న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ధోని జట్టులో కొనసాగాలంటే... దూకుడుగా ఆడాల్సిందే: రిటైర్మెంట్‌పై అజర్

MS Dhoni To Play Aggressively As Long As He Wishes Plays For India Says Mohammad Azharuddin
Mohammad Azharuddin urges MS Dhoni to play aggressively as long as he wishes plays for India

హైదరాబాద్: ధోని ఫిట్‌గా ఉన్నంతకాలం జట్టులో కొనసాగవచ్చని, అయితే అతడు దూకుడుగా ఆడాల్సిన అవసరం ఉందని టీమిండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజహరుద్దీన్ తెలిపాడు. త్వరలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ)కు ఎన్నికలు జరగనున్నాయి. తాజాగా జరిగిన హెచ్‌సీఏ వార్షిక సర్వసభ్య సమావేశం(ఏజీఎమ్)లో తీసుకున్న నిర్ణయాలపై అజహరుద్దీన్ మండిపడ్డాడు.

మీకోసం: ప్రో కబడ్డీ 7వ సీజన్ స్పెషల్ సైట్

ధోని రిటైర్మెంట్‌పై

ధోని రిటైర్మెంట్‌పై

అదే సమయంలో ధోని రిటైర్మెంట్‌పై విలేకరులు అడిగిన ప్రశ్నకు "ఫిట్‌గా ఉన్నంతకాలం జట్టులో ధోని కొనసాగవచ్చు. అయితే, దూకుడుగా ఆడాల్సిన అవసరముంది. ప్రపంచకప్‌ జట్టులో అంబటి రాయుడును ఎంపిక చేయకపోవడంపై టీమిండియా సెలక్షన్‌ కమిటీ ఛైర్మన్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ ఇచ్చిన వివరణ సంతృప్తిగా లేదు" అని అజహరుద్దీన్‌ అన్నాడు.

ఆదివారం జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశంలో

ఆదివారం జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశంలో

కాగా, ఆదివారం జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశంలో తీసుకొన్న నిర్ణయాలతో తాము పూర్తిగా విభేదిస్తున్నామని అజహరుద్దీన్ అన్నాడు. హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు అర్షద్ అయూబ్, కార్యదర్శి శేషు నారాయణ్ తో కలిసి పాల్గొన్న అజహరుద్దీన్ మాట్లాడుతూ "హెచ్‌సీఏ ఏజీఎమ్‌లో తీసుకున్న నిర్ణయాలు ఏకపక్షంగా ఉన్నాయి. మెజారిటీ సభ్యుల మద్దుతు లేకుండానే నియామకాలు చేశారు" అని అన్నాడు.

పోటీ చేసేందుకు నేను సిద్ధంగా ఉన్నా

పోటీ చేసేందుకు నేను సిద్ధంగా ఉన్నా

"వీటిని మేము వ్యతిరేకిస్తున్నాం. ఎప్పుడు ఎన్నికలు జరిగినా పోటీ చేసేందుకు నేను సిద్ధంగా ఉన్నాను" అని అజహరుద్దీన్ చెప్పాడు. బీసీసీఐ ప్రతినిధిగా వివేక్‌ను ఎన్నుకోవడంపై ఏజీఎమ్‌లో సరైన మద్దతు లేకుండానే జరిగిందని శేషు నారాయణ్ అన్నాడు. అనర్హత పొందిన వ్యక్తులను నామినేట్‌ చేయకూడదని బీసీసీఐ నిబంధనలలో స్పష్టంగా ఉందని చెప్పాడు.

ఎథిక్స్‌ అధికారిగా జస్టిస్‌ ఎంఎన్‌ రావు

ఎథిక్స్‌ అధికారిగా జస్టిస్‌ ఎంఎన్‌ రావు

కాగా అంబుడ్స్‌మన్‌, ఎథిక్స్‌ అధికారిగా జస్టిస్‌ ఎంఎన్‌ రావు, ఎన్నికల అధికారిగా వీఎప్‌ సంపత్‌, హెచ్‌సీఏ తరపున బీసీసీఐ ప్రతినిధిగా జి.వివేకానంద ఎన్నికైనట్లు ఇన్‌ఛార్జీ అధ్యక్షుడు అనిల్‌కుమార్‌ సోమవారం అధికారికంగా మీడియాకు విడుదల చేసిన సంగతి తెలిసిందే.

Story first published: Tuesday, July 23, 2019, 12:19 [IST]
Other articles published on Jul 23, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X