న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బుమ్రా బౌలింగ్‌ చూస్తుంటే మా రోజులు గుర్తొస్తున్నాయి

Jasprit Bumrah Is The Best Indian Fast Bowler I Have Ever Seen Says Andy Roberts
Jasprit Bumrah rekindles memories of our prime says Curtly Ambrose

పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌: భారత పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌ చూస్తే మా రోజులు గుర్తొస్తున్నాయి అని విండీస్‌ దిగ్గజ బౌలర్ ఆంబ్రోస్‌ పేర్కొన్నారు. ఆంటిగ్వాలో వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా అద్భుత స్పెల్‌ ( 5/7) వేసాడు. 8 ఓవర్లు వేసి కేవలం 7 పరుగులిచ్చి 5 వికెట్లు తీశాడు. ఈ అద్భుత ప్రదర్శనపై ఎందరో మాజీలు ప్రశంసల వర్షం కురిపించారు. ఈ జాబితాలో ఆంబ్రోస్‌ కూడా చేరిపోయారు.

చాలా కాలం తర్వాత ఓ భారత బౌలర్‌ వేసిన అత్యుత్తుమ స్పెల్‌ ఇదే!!చాలా కాలం తర్వాత ఓ భారత బౌలర్‌ వేసిన అత్యుత్తుమ స్పెల్‌ ఇదే!!

 మా రోజులు గుర్తొస్తున్నాయి:

మా రోజులు గుర్తొస్తున్నాయి:

తాజాగా ఆంబ్రోస్‌ మాట్లాడుతూ... ' బుమ్రా అద్భుత బౌలర్. పిచ్‌ స్వభావాన్ని బట్టి, బ్యాట్స్‌మన్‌ ఆటతీరును గమనించి తన లెంగ్త్‌లో వైవిధ్యం ప్రదర్శిస్తున్నాడు. పిచ్‌ పరిస్థితులకు అనుగుణంగా లెంగ్త్‌ను మార్చుకుంటూ.. బ్యాట్స్‌మన్‌ను ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. బుమ్రా కోట్నీ వాల్ష్‌ను గుర్తుకుతెస్తున్నాడు. అతని బౌలింగ్‌ చూస్తే మా రోజులు గుర్తొస్తున్నాయి. అప్పట్లో మాలో ఉండే పేస్‌, దూకుడు, సామర్థ్యం అతనిలో కనిపిస్తున్నాయి. బుమ్రా విండీస్‌లో పుట్టి.. మా రోజుల్లో ఆడి ఉంటే దిగ్గజంగా నిలిచిపోయేవాడు' అని ఆంబ్రోస్‌ అన్నారు.

ఉత్తమ భారత ఫాస్ట్ బౌలర్:

ఉత్తమ భారత ఫాస్ట్ బౌలర్:

మరో దిగ్గజం ఆండీ రాబర్ట్స్ మాట్లాడుతూ... 'నేను క్రికెట్ మైదానంలో చూసిన వింతైన బౌలింగ్ యాక్షన్ ఇది. బుమ్రా బౌలింగ్ శైలిని అర్థం చేసుకోవడానికి అధ్యయనం చేయాలి. మా రోజుల్లో అతను ఉంటే మా బౌలింగ్ లైనప్‌లో సరిపోయేవాడు. బుమ్రా లాంటి బౌలర్‌ను మేము ఎప్పుడూ కలిగి లేము. టీంఇండియాకు కూడా ఇలాంటి బౌలర్ మళ్లీ దొరకడు అని నేను అనుకుంటున్నా. అప్పట్లో భారత్‌ ఎక్కువగా స్పిన్నర్లపై ఆధారపడేది. స్పిన్‌తో విదేశాల్లో మ్యాచ్‌లు గెలవడం కష్టం. కపిల్‌ లాంటి బౌలర్లు ఉన్నా సరిపోయేది కాదు. కానీ బుమ్రా లాంటి అత్యుత్తమ పేసర్‌ దొరికాడు. ఇప్పటివరకు నేను చూసిన ఉత్తమ భారత ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్‌ బుమ్రానే' అని పేర్కొన్నారు.

అత్యుత్తుమ స్పెల్‌:

అత్యుత్తుమ స్పెల్‌:

బుధవారం టీమిండియా బౌలింగ్ కోచ్ భరత్‌ అరుణ్ మాట్లాడుతూ బుమ్రాపై ప్రశంసల వర్షం కురిపించారు. 'చాలా కాలం తర్వాత ఓ భారత బౌలర్‌ వేసిన అత్యుత్తుమ స్పెల్‌ అది. మనకు కావాల్సింది వికెట్లే. బుమ్రా ఆలోచించే బౌలర్‌. బ్యాట్స్‌మన్‌, పరిస్థితులకు అనుగుణంగా లెంగ్త్‌లు మార్చుకుంటాడు. రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్‌ చూస్తే ఇదే అర్ధమవుతుంది. ఒకసారి వేసిన బంతి వెంటనే వేయడు' అని అరుణ్ తెలిపారు.

లెంగ్త్‌ను సవరించుకున్నాడు:

లెంగ్త్‌ను సవరించుకున్నాడు:

'తొలి ఇన్నింగ్స్‌లో బుమ్రా షార్ట్‌ బంతులు వేశాడు. అయితే రెండో ఇన్నింగ్స్‌లో అతను లెంగ్త్‌ను సవరించుకున్నాడు. బుమ్రా నిలకడగా 140 గంటకు కిలోమీటర్ల వేగంతో బంతులు వేస్తున్నాడు. అవసరమైనపుడు స్లో బంతులు కూడా వేస్తాడు. అది బ్యాట్స్‌మన్‌ను బట్టి ఉంటుంది. అతడి బౌలింగ్‌ శైలి భిన్నంగా ఉండటంతో బ్యాట్స్‌మెన్‌కు అర్థం కాదు. బంతులను అర్ధం చేసుకోవాలంటే చాలా సమయం పడుతుంది' అని అరుణ్ చెప్పుకొచ్చారు.

Story first published: Friday, August 30, 2019, 8:01 [IST]
Other articles published on Aug 30, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X