న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వన్డే సిరిస్ కోసం ఆస్ట్రేలియాకు పయనమైన ధోని, రోహిత్, జాదవ్

India vs Australia: MS Dhoni, Rohit Sharma among others depart for Australia for ODI series

హైదరాబాద్: నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ ముగిసింది. సిడ్నీ వేదికగా జరిగిన ఆఖరి టెస్టు మ్యాచ్‌ వర్షం కారణంగా ఈరోజు డ్రాగా ముగియగా.. నాలుగు టెస్టుల సిరీస్‌ని టీమిండియా 2-1తో కైవసం చేసుకుని సరికొత్త చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. దీంతో ఆస్ట్రేలియా గడ్డపై 72 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది.

<strong>ఐసీసీ టెస్ట్ ర్యాంకులు: రిషబ్ పంత్ ఖాతాలో మరో రికార్డు</strong>ఐసీసీ టెస్ట్ ర్యాంకులు: రిషబ్ పంత్ ఖాతాలో మరో రికార్డు

ఆసీస్ గడ్డపై తొలిసారి టెస్టు సిరిస్‌ను గెలుచుకుని టీమిండియా మూడు వన్డేల సిరిస్‌కు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో భారత క్రికెటర్లు మహేంద్ర సింగ్ ధోనీ, రోహిత్‌ శర్మ, కేదార్‌ జాదవ్‌, ఖలీల్‌ అహ్మద్‌ సోమవారం ఆస్ట్రేలియాకు పయనమయ్యారు. మూడు వన్డేల సిరిస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య తొలి వన్డే జనవరి 12న సిడ్నీ వేదికగా జరగనుంది.

దీంతో మూడు వన్డేల సిరిస్‌కు ఎంపిక చేసిన భారత జట్టులో వీరు సభ్యులుగా ఉన్నారు. ఈ క్రమంలో వీరు విమానం ఎక్కిన తర్వాత తీసుకున్న సెల్ఫీని కేదార్‌ జాదవ్‌ సోషల్‌ మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు. నిజానికి రోహిత్ శర్మ టెస్టు జట్టులో సభ్యుడిగా ఉన్నప్పటికీ కుమార్తె పుట్టడంతో సిడ్నీ వేదికగా జరిగిన చివరి టెస్టుకు దూరమైన సంగతి తెలిసిందే.

ఆసీస్‌తో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్‌ను భారత్‌ 2-1తో కైవసం చేసుకోగా.... అంతకముందు ఇరు జట్ల మధ్య జరిగిన టీ20 సిరీస్‌ సమం అయింది. ఆసీస్‌తో మూడు వన్డేల సిరిస్ అనంతరం కోహ్లీసేన న్యూజిలాండ్ పర్యటనకు బయల్దేరనుంది. న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా టీమిండియా ఐదు వన్డేలు, మూడు టీ20ల సిరిస్ ఆడనుంది.

View this post on Instagram

Off to Australia ✈️ @mahi7781

A post shared by Khaleel Ahmed (@khaleelahmed13) on

మూడు వన్డే సిరిస్‌కు భారత జట్టు:
విరాట్‌ కోహ్లి(కెప్టెన్‌), రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌, శిఖర్‌ ధావన్‌, అంబటి రాయుడు, దినేశ్‌ కార్తీక్‌, కేదార్‌ జాదవ్‌, మహేంద్ర సింగ్ ధోని, హార్దిక్‌ పాండ్యా, కుల్దీప్‌ యాదవ్‌, యజువేంద్ర చాహల్‌, రవీంద్ర జడేజా, భువనేశ్వర్‌ కుమార్‌, మహమ్మద్ సిరాజ్, మహ్మద్‌ షమీ, ఖలీల్‌ అహ్మద్‌

Story first published: Tuesday, January 8, 2019, 13:30 [IST]
Other articles published on Jan 8, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X