న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బిగ్ షాక్..రవిచంద్రన్ అశ్విన్: ఇంగ్లాండ్ పర్యటనకు దూరంగా ఆల్‌రౌండర్

IND vs ENG 2022 5th test: Ravichandran Ashwin tested positive for Covid19 currently in quarantine

ముంబై: ఇంకొద్దిరోజుల్లో భారత్-ఇంగ్లాండ్ మధ్య ప్రతిష్ఠాత్మక సిరీస్ ఆరంభం కాబోతోంది. ఓ టెస్ట్ సహా మొత్తం ఏడు మ్యాచ్‌లల్లో ఆడనుంది. జులై 1వ తేదీన తొలి టెస్ట్ మ్యాచ్ ఆరంభమౌతుంది. లీసెస్టర్‌షైర్‌లో భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:30 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. ఇది రీషెడ్యూల్డ్ మ్యాచ్. గతంలో భారత జట్టు ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లినప్పుడు కరోనా వైరస్ వల్ల వాయిదా పడిన అయిదో టెస్ట్ మ్యాచ్ ఇది. ఇప్పుడు మళ్లీ ఈ మ్యాచ్‌ను ఆడనున్నాయి ఈ రెండుజట్లు.

దీని తరువాత మూడు టీ20లు, రెండు వన్డే ఇంటర్నేషనల్స్‌లో తలపడనున్నాయి. తొలి టీ20 మ్యాచ్ వచ్చేనెల 7వ తేదీన షెడ్యూల్ అయింది. ఏజెస్ బౌల్ స్టేడియం దీనికి ఆతిథ్యాన్ని ఇవ్వనుంది. 9, 10వ తేదీల్లో ఎడ్జ్‌బాస్టన్‌, ట్రెంట్ బ్రిడ్జ్‌ల్లో మిగిలిన రెండు టీ20 ఇంటర్నేషనల్స్ ఉంటాయి. అనంతరం రెండు వన్డే ఇం

టర్నేషనల్స్ సిరీస్ మొదలవుతుంది. 12వ తేదీన ఓవల్ 14న లార్డ్స్‌లో ఈ రెండు మ్యాచ్‌లల్లో భారత్-ఇంగ్లాండ్ తలపడతాయి.

ఈ సిరీస్‌కు ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ దూరం అయ్యాడు. జట్టుతో పాటు అతను ఇంగ్లాండ్ బయలుదేరి వెళ్లలేదు. భారత్‌లోనే ఉండిపోయాడు. దీనికి కారణం- అశ్విన్.. కరోనా వైరస్ బారిన పడటమే. అతనికి ఆర్టీపీసీఆర్ టెస్ట్ నిర్వహించగా.. పాజిటివ్‌గా రిపోర్ట్ వచ్చింది. దీనితో అతను క్వారంటైన్‌లో వెళ్లాడు. కనీసం రెండు వారాలపాటు క్వారంటైన్‌లో గడపాల్సి ఉంది. ఫలితంగా ఇంగ్లాండ్‌తో టెస్ట్ మ్యాచ్‌కు అందుబాటులో ఉండే అవకాశాలు లేనట్టే.

జులై 1వ తేదీన అయిదో టెస్ట్ మ్యాచ్ ఆరంభం అయ్యే సమయానికి అశ్విన్ కోలుకుంటాడని భావిస్తున్నట్లు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు తెలిపింది. కాగా మిగిలిన జట్టు సభ్యులందరూ ఇప్పటికే లీసెస్టర్‌షైర్ చేరుకున్నారు. ప్రాక్టీస్ మొదలు పెట్టారు. బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్, బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రేల పర్యవేక్షణలో ప్రాక్టీస్ సాగుతోంది. హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ సోమవారం లండన్‌కు బయలుదేరి వెళ్లాడు. దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ ఉన్నందున ద్రావిడ్ జట్టుతో పాటు ఇంగ్లాండ్ వెళ్లలేదు.

బెంగళూరు టీ20 మ్యాచ్ వర్షం వల్ల రద్దయిన మరుసటి రోజు తెల్లవారు జామునే ద్రవిడ్‌తో పాటు రిషభ్ పంత్, శ్రేయాస్ అయ్యర్ లండన్ విమానం ఎక్కారు. ఈ సాయంత్రానికి ఈ ముగ్గురూ లీసెస్టర్‌‌షైర్ చేరుకోనున్నారు. కాగా- హార్దిక్ పాండ్యా కేప్టెన్సీలో మరో జట్టు గురువారం ఐర్లాండ్‌కు బయలుదేరి వెళ్తుంది. ఐర్లాండ్‌తో రెండు టీ20 మ్యాచ్‌లను ఆడాల్సి ఉంది. ఈ జట్టుకు వీవీఎస్ లక్ష్మణ్ హెడ్ కోచ్‌గా అపాయింట్ అయ్యాడు.

Story first published: Tuesday, June 21, 2022, 7:15 [IST]
Other articles published on Jun 21, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X