న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Team India : అవకాశాలు అన్నీ వేస్ట్.. చివరి హాఫ్ సెంచరీ ఎప్పుడు చేశావ్..?

 Ishan Kishan should score big in T20Is

టీ20 క్రికెట్‌లో అత్యధిక స్కోర్లు చేసే వాళ్లు ఓపెనర్లే. ఎందుకంటే వాళ్లకే తొలి బంతి నుంచి చివరి బంతి వరకు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కానీ అలాంటి అవకాశం వచ్చినా కూడా దాన్ని సరిగ్గా ఉపయోగించుకోని ఆటగాడు ఇషాన్ కిషన్. ఇదే విషయాన్ని దిగ్గజ బ్యాటర్ దినేష్ కార్తీక్ కూడా చెప్పాడు. ఎన్నో అవకాశాలు వచ్చినా కూడా ఇషాన్ కిషన్ వాటిని సరిగ్గా వాడుకోలేకపోయాడని డీకే విమర్శించాడు. ముఖ్యంగా భారత దేశంలో ఆడలేకపోవడం ఏంటని ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.

ఫామ్‌లో లేని కిషన్..

ఫామ్‌లో లేని కిషన్..

ఇషాన్ కిషన్ ఇటీవలి కాలంలో ఏమాత్రం ఆకట్టుకోవడం లేదు. అతను ఆడిన చివరి 12 టీ20ల్లో ఓపెనర్‌గా వచ్చినా కూడా ఒక్క హాఫ్ సెంచరీ చేయలేకపోయాడు. అతని టాప్ స్కోర్ శ్రీలంకపై చేసిన 36 పరుగులే. ఆ తర్వాత వరుసగా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితం అయ్యాడు. దీనిపై డీకే అసహనం వ్యక్తం చేశాడు. 'చాలా మంచి అవకాశాలు ఇచ్చినా కనీసం ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోయిన ఆటగాడు ఇషాన్ కిషన్. చివరి 11 మ్యాచుల్లో అతను హాఫ్ సెంచరీ దరిదాపులకు కూడా పోలేదు. వీటన్నింట్లో అతను ఓపెనింగ్ చేయడం గమనార్హం' అని చెప్పాడు.

చెత్త ప్రదర్శన..

చెత్త ప్రదర్శన..

టీ20 క్రికెట్‌లో ఓపెనర్‌గా రావడం ఒక లగ్జరీ అని, అది కూడా ఏసియాలో ఓపెనర్‌గా రావడం గొప్ప ఛాన్స్ అని డీకే అన్నాడు. ఇలాంటి అవకాశం వచ్చినా కిషన్ రాణించడం లేదు. అతను చివరి 10 మ్యాచుల్లో ఓపెనర్‌గా వచ్చి కేవలం 122 పరుగులే చేశాడు. వీటిలో అతని సగటు 12.2 మాత్రమే కావడం గమనార్హం. గతేడాది జూన్ నెలలో భారత్, సౌతాఫ్రికా జట్లు టీ20 సిరీస్ ఆడాయి. విశాఖపట్టణం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ చివరగా హాఫ్ సెంచరీ చేశాడు. అది 12 ఇన్నింగ్స్‌ల క్రితం జరిగిన మ్యాచ్.

 భారీ స్కోర్లు కంపల్సరీ..

భారీ స్కోర్లు కంపల్సరీ..

కివీస్‌తో మూడు టీ20ల సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో కూడా కిషన్ ఆడలేదు. అందుకే మిగతా రెండు మ్యాచుల్లో అతను రాణించడం చాలా ముఖ్యమని డీకే చెప్పాడు. 'ఈ రెండు మ్యాచులు ఇషాన్ కిషన్‌కు చాలా కీలకం. ఈ మ్యాచుల్లో అతనికి అవకాశం ఉండాలంటే.. భారీ స్కోర్లు చేయడం కంపల్సరీ. తను వన్డేల్లో తక్కువ అవకాశాలు దక్కినా అతను బాగానే రాణించాడు. ఈ ఫార్మాట్లో ఆటగాడిగా ఎదగడానికి, తనకు దక్కే అవకాశాలను మెరుగు పరుచుకునేందుకు ట్రై చేస్తున్నాడు' అని డీకే వివరించాడు.

Story first published: Sunday, January 29, 2023, 16:11 [IST]
Other articles published on Jan 29, 2023
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X