సోషల్ మీడియాలో వైరల్ అయిన కోహ్లీ డకౌట్ (వీడియో)

Posted By:

హైదరాబాద్: చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా టాపార్డర్ పూర్తగా విఫలమైంది. ఈ మ్యాచ్‌ ఆరంభంలోనే కోహ్లీసేన కీలక వికెట్లను చేజార్చుకుని కష్టాల్లో పడింది. రహానే (5), విరాట్ కోహ్లీ(0), మనీశ్ పాండే (0), రోహిత్ శర్మ (28), కేదార్ జాదవ్ (40) పరుగుల వద్ద అవుటయ్యారు.

టాపార్డర్ విఫలం కావడంతో టీమిండియా ఒత్తిడిలో ప‌డింది. దీంతో 26 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 107 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో మ‌హేంద్ర సింగ్ ధోని (16), పాండ్యా (11) ప‌రుగుల‌తో క్రీజులో ఉన్నారు. వీరిద్దరూ నిలకడగా ఆడుతూ స్కోరు బోర్డుని పరిగెత్తిస్తున్నారు.

దీంతో వీరిద్ద‌రిపైనే టీమిండియా అభిమానులు ఆశ‌లు పెట్టుకున్నారు. ఆస్ట్రేలియా బౌల‌ర్ల‌లో నాథ‌న్ కౌల్టర్ మూడు వికెట్లు తీసి భారత్‌ టాపార్డర్‌ను పెవిలియన్‌కు చేర్చాడు. మరోవైపు మార్క‌స్ స్టోయినిస్ రెండు వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లీ డకౌట్‌గా వెనుదిరిగడంతో అభిమానులు నిరాశకు గురయ్యారు.

India Vs Australia 1st ODI: Virat Kohli OUT On Duck, India in big trouble

మూడో ఓవర్లోనే ఓపెనర్‌ రహానే(5) మాథ్యూ వేడ్‌కు క్యాచ్‌ ఇచ్చి అవుట్ కాగా, ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్‌ కోహ్లీ, మనీశ్‌ పాండేలు వెనువెంటనే పెవిలియన్‌ బాటపట్టారు. 5.1 ఓవర్‌ వద్ద కౌల్టర్‌ నైల్‌ వేసిన బంతికి కోహ్లీ షాట్‌ కొట్టేందుకు ప్రయత్నించగా.. మాక్స్‌వెల్‌ అద్భుతమైన క్యాచ్‌ పట్టాడు.

దీంతో కోహ్లీ (0) పరుగులకే పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన మనీశ్‌ పాండే కూడా కౌల్టర్‌ బౌలింగ్‌లోనే ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు. దీంతో భారత్‌ 11 పరుగుల వద్దే మూడు కీలక వికెట్లు కోల్పోయింది. కోహ్లీ డకౌట్ అయిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Story first published: Sunday, September 17, 2017, 16:02 [IST]
Other articles published on Sep 17, 2017

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి