న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India vs Australia 4th ODI: ఇద్దరిపై వేటు పడనుందా?

India vs Australia 4th ODI Preview: India aim to bounce back after reality check in Ranchi

హైదరాబాద్: ప్రయోగాలకు వేదికగా మారిన ఆస్ట్రేలియా సిరీస్‌కు ఘనమైన ముగింపు ఇచ్చేందుకు భారత్ సిద్ధమైంది. భారత్‌తో ఏకపక్షంగా సాగుతున్న ఐదు వన్డే సిరీస్‌లో రాంచీ వన్డేలో ఆస్ట్రేలియా విజయం సాధించడంతో సిరిస్ ఆసక్తికరంగా మార్చేసింది. ఐదు వన్డేల ఈ సిరీస్‌లో ఇప్పటికే మూడు వన్డేలు ముగియగా.. భారత్ 2-1తో ఆధిక్యంలో కొనసాగుతోంది.

కోహ్లీకి బౌలింగ్ చేయడం అంత సులభం కాదు: ఆడమ్ జంపా ప్రశంసలుకోహ్లీకి బౌలింగ్ చేయడం అంత సులభం కాదు: ఆడమ్ జంపా ప్రశంసలు

రాంచీ వన్డే తప్పిదాలను దిద్దుకుని ఈ మ్యాచ్‌లో గెలవడం ద్వారా సిరీస్‌ని చేజిక్కించుకోవాలని భారత్ ఉవ్విళ్లూరుతోంది. ఆఖరి వన్డేలో రిజర్వ్ బెంచ్‌కు అవకాశం ఇచ్చి అందులో నుంచి యువ కుర్రాళ్లను వరల్డ్‌కప్ జట్టు కోసం ప్రత్యామ్నాయంగా ఉంచుకోవాలని చూస్తోంది. ధోని, షమీకి విశ్రాంతినిచ్చిన భారత్.. ఈ ఇద్దరి స్థానాల్లో పంత్, భువీలకు అవకాశం ఇవ్వనుంది.

1
45588
మార్పులతో బరిలోకి

మార్పులతో బరిలోకి

శుక్రవారం రాత్రి ముగిసిన రాంచీ వన్డేలో 32 పరుగుల తేడాతో భారత్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. మ్యాచ్ అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో విరాట్ కోహ్లీ మాట్లాడుతూ జట్టులో మార్పులు అనివార్యమని పరోక్షంగా వెల్లడించాడు. దీంతో రిషబ్ పంత్‌తో పాటు కనీసం రెండు మార్పులు ఉండే అవకాశాలున్నాయని వార్తలు వస్తున్నాయి.

కేఎల్ రాహుల్‌కి ఛాన్స్!

కేఎల్ రాహుల్‌కి ఛాన్స్!

పేలవ ఫామ్‌తో నిరాశపరుస్తున్న శిఖర్ ధావన్, అంబటి రాయుడిపై వేటు వేసి కేఎల్ రాహుల్‌కి ఛాన్స్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఆస్ట్రేలియాతో ముగిసిన రెండు టీ20ల సిరీస్‌లో కేఎల్ రాహుల్ వరుసగా రెండు హాఫ్ సెంచరీలు సాధించడంతో నాలుగో వన్డేలో కేఎల్ రాహల్ వైపు జట్టు మేనేజ్‌మెంట్ మొగ్గు చూపే అవకాశం ఉంది.

మిడిలార్డర్‌లో కేదార్ జాదవ్ మెరుపులు

మిడిలార్డర్‌లో కేదార్ జాదవ్ మెరుపులు

మిడిలార్డర్‌లో కేదార్ జాదవ్ (118) రాణిస్తుండటం కలిసొచ్చే అంశం. ధోనీ గైర్హాజరీతో ఫినిషింగ్ బాధ్యత జాదవ్‌పై పడింది. రిషబ్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ముగించాల్సి ఉంటుంది. శంకర్ ఆల్‌రౌండర్ పాత్రకు సరిపోయినా.. బౌలింగ్‌లో ఇంకొంత నిలకడ చూపించాల్సి ఉంది. మూడు మ్యాచ్‌ల్లో కలిపి రాయుడు చేసింది 33 పరుగులే. ఈ క్రమంలో రాయుడిపై వేటు పడితే? అప్పుడు రిషబ్ పంత్ నెం.4 స్థానంలో బ్యాటింగ్ చేయనున్నాడు.

నాలుగో వన్డేలో భువనేశ్వర్ కుమార్!

నాలుగో వన్డేలో భువనేశ్వర్ కుమార్!

బౌలింగ్ విభాగంలోనూ జస్ప్రీత్ బుమ్రా లేదా షమీకి నాలుగో వన్డేలో విశ్రాంతినిచ్చి.. భువనేశ్వర్‌ని ఆడించాలని మేనేజ్‌మెంట్ యోచిస్తోంది. అలానే మణికట్టు స్పిన్నర్ చాహల్‌‌కి కూడా చివరి రెండు వన్డేల్లో అవకాశమిచ్చి కుల్దీప్ యాదవ్ లేదా రవీంద్ర జడేజాకి విశ్రాంతి ఇవ్వడంపైనా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. నాలుగో వన్డేలో భారత్ జట్టులో ఎలాంటి మార్పులు చేయబోతున్నారు? అనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

మార్పుల్లేకుండా బరిలోకి ఆస్ట్రేలియా

మార్పుల్లేకుండా బరిలోకి ఆస్ట్రేలియా

మరోవైపు ఈ మ్యాచ్ కోసం ఆసీస్ జట్టులో మార్పులు చేయడం లేదు. మూడో వన్డేలో బరిలోకి దిగిన జట్టుతోనే బరిలోకి దిగుతోంది. ఓపెనింగ్‌లో ఫించ్, ఖవాజ ఫామ్‌లోకి రావడం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం. షాన్ మార్ష్ నిరాశపరుస్తున్నాడు. హ్యాండ్స్‌కోంబ్, మ్యాక్స్‌వెల్ బ్యాట్లు ఝుళిపిస్తే భారీ స్కోరు ఖాయం. బౌలింగ్‌లో కమిన్స్, రిచర్డ్‌సన్ ఆకట్టుకున్నారు. జంపా రాణిస్తున్నాడు. మొహాలీ పిచ్‌పై కూడా ఇలాంటి ప్రదర్శనే కనబరిస్తే ఆసీస్ కచ్చితంగా సిరీస్‌ను సమం చేస్తుంది.

జట్లు (అంచనా):

జట్లు (అంచనా):

భారత్: కోహ్లీ (కెప్టెన్), రోహిత్, ధవన్, రాయుడు, రిషబ్, కేదార్, శంకర్, భువనేశ్వర్, కుల్దీప్, చాహల్, బుమ్రా.

ఆస్ట్రేలియా: ఫించ్ (కెప్టెన్), ఖవాజ, షాన్ మార్ష్, హ్యాండ్స్‌కోంబ్, మ్యాక్స్‌వెల్, స్టోయినిస్, క్యారీ, కమిన్స్, లైయన్, రిచర్డ్‌సన్, జంపా.

మధ్యాహ్నం 1.30 నుంచి స్టార్ స్పోర్ట్స్-1లో

Story first published: Sunday, March 10, 2019, 12:57 [IST]
Other articles published on Mar 10, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X