న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'కారణం ఎంఎస్ ధోనీ కాదు.. నేను బాగా ఆడకపోవడం వల్లే జట్టు నుంచి తొలగించారు'

MS Dhoni Impact On Parthiv Patel Says I Dont See Myself As Unlucky

చెన్నై: భారత జట్టులో చోటు కోల్పోవడానికి టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్‌ ధోనీ కారణం కాదని మాజీ వికెట్‌ కీపర్ పార్థివ్‌ పటేల్‌ తెలిపాడు. ధోనీతో సమాంతరంగా కెరీర్‌ ఉండటం పట్ల తాను ఏమాత్రం బాధపడటం లేదని, దురదృష్టవంతుడిని కాదని స్పష్టం చేశాడు. నిజానికి మహీ కన్నా ముందే తాను అరంగేట్రం చేశానని పార్థివ్‌ వెల్లడించాడు. ధోనీ భారత జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్న తర్వాత మరే ఇతర వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్‌ టీంలోకి రాలేదు. 17 ఏళ్ల పాటు మహీ తన హవా కొనసాగించాడు. దీంతో పార్థివ్‌ పటేల్‌, దినేష్ కార్తీక్ లాంటి వారికి నిరాశే ఎదురైంది.

IND vs SL 3rd ODI: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. ఏకంగా ఐదుగురు అరంగేట్రం!!IND vs SL 3rd ODI: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. ఏకంగా ఐదుగురు అరంగేట్రం!!

నేను నిరూపించుకోలేదు:

నేను నిరూపించుకోలేదు:

తాజాగా ఓ షోలో పాల్గొన్న పార్థివ్‌ పటేల్‌ పలు అంశాలపై స్పందించాడు. 'నిజాయతీగా చెబుతున్నా. ఎంఎస్ ధోనీతో సమాంతరంగా కెరీర్‌ ఉండటం దురదృష్టంగా భావించను. నిజానికి టీమిండియాలో నేనే ముందుగా అరంగేట్రం చేశాను. నా ప్రదర్శన అంతర్జాతీయ స్థాయిలో లేకపోవడంతోనే చోటు కోల్పోయాను. అవకాశాలు వచ్చినా.. నన్ను నేను నిరూపించుకోలేదు. అప్పుడు ధోనీ వచ్చాడు. ఆ తర్వాత అంతర్జాతీయ స్థాయిలో ఆడకపోవడం దురదృష్టంగా భావించను. ఎందుకంటే అప్పటికే నేను 19 టెస్టులు ఆడాను. మరిన్ని అవకాశాలు రాలేదనీ చెప్పను. 19 టెస్టులంటే చాలా ఎక్కువే' అని పార్థివ్‌ అన్నాడు.

 పంత్ భయం లేని క్రికెటర్:

పంత్ భయం లేని క్రికెటర్:

రిషబ్ పంత్ టీమిండియా భవిష్యత్తు అని పార్థివ్‌ పటేల్‌ పేర్కొన్నాడు. 'రిషబ్ పంత్ భారత క్రికెట్ భవిష్యత్తు. భయం లేని క్రికెటర్. అతడిలో నచ్చేది అదే. నేను 2018లో ఒక పర్యటనలో స్టాండ్‌బై వికెట్ కీపర్‌గా ఉన్నప్పుడు పంత్ ఫస్ట్-ఛాయిస్ కీపర్. అతని బ్యాటింగ్ మరియు వికెట్ కీపింగ్‌ను ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకుంటున్నాడు. పంత్ వికెట్ కీపింగ్ కోసం చాలా కష్టపడ్డాడు. టర్నింగ్ వికెట్లపై అతను అద్భుతంగా కీపింగ్ చేస్తున్నాడు' అని పార్థివ్‌ పటేల్‌ ప్రశంసించాడు. ఇంగ్లీష్ గడ్డపై కూడా పంత్ రాణిస్తాడని ధీమా వ్యక్తం చేశాడు. భారత్ ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే.

ఉతప్ప, సాహా కూడా:

ఉతప్ప, సాహా కూడా:

పార్థివ్‌ పటేల్‌ 2002లోనే టెస్టు క్రికెట్లో అరంగేట్రం చేశాడు. అయితే అనుకున్న స్థాయిలో రాణించలేదు. అదే సమయంలో టీమిండియాకు ఎంఎస్ ధోనీ కనిపించాడు. సౌరవ్ గంగూలీ అండతో జట్టులోకి వచ్చిన మహీ.. అందివచ్చిన అవకాశాలను ఒడిసిపట్టాడు. కార్ర్ర్ ఆరంభంలోనే కీపింగ్‌, బ్యాటింగ్‌లో సత్తాచాటాడు. ఒక్కోమెట్టు ఎదుగుతూ అంతర్జాతీయ స్టార్‌గా ఎదిగాడు. ఆపై కెప్టెన్సీలో కూడా తనదైన ముద్ర వేశాడు. దాంతో పార్థివ్‌ పటేల్, దినేశ్‌ కార్తీక్‌ ఎక్కువ అంతర్జాతీయ క్రికెట్‌ ఆడలేక పోయారు. 25 టెస్టులు, 38 వన్డేలు, 2 టీ20లు ఆడిన పార్థివ్‌.. కొన్ని నెలల క్రితమే క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. రాబిన్ ఉతప్ప, వృద్ధిమాన్ సాహా కూడా ధోనీ బాధితులే.

17 ఏళ్ల వయసులోనే:

17 ఏళ్ల వయసులోనే:

2002 ఇంగ్లండ్ పర్యటనలోని టెస్ట్ మ్యాచ్‌తో 17 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన పార్థివ్.. ఈ ఘనతను అందుకున్న అత్యంత పిన్న వికెట్ కీపర్‌గా గుర్తింపుపొందాడు. సచిన్ టెండూల్కర్ తరహాలోనే పాల బగ్గల వయసులో భారత జట్టులోకి వచ్చిన పార్థీవ్‌ను చూసి అతను మరో మాస్టర్ అవుతాడని అంతా అనుకున్నారు. కానీ ధోనీ రాకతో జట్టులో చోటు కోల్పోయిన పార్థీవ్.. మళ్లీ 2016లో కమ్‌బ్యాక్ చేశాడు. 2018 సౌతాఫ్రికా పర్యటనలో జోహన్నస్‌బర్గ్ వేదికగా జరిగిన టెస్టే పార్థీవ్ కెరీర్‌లో చివరి అంతర్జాతీయ మ్యాచ్.

Story first published: Friday, July 23, 2021, 16:31 [IST]
Other articles published on Jul 23, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X