న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అతడే సమయమిచ్చాడు: ధోనీని ఎంపిక చేయకపోవడం వెనుక కొత్త ట్విస్ట్!

MS Dhoni has given us time to prepare T20 World Cup team: Team India selector

హైదరాబాద్: సొంతగడ్డపై వచ్చే నెలలో దక్షిణాఫ్రికాతో జరిగే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు బీసీసీఐ గురువారం 15 మందితో కూడిన భారత జట్టును ప్రకటించింది. ఈ 15 మందిలో మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్‌ ధోనీకి చోటు దక్కలేదు. జట్టును ప్రకటించిన ఆంతరం జరిగే మీడియా సమావేశంలో బీసీసీఐ అధికారులు ధోనీ విషయమై ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు.

దీంతో సెలక్టర్లు ధోనీని కావాలనే జట్టులోకి తీసుకోలేదనే పుకార్లు మొదలయ్యాయి. కాగా, అవన్నీ అవాస్తవాలేనని సెలక్షన్‌ కమిటీలోని సభ్యుడొకరు ఐఎఎన్ఎస్‌కి ఇచ్చిన ఇంటర్యూలో వెల్లడించారు. వచ్చే ఏడాది ఆస్ట్రేలియా ఆతిథ్యమిస్తోన్న 2020 టీ20 వరల్డ్‌కప్‌కు జట్టును నిర్మించుకొనేందుకు, ప్రణాళికలు సిద్ధం చేయడానికి ధోనియే తమకు సమయం ఇచ్చాడని తెలిపారు.

ధోనీని విస్మరించే ప్రశ్న లేదు

ధోనీని విస్మరించే ప్రశ్న లేదు

"ధోనీని విస్మరించే ప్రశ్న లేదు. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్‌నకు ప్రణాళికలు సిద్ధం చేసుకొనేందుకు, పటిష్టమైన జట్టును రూపొందించేందుకు నిజానికి ధోనియే మాకు సమయమిచ్చాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో రిషభ్‌ పంత్‌ గాయపడితే అతడి స్థానం భర్తీచేసే మరొక ఆటగాడు లేడని ధోనీ సైతం భావిస్తున్నాడు" అని ఆ సెలక్టర్‌ చెప్పుకొచ్చాడు.

ధోనీ పాత్ర గురించి చర్చించారా?

ధోనీ పాత్ర గురించి చర్చించారా?

2019 ప్రపంచకప్‌ తర్వాత ధోనీ పాత్ర గురించి చర్చించారా? అన్న ప్రశ్నకు గాను "లేదు. భవిష్యత్తు ప్రణాళిక గురించి ధోనితో చర్చించాల్సి ఉంది. అందుకే మేం ప్రణాళికలు సిద్ధం చేసుకొనేందుకు, రిజర్వు ఆటగాళ్లను పటిష్ఠం చేసుకొనేందుకు అతడే మాకు సమయం ఇచ్చాడు. ఏదో సందర్భంలో పంత్‌ గాయపడితే, టీ20 ప్రపంచకప్‌ మిస్సయితే అప్పుడు ధోనీ లేకుంటే పరిస్థితి ఏంటన్నది చూడాలి" అని ఆయన అన్నారు.

వికెట్ కీపర్‌గానే కాదు

వికెట్ కీపర్‌గానే కాదు

"వికెట్ కీపర్‌గానే కాదు ధోని లాంటి ఫినిషర్‌ మాకింకా దొరకలేదు. విమర్శలు వచ్చినప్పటికీ వరల్డ్‌కప్ సెమీస్‌లో ధోని అనుభవం ఎంతోగానో ఉపయోగపడింది. 350 వన్డేలు, 98 టీ20లు ఆడిన ఓ గొప్ప ఆటగాడిని విమర్శించడం తేలికే. వారి జీవితంలో చాలా మంది చూసిన దానికంటే ఎక్కువ మ్యాచ్‌ల్లో ధోని జట్టులో గెలిపించాడు" అని ఆ సెలక్టర్‌ అన్నారు.

మైదానంలో గట్టి పోటీ

మైదానంలో గట్టి పోటీ

"ఈ సాంకేతిక యుగంలో, ప్రత్యర్ధి జట్టు బౌలర్లు ధోని బలాన్ని, బలహీనతను చూడటం లేదని మీరు అనుకుంటున్నారా? వారు కూడా మైదానంలో గట్టి పోటీ ఇస్తున్నారు. వారంతా ధోనికి బౌలింగ్ చేయరు. క్రీజులో ఉన్న బ్యాట్స్‌మెన్‌ను ఔట్ చేయాలని భావిస్తారు. నిజాయితీగా చెప్పాలంటే రిషబ్ పంత్ గాయపడితే.. పరిమిత్ ఓవర్ల ఫార్మాట్‌లో అతడి స్థానాన్ని భర్తీ చేసే అటగాడు ఇంకా దొరకలేదు" అని తెలిపారు.

Story first published: Friday, August 30, 2019, 18:57 [IST]
Other articles published on Aug 30, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X