న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రాంచీ టీ20లో భారత్ అలవోక విజయం

By Nageshwara Rao

హైదరాబాద్: రాంచీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20లో భారత్ అలవోకగా విజయం సాధించింది. డక్‌వర్త్ లూయీస్ ప్రకారం భారత్‌‌కు 6 ఓవర్లలో 48 పరుగులు నిర్ధేశించగా కోహ్లీసేన 5.3 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో తొలి టీ20లో ఆసీస్‌పై భారత్ 9 వికెట్ల (డక్ వర్త్ లూయిస్ ప్రకారం) తేడాతో విజయం సాధించింది. రోహిత్ శర్మ 11 పరుగులు చేసి అవుటవగా శిఖర్ ధావన్ 15, విరాట్ కోహ్లీ 22 పరుగులు చేశారు. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 18.4 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది.

భారత్ లక్ష్యం 6 ఓవర్లకు 48

వర్షం కారణంగా మధ్యలో ఆగిపోయిన తొలి టీ20 మ్యాచ్‌ తిరిగి ప్రారంభమైంది. రాంచీ వేదికగా ఆసీస్‌తో జరుగుతున్న తొలి టీ20లో భారత్ లక్ష్యాన్ని 6 ఓవర్లకు గాను 48 పరుగులుగా నిర్దేశించారు. తొలి టీ20కి వర్షం అంతరాయం కలిగించడంతో అంఫైర్లు డక్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం కోహ్లీసేనకు ఈ లక్ష్యాన్ని నిర్దేశించారు.

దీంతో సుమారు గంటన్నర పాటు ఆట నిలిచిపోయింది. అంతకముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌ ప్రారంభించిన ఆసీస్‌ 18.4 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసిన క్రమంలో వరుణుడు అంతరాయం కలిగించాడు.

వర్షంతో నిలిచిన మ్యాచ్, ఆసీస్ 118/8
రాంచీ వేదికగా ఆస్టేలియా-భారత్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టీ20కి వరుణుడు అడ్డుపడ్డాడు. ఆసీస్ ఇన్నింగ్స్ పూర్తి కావడానికి మరో 8 బంతుల మిగిలి ఉండగా వర్షం కురవడంతో ఆటను నిలిపివేశారు. వర్షం వచ్చే సమయానికి ఆస్ట్రేలియా 18.4 ఓవర్లకు గాను 8 వికెట్లు కోల్పోయి 118 పరుగులు చేసింది.

Rain

ప్రస్తుతం టై(0), జంపా(4) క్రీజులో ఉన్నారు. టీ20 మ్యాచ్ కావడంతో ఆసీస్ ఇన్నింగ్స్ ముగియడానికి ఇంకా 8 బంతులు మిగిలున్నాయి. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ ప్రారంభించిన ఆసీస్‌ 8 పరుగుల వద్ద కెప్టెన్‌ వార్నర్‌(8) రూపంలో తొలి వికెట్‌ను కోల్పోయింది. ఆ తర్వాత ఆరోన్ ఫించ్‌(42) కాస్త ఫరవాలేదనిపించాడు.

అనంతరం మాక్స్‌వెల్‌(17), హెడ్‌ (9), హెన్రిక్స్‌(8), క్రిస్టియన్‌(9), పెయిన్‌(17), నైల్‌(1) స్వల్ప స్కోర్లకే పెవిలియన్‌కు చేరారు. భారత్‌ బౌలర్లలో కుల్దీప్‌ 2, బుమ్రా 2, భువనేశ్వర్‌, పాండ్యా, చాహల్‌ తలో వికెట్‌ తీసుకున్నారు.

ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు తీసిన బుమ్రా
రాంచీ వేదికగా ఆసీస్‌తో జరుగుతున్న తొలి టీ20లో బుమ్రా విజృంభించాడు. 17.1 ఓవర్‌ వద్ద 111 పరుగుల వద్ద బుమ్రా వేసిన బంతికి పెయిన్‌(17), 17.4వ బంతికి 113 పరుగుల నైల్‌(1) క్లీన్‌ బౌల్డ్ అయ్యారు. 18 ఓవర్లకు గాను ఆసీస్‌ 7 వికెట్లు కోల్పోయి 118 పరుగులు చేసింది.

ఐదో వికెట్ కోల్పోయిన ఆసీస్

తొలి టీ20లో ఆసీస్ ఐదో వికెట్ కోల్పోయింది. జట్టు స్కోరు 87 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయిన ఆసీస్ మరో రెండు పరుగులు జోడించాక ట్రావిస్ హెడ్ రూపంలో ఐదో వికెట్ కోల్పోయింది. పాండ్యా బౌలింగ్‌లో హెడ్ బౌల్డ్ అయ్యాడు. 14 ఓవర్లు ముగిసే సరికి ఆసీస్ ఐదు వికెట్ల నష్టానికి 92 పరుగులు చేసింది.

