న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆఖరి ఓవర్‌లో 24 పరుగులు: ట్విట్టర్‌ను షేక్ చేసిన ధోని, అత్యధిక ట్వీట్ల వివరాలివే

IPL 2019 : MS Dhoni Continues To Create Maximum Buzz On Twitter In Week 4 Of IPL 2019 || Oneindia
MS Dhoni continues to create maximum buzz on Twitter in week 4 of IPL 2019

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 4వ వారానికి చేరుకుంది. గురువారం(ఏప్రిల్ 25) నాటికి మహేంద్ర సింగ్ ధోని నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 11 మ్యాచ్‌లాడిన చెన్నై సూపర్ కింగ్స్ 8 మ్యాచ్‌ల్లో విజయం సాధించి 16 పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

సాధారణంగా ఐపీఎల్ అనగానే కొంతమంది క్రికెటర్లు పేర్లు మార్మోగుతుంటాయి. అలాంటి క్రికెటర్లలో ధోని ఒకడు. అయితే, ఐపీఎల్ నాలుగో వారానికి చేరినప్పటికీ ధోని మానియా ఇంకా సోషల్ మీడియాను ఊపేస్తోంది. 2018లో పేలవ ప్రదర్శన కనబర్చిన ధోని... 2019 ఆరంభం నుంచీ సూపర్ ఫామ్‌తో దూసుకుపోతున్నాడు.

ఆఖరి ఓవర్‌లో 24 పరుగులు రాబట్టిన ధోని

ఆఖరి ఓవర్‌లో 24 పరుగులు రాబట్టిన ధోని

ఇందుకు నిదర్శనం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ పర్యటనల్లో ధోని ఆడిన ఇన్నింగ్స్‌లే. గత ఆదివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో అభిమానులకు పాత ధోనీని మరోసారి గుర్తు చేశాడు. ఈ మ్యాచ్‌లో ధోని విధ్వంసక ఇన్నింగ్స్‌ ఆడాడు. 48 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 84 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. సీఎస్‌కే విజయానికి ఆఖరి ఓవర్‌లో 26 పరుగులు అవసరమైన దశలో... ఆర్సీబీ బౌలర్ ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌లో తొలి ఐదు బంతుల్లో మూడు సిక్సర్లు, ఒక ఫోర్‌తో కలుపుకుని మొత్తంగా 24 పరుగులు సాధించాడు.

ఒక పరుగు తేడాతో ఆర్సీబీ విజయం

ఒక పరుగు తేడాతో ఆర్సీబీ విజయం

దీంతో ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ ఒక పరుగు తేడాతో విజయం సాధించి ఊపిరి పీల్చుకుంది. ధోని ఆడిన ఈ ఇన్నింగ్స్‌తో ట్విట్టర్‌ను షేక్ చేశాడు. ఈ సీజన్‌లో ఎక్కువ మంది ట్వీట్ చేసిన మూమెంట్‌గా ఈ ఫైనల్ ఓవర్ నిలిచింది. ఇదే మ్యాచ్‌లో సీఎస్‌కేపై ఆర్సీబీ ఒక పరుగు తేడాతో విజయం సాధించిన ట్వీట్ రెండో స్థానంలో నిలవగా... కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ 58 బంతుల్లో సెంచరీ సాధించిన ట్వీట్ మూడో స్థానంలో నిలిచింది.

ఏ మ్యాచ్‌ల గురించి అత్యధిక ట్వీట్లు

ఏ మ్యాచ్‌ల గురించి అత్యధిక ట్వీట్లు

1. #RCBvCSK

2. #KKRvRCB

3. #SRHvCSK

4. #DCvMI

5. #SRHvKKR

 ఏ జట్ల గురించి అత్యధిక ట్వీట్లు

ఏ జట్ల గురించి అత్యధిక ట్వీట్లు

1. Mumbai Indians (@mipaltan)

2. Chennai Super Kings (@ChennaiIPL)

3. Royal Challengers Bangalore (@RCBTweets)

4. Kolkata Knight Riders (@KKRiders)

5. Sunrisers Hyderabad (@SunRisers)

ఏ ప్లేయర్ గురించి అత్యధిక ట్వీట్లు

ఏ ప్లేయర్ గురించి అత్యధిక ట్వీట్లు

1. MS Dhoni (@msdhoni)

2. Virat Kohli (@imVkohli)

3. Rohit Sharma (@ImRo45)

Story first published: Thursday, April 25, 2019, 18:07 [IST]
Other articles published on Apr 25, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X