న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India vs England: వందో టెస్టులో రూట్‌ హాఫ్ సెంచరీ.. ఇంగ్లండ్ స్కోర్ 171/2!!

India vs England: Joe Root, Dom Sibley fifties put England on top

చెన్నై: భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో పర్యాటక ఇంగ్లండ్‌ జట్టు క్రమంగా పుంజుకుంటోంది. వెంటవెంటనే రెండు వికెట్లు కోల్పోయినా.. భారీ స్కోర్ దిశగా సాగుతోంది. కెప్టెన్‌ జో రూట్‌ అర్ధ శతకం సాధించాడు. స్పిన్నర్ షాబాజ్ నదీమ్ వేసిన 59వ ఓవర్ చివరి బంతికి బౌండరీ బాదిన రూట్.. హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్నాడు. 110 బంతుల్లో అతడు అర్ధ శతకం చేశాడు. ఇంగ్లీష్ కెప్టెన్ కెరీర్‌లో వందో టెస్టు ఆడుతున్న విషయం తెలిసిందే. ఇటీవల ఫామ్ చేస్తూ ఇప్పటికే హాఫ్ సెంచరీ చేసిన రూట్.. సెంచరీ చేసేలా ఉన్నాడు. లంక పర్యటనలో ఓ ద్విశతకం, మరో భారీ శతకం చేసిన విషయం తెలిసిందే.

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఆరంభించిన ఇంగ్లండ్‌కు ఓపెనర్లు బర్న్స్‌, సిబ్లీ శుభారంభం చేశారు. వీరిద్దరూ ఆచితూచి ఆడుతూ భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. ఇద్ద‌రూ క‌లిసి తొలి వికెట్‌కు 63 ప‌రుగులు జోడించారు. 2017 త‌ర్వాత ఇండియాలో ప‌ర్య‌టిస్తున్న ఇంగ్లీష్ టీమ్ త‌ర‌ఫున 50కి పైగా భాగస్వామ్యం నెల‌కొల్పిన తొలి ఓపెనింగ్ జోడీ వీళ్ల‌దే కావ‌డం విశేషం. అయితే లంచ్‌కు ముందు ఇంగ్లండ్ రెండు ఓవ‌ర్ల వ్య‌వ‌ధిలో రెండు వికెట్లు కోల్పోయింది.

ప్రమాదకరంగా మారుతున్న బర్న్స్‌, సిబ్లీ జోడీని రవిచంద్రన్ అశ్విన్‌ విడదీశాడు. 24వ ఓవర్‌లో బర్న్స్‌.. వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ చేతికి చిక్కడంతో ఇంగ్లండ్ తొలి వికెట్‌ కోల్పోయింది. అనంతరం జస్ప్రీత్ బుమ్రా వేసిన 26వ ఓవర్‌లో వన్‌డౌన్‌ బ్యాట్స్‌మన్‌ లారెన్స్‌ ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు. లారెన్స్‌ పరుగుల ఖాతా తెరవకముందే పెవిలియన్‌ చేరాడు. దీంతో బుమ్రా తన టెస్ట్ కెరీర్‌లో సొంతగడ్డపై తొలి వికెట్ పడగొట్టాడు.

ఆపై క్రీజులోకి వచ్చిన కెప్టెన్‌ జో రూట్.. సిబ్లీతో కలిసి‌ మరో వికెట్‌ పడకుండా జాగ్రత్తపడ్డాడు. ఇంగ్లండ్ భోజన విరామ సమయానికి రెండు వికెట్ల నష్టానికి 67 పరుగులు చేసింది. అనంతరం రెండో సెషన్‌లో ఈ జోడి భారత బౌలర్లను ధీటుగా ఎదుర్కొన్నారు. చెత్త బంతులను బౌండరీలకు పంపుతూ స్కోర్ బోర్డును ముందుకు నడిపారు. ఈ క్రమంలోనే మొదటగా సిబ్లీ హాఫ్ సెంచరీ చేశాడు. వీరిద్దరూ రెండో సెషన్‌లో 73 పరుగుల భాగస్వామ్యం జోడించారు. దాంతో టీ విరామ సమయానికి ఆ జట్టు స్కోర్‌ 140/2గా నమోదైంది. అనంతరం బ్యాటింగ్‌ ఆరంభించిన రూట్‌ కాసేపటికే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. ఇంగ్లండ్ 67 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 171 రన్స్ చేసింది. రూట్ (64), సిబ్లీ (64) క్రీజులో ఉన్నారు.

హమ్మయ్య.. భారత్‌లో తొలి వికెట్ తీసిన బుమ్రా! చెన్నై టెస్టులో రెండు అరుదైన రికార్డులు!హమ్మయ్య.. భారత్‌లో తొలి వికెట్ తీసిన బుమ్రా! చెన్నై టెస్టులో రెండు అరుదైన రికార్డులు!

Story first published: Friday, February 5, 2021, 15:29 [IST]
Other articles published on Feb 5, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X