న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రెండో టీ20లో హాఫ్ సెంచరీ: ధోని ఖాతాలో మరో అరుదైన ఘనత

By Nageshwara Rao
IND VS SA 2nd T20 : Twitter Goes Crazy Over Dhoni's Half-Century
Ms Dhoni created record partnerships for 5th wicket in t20s

హైదరాబాద్: మహేంద్ర సింగ్ ధోని టీ20లకు పనికిరాడని ఇటీవల కాలంలో పలువురు మాజీ క్రికెటర్లు విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు వచ్చే ఏడాది ఇంగ్లాండ్ వేదికగా జరిగే వరల్డ్ కప్ వరకు ధోని నెగ్గుకు రావడం కష్టం అని కూడా ఉన్నారు. జట్టు ఓటమి అంచుల్లో ఉన్నప్పుడు, కీలక సమయాల్లో అద్భుత ప్రదర్శన చేసి జట్టు విజయాల్లో ఎన్నోసార్లు ధోని కీలకపాత్ర పోషించాడు.

 ఇటీవలి కాలంలో ఫామ్‌లో లేని ధోని

ఇటీవలి కాలంలో ఫామ్‌లో లేని ధోని

అలాంటి ధోని ఈ మధ్య కాలంలో ఫామ్‌లో లేక పోవడంతో టీ20ల్లో ధోనీని తప్పించి యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలని సూచించారు. తనపై వచ్చిన విమర్శలకు, అనుమానాలకు ధోని దక్షిణాఫ్రికాతో బుధవారం జరిగిన రెండో టీ20లో తన బ్యాట్‌తో బదులిచ్చాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో ధోని (52 నాటౌట్) చెలరేగాడు.

 ఐదో వికెట్‌కు 98 పరుగులు భాగస్వామ్యం

ఐదో వికెట్‌కు 98 పరుగులు భాగస్వామ్యం

మరో ఎండ్‌లో మనీష్ పాండే (79 నాటౌట్) రాణించడంతో వీరిద్దరూ కలిసి కలసి ఐదో వికెట్‌కు 98 పరుగులు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో అంతర్జాతీయ టీ20ల్లో భారత తరపున ఐదో వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యాలను నమోదు చేసిన అరుదైన రికార్డుని ధోని తన ఖాతాలో వేసుకున్నాడు. మరో ఎండ్‌లో బ్యాట్స్‌మన్‌ మారుతున్నా ధోని మాత్రం స్థిరంగా ఉండి అనేక కీలక భాగస్వామ్యాలను నమోదు చేస్తునే ఉన్నాడు.

 ఐదో వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యం 102 పరుగులు

ఐదో వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యం 102 పరుగులు

టీ20ల్లో ఐదో వికెట్‌కు భారత తరపున అత్యధిక భాగస్వామ్యం 102 పరుగులు. 2013లో ఆస్ట్రేలియాతో రాజ్‌కోట్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో యువరాజ్ సింగ్, ధోని కలసి ఐదో వికెట్‌కు అజేయంగా 102 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ తర్వాతి స్థానంలో సఫారీ గడ్డపై బుధవారం రెండో టీ20లో పాండే, ధోని నెలకొల్పిన 98 పరుగుల భాగస్వామ్యం రెండో స్థానంలో నిలిచింది.

ఐదు అత్యుత్తమ భాగస్వామ్యాల్లో భాగస్వామిగా ధోని

ఐదు అత్యుత్తమ భాగస్వామ్యాల్లో భాగస్వామిగా ధోని

ఇదే సఫారీ గడ్డపై 2007లో డర్బన్‌ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ, ధోనిలు ఐదో వికెట్‌కు 85 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 2014లో మళ్లీ యువీతో కలసి ఆస్ట్రేలియాపై 84 పరుగుల భాగస్వామ్యాన్ని ధోని నెలకొల్పాడు. ఆ తర్వాత 2016లో ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీతో కలిసి 67 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఇలా టీ20ల్లో ఐదో వికెట్‌కు భారత్ తరుపున నమోదు చేసిన ఐదు అత్యుత్తమ భాగస్వామ్యాల్లో ధోని భాగస్వామిగా ఉన్నాడు.

Story first published: Thursday, February 22, 2018, 14:50 [IST]
Other articles published on Feb 22, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X