న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోహ్లీకి రోజుకో కొత్త పేరు పెడుతున్న దిగ్గజాలు

‘Kohli and AB are like Nadal and Federer’

హైదరాబాద్: టీమిండియా కెప్టెన్, పరుగుల యంత్రం, ఆర్‌సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఇలా అతనికి ఉన్న పేర్లు రోజుకోసారి పెరుగుతూనే ఉన్నాయి. ఈ మధ్యనే ఐపీఎల్ 11లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడుతున్న విండీస్ స్టార్ ప్లేయర్ డ్వేన్ బ్రేవో ఈ మధ్యే కోహ్లికి ఫుట్‌బాల్ స్టార్ ప్లేయర్ రొనాల్డొ అంటూ పోల్చుతూ తెగ పొగిడేశాడు.

ఇప్పుడు ఇంకో ప్లేయర్ అతన్ని మరో దిగ్గజంతో పోలుస్తున్నారు. టెన్నిస్ స్టార్ ప్లేయర్ అయిన నాదల్‌తో కోహ్లీని పోల్చి అతని గొప్పదనాన్ని మరింత చాటి చెప్తున్నాడు. బెంగళూరు టీమ్‌కు పని చేసిన ఆస్ట్రేలియన్ ట్రెండ్ వుడ్‌హిల్. విరాట్ కోహ్లిని రఫెల్ నాదల్ ఆఫ్ క్రికెట్ అని అంటున్నాడు. డివిలియర్స్, విరాట్ కోహ్లి క్రికెట్‌లో ఉన్న రోజర్ ఫెదరర్, రఫెల్ నడాల్ అని వుడ్‌హిల్ చెప్పాడు.

ఆర్సీబీ టీమ్‌కు ఆడుతున్న ఈ ఇద్దరూ వన్డే క్రికెట్ ర్యాంకింగ్స్‌లో తొలి రెండు స్థానాల్లో ఉండటం విశేషం. ఈ సందర్భంగా కోహ్లిపై ప్రశంసలు కురిపించాడు వుడ్‌హిల్. కోహ్లి చాలా ప్రొఫెషనల్‌గా ఉంటాడు. అతడో గొప్ప క్రీడాకారుడు. అతని ఫిట్‌నెస్ అద్భుతం. ఒత్తిడిలో పొరపాట్లు చేయకుండా కోహ్లికి ఈ ఫిట్‌నెసే రక్షణగా నిలుస్తున్నది. అందుకే మిగతా బ్యాట్స్‌మెన్‌లాగా కోహ్లి ఓ లేజీ షాట్ ఆడటమో లేక తాను అనుకున్న రీతిలో షాట్ కొట్టలేకపోవడమంటూ ఉండదు.

అతని ఫిట్‌నెస్, మైండ్ అంత షార్ప్‌గా ఉంటాయి. అదే కోహ్లి గొప్పతనం అని వుడ్‌హిల్ చెప్పాడు. కోహ్లి, డివిలియర్స్‌లో ఎవరు గొప్ప అన్నది మాత్రం తాను చెప్పలేనని అన్నాడు. ఏపీ, ఫెదరర్ ఒకేలా ఉంటారు.. అలాగే కోహ్లి, నడాల్ కూడా అని వుడ్‌హిల్ చెప్పాడు. రెండు రోజుల ముందే విరాట్ కోహ్లిని చూస్తే తనకు క్రిస్టియానో రొనాల్డోనే గుర్తొస్తాడని బ్రేవో చెప్పిన విషయం తెలిసిందే.

ఐపీఎల్‌లో భాగంగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ చేసిన 92పరుగులతో అతను మరో రికార్డును సొంతం చేసుకున్నాడు. ఒకే జట్టు తరపున 5000పరుగుల చేసిన ఘనతను సాధించాడు. ఐపీఎల్ మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టు తరపునే ఆడుతున్న కోహ్లీ ఈ సీజన్‌లో నాలుగు మ్యాచ్‌లు ఆడి కేవలం ఒకసారే విజయాన్ని పొందగలిగాడు.

Story first published: Wednesday, April 18, 2018, 16:12 [IST]
Other articles published on Apr 18, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X