న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

విరాట్‌కి పని తప్ప ఏ ధ్యాస ఉండదు: రాహుల్, పాండ్యా

MS Dhoni or Virat Kohli: KL Rahul, Hardik Pandya pick the ‘better captain’

హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని, ప్రస్తుత కెప్టెన్ విరాట్‌ కోహ్లీల గురించి ఇంటర్వ్యూలో అడిగితే.. ఒకరేమో మిస్టర్ కూల్‌, మరొకరేమో దూకుడుకు మారుపేరు. వీళ్లిద్దరి గురించి టీమిండియా క్రికెటర్లు రాహుల్, హార్దిక్‌ పాండ్యలను ఉత్తమ కెప్టెన్‌ ఎవరు? అంటూ సమాధానాలు అడిగితే ఆసక్తికరంగా బదులిచ్చారు.

కోహ్లీ, ధోనీలలో నచ్చిన కెప్టెన్‌

కోహ్లీ, ధోనీలలో నచ్చిన కెప్టెన్‌

ఇటీవల కేఎల్‌ రాహుల్‌, పాండ్య ఇద్దరూ కరణ్‌ జోహార్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘కోహ్లీ, ధోనీలలో ఎవరు మీకు నచ్చిన కెప్టెన్‌?' అని కరణ్ ప్రశ్నించాడు. దీనికి వెంటనే పాండ్య ‘ధోని' అని సమాధానమిచ్చాడు.

ఆయన కెప్టెన్సీ అద్భుతం

ఆయన కెప్టెన్సీ అద్భుతం

‘నేను ధోని కెప్టెన్సీలోనే జట్టులో అరంగేట్రం చేశాను. ఆయన కెప్టెన్సీ అద్భుతం' అని చెప్పాడు. ఇలా ఉత్తమమైన కెప్టెన్ ధోనీ అని చెప్పిన పాండ్య మాటలను రాహుల్‌ కూడా సమర్ధించాడు. తాను కూడా ఉత్తమమైన కెప్టెన్ ధోనీయేనని అంగీకరించాడు.

ఫిట్‌నెస్‌ పరమైన సలహాలు

ఫిట్‌నెస్‌ పరమైన సలహాలు

మరో ప్రశ్నగా ఫిట్‌నెస్‌ పరమైన సలహాలు ఎవరి దగ్గర నుంచి తీసుకుంటారు? అని అడిగినప్పుడు ఇద్దరూ ‘కోహ్లీ' అని చెప్పారు. ‘కోహ్లీ ఎప్పుడూ హాలిడే మోడ్‌లో ఉండడు. ఎప్పుడూ పని..పని..పని.. అంటాడు. ఫిట్‌నెస్‌ పరమైన సలహాలన్నీ అతడి వద్దనించే తీసుకుంటాం' అని చెప్పుకొచ్చారు.

ప్రస్టుత క్రికెటర్‌లలో మోస్ట్‌ రొమాంటిక్‌

ప్రస్టుత క్రికెటర్‌లలో మోస్ట్‌ రొమాంటిక్‌

వీటితో పాటుగా మరో ఆసక్తికరమైన ప్రశ్నగా ప్రస్టుత టీమిండియా క్రికెటర్‌లలో మోస్ట్‌ రొమాంటిక్‌ ఎవరు అనే ప్రశ్నకు వారిద్దరూ ఒకటే సమాధానం చెప్పారు. రాహుల్‌, పాండ్య ఇద్దరూ ముక్త కంఠంతో ‘విరాట్ కోహ్లీ' పేరునే చెప్పుకొచ్చారు.

Story first published: Sunday, January 6, 2019, 14:12 [IST]
Other articles published on Jan 6, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X