంగా షోయబ్‌ అక్తర్, సక్లీన్ ముష్తాక్‌. ఆటగాళ్లు బాగా ఆడితే ఆకాశానికెత్తేయడం, లేని సందర్బంలో బూతులు తిట్టడం చేస్తున్నారు. ఇంజమామ్‌ కూడా ఆటగాళ్లపై విమర్శలు గుప్పించాడు. వీరితో పాటు చాలా మంది స్పందిస్తున్నారు అందుకే సామాజిక మాధ్యమాల ద్వారా అభిప్రాయాలు చెప్పకూడదని పీసీబీ హెచ్చరించిందని తెలుస్తోంది.

'సూచనలు ఇవ్వకుండా కోచ్‌లు ఏం చేస్తున్నారు.. సరదాగా ఇంగ్లండ్‌ చూడడానికి వెళ్లారా?''సూచనలు ఇవ్వకుండా కోచ్‌లు ఏం చేస్తున్నారు.. సరదాగా ఇంగ్లండ్‌ చూడడానికి వెళ్లారా?'

Story first published: Tuesday, August 25, 2020, 17:51 [IST]
Other articles published on Aug 25, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X