సత్తా చాటుతున్న స్పిన్నర్ కుల్దీప్
స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ దెబ్బకు ఆస్ట్రేలియా బ్యాటింగ్ కుప్పకూలుతోంది. దూకుడుగా ఆడుతున్న అరోన్ ఫించ్(42)ను అద్భుతమైన బంతితో బౌల్డ్ చేసిన కుల్దీప్ యాదవ్ 13వ ఓవర్ రెండో బంతికి హెన్రిక్స్ (8)ను బౌల్డ్ చేశాడు. దీంతో ఆసీస్ నాలుగో వికెట్ కోల్పోయింది. ఆసీస్ కోల్పోయిన నాలుగు వికెట్లలో రెండు కుల్దీప్‌ తీయగా, భువీ, చాహల్‌ తలో వికెట్ దక్కింది. దీంతో 13 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా నాలుగు వికెట్ల నష్టానికి 88 పరుగులు చేసింది.

kuldeep yadav

మ్యాక్స్‌వెల్ అవుట్: రెండో వికెట్ కోల్పోయిన ఆసీస్
తొలి టీ20లో ఆసీస్ 55 పరుగుల వద్ద మాక్స్‌వెల్ రూపంలో రెండో వికెట్ కోల్పోయింది. చాహల్ బౌలింగ్‌లో బుమ్రా‌కు క్యాచ్ ఇచ్చి మ్యాక్స్‌వెల్ పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం ఏడు ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా రెండు వికెట్ల నష్టానికి 57 పరుగులు చేసింది.

ఐదు ఓవర్లకు ఆసీస్ 36/1
ఐదు ఓవర్లు ముగిసే సరికి ఆసీస్ వికెట్ కోల్పోయి 36 పరుగులు చేసింది. తొలి ఓవర్ ఐదో బంతికి కెప్టెన్ డేవిడ్ వార్నర్ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన గ్లెన్ మాక్స్‌వెల్‌తో కలిసి అరోన్ ఫించ్ దూకుడుగా ఆడుతున్నాడు. ప్రస్తుతం మ్యాక్స్‌వెల్ 5, ఫించ్ 22 పరుగులతో క్రీజులో ఉన్నారు.

ఆదిలోనే వికెట్ కోల్పోయిన ఆసీస్
రాంచీ వేదికగా భారత్‌తో తొలి టీ20 తొలి ఓవర్లోనే ఆసీస్ వికెట్ కోల్పోయింది. కెప్టెన్ డేవిడ్ వార్నర్‌ (8)ను భువనేశ్వర్ కుమార్ ఓవర్ ఐదో బంతికి బౌల్డ్ చేశాడు. దీంతో తొలి ఓవర్ ముగిసే సరికి ఆసీస్ వికెట్ నష్టానికి 8 పరుగులు చేసింది.

 1st T20I

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కోహ్లీ

రాంచీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టీ20లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఇక భారత జట్టులో అక్షర్ పటేల్ స్థానంలో కుల్దీప్‌ను తీసుకున్నారు. రహానే స్థానంలో ధావన్ వచ్చి చేరాడు. చాలా కాలం తర్వాత జట్టులోకి వచ్చిన సీనియర్‌ బౌలర్‌ ఆశిష్‌ నెహ్రాకు తుది జట్టులో స్థానం దక్కలేదు.

ఐదు వన్డేల సిరీస్‌లో కనీసం ఒక్క మ్యాచ్‌లో కూడా చోటు దక్కని కేఎల్ రాహుల్‌కు తొలి టీ20లో సైతం నిరాశే ఎదురైంది. ఇప్పటికే వన్డే సిరీస్‌ను సొంతం చేసుకొని ఉత్సాహం మీద ఉన్న కోహ్లీసేన టీ20 సిరీస్‌ను కైవసం చేసుకోవాలని చూస్తోంది. మరోవైపు టీ20 సిరీస్‌నైనా గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలని ఆసీస్‌ భావిస్తోంది.

భారత్‌తో జరుగుతున్న మూడు టీ20 సిరిస్‌కు ఆస్ట్రేలియా జట్టు రెగ్యులర్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ దూరమవగా అతని స్థానంలో డేవిడ్ వార్నర్ జట్టు కెప్టెన్ బాధ్యతలను చేపట్టాడు. ఇరు జట్ల మధ్య 2016 జనవరిలో చివరిసారిగా టి20 సిరీస్‌ జరిగింది. ఆస్ట్రేలియా గడ్డపైనే జరిగిన ఈ సిరిస్‌ను భారత్‌ 3-0తో కైవసం చేసుకుంది.

జట్టు వివరాలు
భారత్‌: రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధావన్‌, విరాట్‌ కోహ్లీ(కెప్టెన్‌), మనీశ్‌ పాండే, ఎంఎస్‌ ధోనీ, కేదార్‌ జాదవ్‌, హార్దిక్‌ పాండ్య, భువనేశ్వర్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, చాహల్‌, బుమ్రా

ఆస్ట్రేలియా: డేవిడ్‌ వార్నర్‌(కెప్టెన్‌), ఫించ్‌, మాక్స్‌వెల్‌, హెడ్‌, హెన్రిక్స్‌, క్రిష్టియన్‌, టిమ్‌ పెయిన్‌, నైల్‌, ఆండ్రూ టై, ఆడమ్‌ జంపా, జాసన్‌ బెహ్రెన్‌డార్ఫ్‌

Story first published: Monday, November 13, 2017, 12:17 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X