న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రాంచీలో మూడో వన్డే: ఆర్మీ క్యాప్‌లతో కోహ్లీసేన, టీమిండియా బౌలింగ్

India vs Australia, Live Cricket Score, 3rd ODI in Ranchi: India to Bowl First, Team Unchanged

హైదరాబాద్: ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడో వన్డే ప్రారంభమైంది. రాంచీ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బౌలింగ్ ఎంచుకున్నాడు. గత మ్యాచ్‌లో ఆడిన జట్టుతోనే టీమిండియా బరిలోకి దిగుతోంది.

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా

ఐదు వన్డేల సిరీస్‌లో ఇప్పటికే వరుసగా రెండు వన్డేల్లో గెలిచిన భారత్ జట్టు 2-0తో ఆధిక్యంలో కొనసాగుతోంది. మూడో వన్డేలోనూ గెలిచి సిరీస్‌ను చేజిక్కించుకోవాలని టీమిండియా ఉవ్విళ్లూరుతుండగా.. మరోవైపు పర్యాటక జట్టు మాత్రం మూడో వన్డేలో గెలిచి సిరిస్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలని ఆశిస్తోంది.

రాంచీలో ధోనికిదే చివరి మ్యాచ్

మరోవైపు ధోనీ సొంతగడ్డపై ఈ మ్యాచ్ జరుగుతుండగా.. వన్డే ప్రపంచకప్‌ తర్వాత ఈ మాజీ కెప్టెన్ రిటైర్మెంట్ ప్రకటిస్తాడనే వార్తలు వస్తుండటంతో రాంచీలో అతనికిదే చివరి మ్యాచ్ కానుంది. ఆస్ట్రేలియా జట్టులో కెప్టెన్ అరోన్ ఫించ్ ఒక మార్పు చేశాడు. ఫాస్ట్ బౌలర్ కౌల్టర్‌ నైల్ స్థానంలో రిచర్డ్‌సన్ తుది జట్టులోకి వచ్చాడు.

ఆర్మీ క్యాప్‌లతో బరిలోకి కోహ్లీసేన

ఇదిలా ఉంటే, పుల్వామా ఉగ్ర‌దాడిలో ప్రాణాలు కోల్పోయిన అమ‌ర జ‌వాన్ల‌కు నివాళిగా ఆర్మీ క్యాప్‌లను భారత జట్టులోని ఆటగాళ్లు ధరించారు. మ్యాచ్ ప్రారంభం కావ‌డానికి ముందు ధోని లెప్టెనెంట్ కల్నల్ హోదాలో జట్టులోని సహచర ఆటగాళ్లకు ఈ క్యాప్‌లను అందజేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోని బీసీసీఐ తన ట్విట్టర్‌లో పోస్టు చేసింది.

నేష‌న‌ల్ డిఫెన్స్ ఫండ్‌కు విరాళంగా

మరోవైపు ఈ మ్యాచ్ ద్వారా వచ్చే మొత్తాన్ని నేష‌న‌ల్ డిఫెన్స్ ఫండ్‌కు విరాళంగా ఇవ్వనున్నట్లు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ టాస్ అనంతరం వెల్లడించాడు. ఈ నిధులను పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జ‌వాన్ల పిల్ల‌ల చ‌ద‌ువు కోసం వినియోగించనున్నారు.

Story first published: Friday, March 8, 2019, 13:35 [IST]
Other articles published on Mar 8, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X