న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

విశాఖలో కోహ్లీ సెంచరీ: వెస్టిండిస్ విజయ లక్ష్యం 322

India vs West Indies, 2nd ODI: Virat Kohli remains unbeaten on 157; India 321/6 in 50 overs

హైదరాబాద్: విశాఖపట్నం వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో ఆతిథ్య జట్టు వెస్టిండిస్‌కు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ (157 నాటౌట్: 129 బంతుల్లో 13 ఫోర్లు, 4 పోర్లు) అజేయ సెంచరీకి తోడు తెలుగు తేజం అంబటి రాయుడు (73: 80 బంతుల్లో 8 ఫోర్లు) హాఫ్ సెంచరీతో రాణించడంతో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 321 పరుగులు చేసింది.

<strong>సచిన్, ధోని రికార్డు బద్దలు: భారత్‌లో 4000 పరుగులు చేసిన కోహ్లీ</strong>సచిన్, ధోని రికార్డు బద్దలు: భారత్‌లో 4000 పరుగులు చేసిన కోహ్లీ

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కోహ్లీ బ్యాటింగ్‌ని ఎంచుకున్నాడు. ఓపెనర్లు రోహిత్ శర్మ (4), శిఖర్ ధావన్ (29) తక్కువ స్కోర్లకే వెనుదిరిగినా ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన అంబటి రాయుడితో కలిసి కోహ్లీ దాదాపు 24 ఓవర్ల పాటు వికెట్ ఇవ్వకుండా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఈ క్రమంలోనే వీరిద్దరూ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు.

1
44267

మూడో వికెట్‌కి 139 పరుగుల భాగస్వామ్యం

వీరిద్దరూ కలిసి మూడో వికెట్‌కి 139 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. జట్టు స్కోరు స్కోరు 179 పరుగుల వద్ద రాయుడు ఆష్లే నర్స్‌ వేసిన 32.2వ బంతిని కూర్చొని ఆడబోయి బౌల్డ్‌ అయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన బ్యాట్స్‌మెన్ వెనువెంటనే పెవిలియన్‌కు చేరుతున్నా కోహ్లీ మాత్రం సెంచరీ వైపు దూసుకుపోయాడు.

వన్డేల్లో కోహ్లీకి ఇది 37వ సెంచరీ

ఈ క్రమంలో విరాట్ కోహ్లీ 107 బంతుల్లో 10 ఫోర్ల సాయంతో 102 పరుగుతో సెంచరీని సాధించాడు. వన్డేల్లో కోహ్లీకి ఇది 37వ సెంచరీ కావడం విశేషం. సెంచరీని అందుకునే వరకూ కనీసం ఒక్క సిక్స్ కూడా కొట్టని కోహ్లీ... ఆ తర్వాతే ఆకాశమే హద్దుగా భారీ షాట్లతో చెలరేగాడు. చివర్లో నాలుగు సిక్సర్లు బాదాడు.

చివర్లో నాలుగు సిక్సులు బాదిన కోహ్లీ

దీంతో 43.3 ఓవర్లు ముగిసే సమయానికి 248/5తో నిలిచిన టీమిండియా అలవోకగా 300 పరుగుల మార్క్‌ని దాటుకుంటూ నిర్ణీత ఓవర్లలో 321 పరుగులతో ముగించింది. భారత బ్యాట్స్‌మన్లలో ధోని (20), రిషబ్ పంత్ (17), జడేజా (13) ఆశించిన మేర రాణించలేకపోయారు. విండిస్ బౌలర్లలో నర్స్ 2, మెకాయ్ 2 వికెట్లు తీసుకోగా... శామ్యూల్స్, రోచ్ చెరో వికెట్ తీసుకున్నారు.

81 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద 10వేల మైలురాయిని

అంతకు ముందు కోహ్లీ 81 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద 10వేల మైలురాయి అందుకున్నాడు. వన్డేల్లో పది వేల పరుగులు చేసిన ఐదో భారత బ్యాట్స్‌మన్‌గా మొత్తంగా 13వ బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. ఇప్పటి వరకు భారత్ తరఫున సచిన్ టెండూల్కర్ (18,426), సౌరవ్ గంగూలీ (11,363), రాహుల్ ద్రవిడ్ (10,889), మహేంద్రసింగ్ ధోనీ (10,126) మాత్రమే ఈ రికార్డుని అందుకున్నారు. ఈ క్రమంలో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ రికార్డుని కోహ్లీ అధిగమించాడు. వన్డేల్లో పదివేల పరుగుల మైలురాయిని అందుకోవడానికి సచిన్ 259 ఇన్నింగ్స్‌లు తీసుకోగా కోహ్లీకి 205 ఇన్నింగ్స్‌లు అవసరమయ్యాయి.

విండీస్‌పై అత్యధిక సెంచరీలు బాదిన క్రికెటర్‌గా కోహ్లీ

తాజా సెంచరీతో విండీస్‌పై అత్యధిక సెంచరీలు బాదిన క్రికెటర్‌గా కోహ్లీ(6) రికార్డు సృష్టించాడు. గిబ్స్‌, ఆమ్లా, డివిలియర్స్‌ల పేరిట ఉన్న 5 సెంచరీల రికార్డును కోహ్లీ అధిగమించాడు. ఇదిలా ఉంటే విశాఖ స్టేడియంలో ఐదు ఇన్నింగ్స్‌ల్లో మూడో సెంచరీలు సాధించి సరికొత్త రికార్డు సృష్టించాడు. బంగ్లాదేశ్‌లోని మిర్‌పూర్‌లో కోహ్లీ 13 ఇన్నింగ్స్‌లో నాలుగు సెంచరీలు బాదిన కోహ్లీ ఆ తర్వాత విశాఖలోనే ఎక్కువ సెంచరీలు సాధించాడు.

Story first published: Wednesday, October 24, 2018, 18:07 [IST]
Other articles published on Oct 24, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X