న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

INDvsNZ : మహాకాలేశ్వర్ ఆలయంలో టీమిండియా.. పంత్ త్వరగా కోలుకోవాలని పూజలు!

India Players visit Mahakaleshwar Temple before third INDvsNZ ODI

న్యూజిల్యాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో తొలి రెండు వన్డేలు గెలిచిన టీమిండియా.. మూడో వన్డే కోసం ఇండోర్ చేరుకుంది. ఈ సందర్భంగా ఉజ్జయిన్‌లోని మహాకాలేశ్వర్ ఆలయాన్ని టీమిండియా సభ్యులు సందర్శించారు. స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్, కుల్దీప్ యాదవ్ తదితరులు ఈ ఆలయాన్ని సందర్శించి పూజలు చేశారు. ఇక్కడ మహాకాలేశ్వరుడికి ఇచ్చే భస్మ హారతిలో పాల్గొన్నారు. పూజాకార్యక్రమాలు నిర్వహించిన అనంతరం సూర్యకుమార్ యాదవ్ మీడియాతో మాట్లాడాడు.

కోలుకుంటున్న పంత్..

కోలుకుంటున్న పంత్..

రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స తీసుకుంటున్న రిషభ్ పంత్ త్వరగా కోలుకోవాలని ప్రార్థించినట్లు సూర్యకుమార్ చెప్పాడు. అతడు జట్టుకు చాలా కీలకమని, అందుకే అతని కోసం ప్రార్థించానని వెల్లడించాడు. అలాగే న్యూజిల్యాండ్ సిరీస్ ఇప్పటికే గెలిచామని, మూడో వన్డే కోసం ఆసక్తిగా ఎదరు చూస్తున్నామని చెప్పాడు. గతేడాది చివర్లో ఇంటికి వెళ్తుండగా పంత్ కారుకు ఘోరమైన రోడ్డు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో పంత్ మోకాళ్లు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. ప్రస్తుతం ముంబైలో అతను కోలుకుంటున్నాడు.

 తిరువనంతపురంలోనూ..

తిరువనంతపురంలోనూ..

అంతకుముందు శ్రీలంకతో వన్డే సిరీస్ సమయంలో కూడా సూర్యకుమార్ సహా కొందరు టీమిండియా ఆటగాళ్లు ఆలయ దర్శనకు వెళ్లారు. తిరువనంతపురంలో మ్యాచ్ సందర్భంగా అక్కడి పద్మనాభస్వామి ఆలయాన్ని సందర్శించి పూజలు చేశారు. ఇప్పుడు ఉజ్జయిన్‌లో కూడా పూజలు నిర్వహించారు. కాగా, టీ20ల్లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న సూర్యకుమార్ యాదవ్.. వన్డే ఫార్మాట్లో పెద్దగా ఆకట్టుకోవడం లేదు. న్యూజిల్యాండ్‌తో జరిగిన తొలి వన్డేలో చక్కని ఆరంభం లభించినా దాన్ని భారీ స్కోరుగా మలచలేకపోయాడు.

వన్డేల్లో ప్రకాశించని సూర్యుడు..

వన్డేల్లో ప్రకాశించని సూర్యుడు..

ఇక రెండో వన్డేలో సూర్యకు బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. రాయ్‌పూర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిల్యాండ్‌ను భారత బౌలర్లు ముప్పుతిప్పలు పెట్టారు. వెటరన్ పేసర్ మహమ్మద్ షమీ విజృంభించాడు. దీంతో ఆ జట్టు 108 పరుగులకే ఆలౌట్ అయింది. లక్ష్య ఛేదనలో రోహిత్ శర్మ హాఫ్ సెంచరీతో మెరవడంతో టీమిండియా కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను భారత జట్టు 2-0తో తన ఖాతాలో వేసుకుంది. నామమాత్రపు మూడో వన్డే మంగళవారం నాడు ఇండోర్ వేదికగా జరగనుంది.

Story first published: Monday, January 23, 2023, 12:36 [IST]
Other articles published on Jan 23, 2023
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X