న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భారత్‌లో అప్ఘనిస్థాన్‌కు హోమ్ గ్రౌండ్: ఏ స్టేడియమో తెలుసా?

Lucknow’s Ekana Stadium approved as Afghanistan’s adopted home ground in India - Report

హైదరాబాద్: లక్నోలోని ఎకానా స్టేడియాన్ని అప్ఘనిస్థాన్ క్రికెట్ బోర్డు తమ హోమ్‌ గ్రౌండ్‌గా పేర్కొంది. సుప్రీం కోర్టు నియమించిన బీసీసీఐ పాలకుల కమిటీ తమ అభ్యర్థనని అంగీకరించిందని, లక్కోలోని అటల్‌ బిహారి వాజ్‌పేయీ ఇంటర్నేషనల్‌ స్టేడియాన్ని తమ హోమ్‌ గ్రౌండ్‌గా అనుమతిచ్చిందని అప్ఘనిస్థాన్ క్రికెట్‌ బోర్డు సీఈవో అసదుల్లా ఖాన్‌ తెలిపారు.

<strong>కపిల్ దేవ్‌తో విభేదాలపై ఆసక్తికర కథనాన్ని వెల్లడించిన గవాస్కర్</strong>కపిల్ దేవ్‌తో విభేదాలపై ఆసక్తికర కథనాన్ని వెల్లడించిన గవాస్కర్

గత కొన్నేళ్లుగా అప్ఘనిస్థాన్

గత కొన్నేళ్లుగా అప్ఘనిస్థాన్

గత కొన్నేళ్లుగా అప్ఘనిస్థాన్ తన మ్యాచ్‌లను భారత్‌లోనే ఆడుతోన్న సంగతి తెలిసిందే. అయితే, ఈ మ్యాచ్‌ల కోసం డెహ్రాడూన్‌, నోయిడాలోని స్డేడియాలను గతంలో అప్ఘనిస్థాన్ హోమ్‌గ్రౌండ్‌గా బీసీసీఐ అంగీకరించింది. కానీ, డెహ్రాడూన్‌లో ఫైవ్‌ స్టార్‌ వసతులు లేకపోవడంతో అప్ఘనిస్థాన్ వేరే స్టేడియం ఇవ్వాలని గత కొంతకాలంగా బోర్డుని అభ్యర్థిస్తోంది.

అప్ఘనిస్థాన్ క్రికెట్ బోర్డు బీసీసీఐతో సమావేశం

అప్ఘనిస్థాన్ క్రికెట్ బోర్డు బీసీసీఐతో సమావేశం

ఇందులో భాగంగా గత నెలలో అప్ఘనిస్థాన్ క్రికెట్ బోర్డు బీసీసీఐతో సమావేశమైంది. ఈ సమావేశంలో బీసీసీఐ పాలకుల కమిటీ లక్నోలోని అటల్‌ బిహారి వాజ్‌పేయీ ఇంటర్నేషనల్‌ స్టేడియాన్ని అప్ఘనిస్థాన్ హోమ్‌ గ్రౌండ్‌గా అనుమతిచ్చింది. భద్రత, సౌకర్యాల దృష్ట్యా తమ సొంత దేశంలో అఫ్గానిస్థాన్‌ అంతర్జాతీయ మ్యాచ్‌లను నిర్వహించని సంగతి తెలిసిందే.

సీఈవో అసదుల్లా ఖాన్‌ మాట్లాడుతూ

సీఈవో అసదుల్లా ఖాన్‌ మాట్లాడుతూ

ఈ నేపథ్యంలో అప్ఘనిస్థాన్ క్రికెట్ బోర్డు సీఈవో అసదుల్లా ఖాన్‌ మాట్లాడుతూ "బీసీసీఐ మా అభ్యర్థనను అధికారికంగా అంగీకరించింది. డెహ్రాడూన్‌లో ఫైవ్‌స్టార్‌ వసతులు లేవు. దీని వల్ల అంతర్జాతీయ మ్యాచ్‌లను నిర్వహించడంలో మాకు సమస్యలు తలెత్తుతున్నాయి. లఖ్‌నవూలో ఇలాంటి సమస్యలు ఎదురవ్వవు" అని అన్నారు.

Story first published: Saturday, August 10, 2019, 7:38 [IST]
Other articles published on Aug 10, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X