న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'విండిస్‌పై బుమ్రా సాధించిన హ్యాట్రిక్ ఖచ్చితంగా చివరిది కాదు'

Jasprit Bumrahs Hat-Trick Against West Indies Wont Be His Last, Says Irfan Pathan


హైదరాబాద్:
ఇటీవలే వెస్టిండిస్ జట్టుతో జమైకా వేదికగా జరిగిన రెండో టెస్టులో హ్యాట్రిక్ వికెట్ తీసి టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా అందరి దృష్టిని ఆకర్షించిన సంగతి తెలిసిందే. సోమవారంతో ముగిసిన ఈ టెస్టులో టీమిండియా 257 పరుగుల తేడాతో విజయం సాధించడంతో రెండు టెస్టుల సిరిస్‌ను 2-0తో కైవసం చేసుకుంది.

యాషెస్‌లో 4వ టెస్టు: ఆస్ట్రేలియా బ్యాటింగ్, స్మిత్ ఈజ్ బ్యాక్యాషెస్‌లో 4వ టెస్టు: ఆస్ట్రేలియా బ్యాటింగ్, స్మిత్ ఈజ్ బ్యాక్

వెస్టిండిస్ జట్టుపై హ్యాట్రిక్‌ సాధించిన బుమ్రాపై టీమిండియా పేసర్ ఇర్పాన్ పఠాన్ ప్రశంసల వర్షం కురిపించాడు. బుమ్రా టీమిండియాకు వరమని, వెస్టిండిస్‌పై అతడు సాధించిన హ్యాట్రిక్ చివరికాదని... భవిష్యత్తులో మరిన్ని హ్యాట్రిక్‌లు సాధిస్తాడని ఇర్పాన్ పఠాన్ ఆశాభావం వ్యక్తం చేశాడు.

పఠాన్ మాట్లాడుతూ

పఠాన్ మాట్లాడుతూ

ఓ జాతీయ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో పఠాన్ మాట్లాడుతూ "భారత జట్టులో బుమ్రా అత్యంత కీలకమైన ఆటగాడు. భారత్‌ తరఫున బుమ్రా ఆడకపోతే అది జట్టుకు తీరని లోటుగా మారుతుంది. అలాంటి అద్భుతమైన ఆటగాడు భారత జట్టులో ఉండటం టీమిండియాకు ఓ వరం" అని చెప్పుకొచ్చాడు.

అన్ని ఫార్మాట్లలో అద్భుతంగా

అన్ని ఫార్మాట్లలో అద్భుతంగా

"బుమ్రా అన్ని ఫార్మాట్లలో అద్భుతంగా రాణిస్తున్నాడు. ఇదే అతడి ఆఖరి హ్యాట్రిక్‌ కాదు" అని ఇర్ఫాన్ పఠాన్ అన్నాడు. టీమిండియా తరుపున కేవలం ముగ్గురు మాత్రమే టెస్టుల్లో హ్యాట్రిక్ వికెట్లు సాధించారు. 2001లో ఆస్ట్రేలియాపై హర్భజన్ సింగ్ ఈ ఘనత సాధించగా... 2006లో పాకిస్థాన్‌పై ఇర్పాన్ పఠాన్ హ్యాట్రిక్‌ సాధించాడు.

హ్యాట్రిక్‌ సాధించడం గొప్ప అనుభూతి

హ్యాట్రిక్‌ సాధించడం గొప్ప అనుభూతి

ఈ సందర్భంగా ఇర్పాన్ పఠాన్ తన హ్యాట్రిక్‌పై మాట్లాడుతూ "హ్యాట్రిక్‌ సాధించడం అత్యంత గొప్ప అనుభూతి. ఇది అంత సులువుగా దక్కదు. ఆటగాళ్లందరూ హ్యాట్రిక్‌ను అందుకోలేరు. హ్యాట్రిక్ అందుకుంటే అరుదైన ఘనత సాధించినట్లే" అని పఠాన్ అన్నాడు. విండీస్‌తో జరిగిన రెండో టెస్టులో బుమ్రా ఈ ఘనత సాధించిన సంగతి తెలిసిందే.

జమ్మూ అండ్ కాశ్మీర్ జట్టుకు మెంటార్‌గా కోచ్‌గా

జమ్మూ అండ్ కాశ్మీర్ జట్టుకు మెంటార్‌గా కోచ్‌గా

ప్రస్తుతం ఇర్ఫాన్ పఠాన్ జమ్మూ అండ్ కాశ్మీర్ జట్టుకు మెంటార్‌గా కోచ్‌గా వ్వవహారిస్తున్నారు. తన హ్యాట్రిక్‌ను తన కుటుంబానికి అంకితం చేస్తున్నట్లు ఇర్పాన్ పఠాన్ వెల్లడించాడు. కాగా, వెస్టిండిస్ పర్యటనలో భాగంగా టీమిండియా టీ20 సిరిస్‌ను 3-0తో కైవసం చేసుకోగా, వన్డే సిరిస్‌ను 2-0తో టెస్టు సిరిస్‌ను 2-0తో సొంతం చేసుకుంది.

Story first published: Wednesday, September 4, 2019, 16:25 [IST]
Other articles published on Sep 4, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X