విదేశీ పర్యటనలే ఎక్కువ: టీమిండియా 2018 కంప్లీట్ క్యాలెండర్ ఇదే

Posted By:
Here is the complete calendar of Indian Cricket Team in 2018

హైదరాబాద్: 2017 టీమిండియా చరిత్రలో మరిచిపోలనే ఏడాది. గతేడాది టీమిండియా ఎన్నో అద్భుత విజయాలను నమోదు చేసింది. ఐసీసీ ఛాంపియన్స్ ఫైనల్లో పాకిస్థాన్‌పై చేతిలో ఓటమి తప్ప... అటు విదేశాల్లోనూ, ఇటు స్వదేశంలో జరిగిన అన్ని సిరిస్‌ల్లోనూ కోహ్లీసేన విజయ పరంపరను కొనసాగించింది.

గతేడాది కోహ్లీసేన ఎక్కువ సమయం స్వదేశంలో సిరిస్‌లు ఆడుతూ గడిపింది. అయితే 2018లో మాత్రం స్వదేశంలో కంటే విదేశాల్లోనూ ఎక్కువ పర్యటనలు చేయనుంది. ఈ ఏడాది కోహ్లీసేన దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా దేశాల్లో పర్యటించనుంది. ఈ ఏడాది ప్రారంభంలో కోహ్లీసేన సఫారీ పర్యటనకు వెళ్లింది.

మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను 2-1తో చేజార్చుకున్నప్పటికీ, వన్డే సిరిస్‌ను సొంతం చేసుకుని సఫారీ గడ్డపై చరిత్ర సృష్టించింది. ఆరు వన్డేల సిరిస్‌ను మరో వన్డే మిగిలుండగానే 4-1తో కైవసం చేసుకుని గత పాతికేళ్లలో ఏ భారత జట్టు సాధించలేని ఘనతను కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా సాధించింది.

సఫారీ పర్యటన ముగిసిన తర్వాత కోహ్లీసేన ఈ ఏడాది వరుసగా ద్వైపాక్షిక సిరిస్‌లను ఆడనుంది. వాటికి సంబధించిన పూర్తి వివరాలు:

 దక్షిణాఫ్రికా పర్యటనలో టీమిండియా: జనవరి 5 నుంచి ఫిబ్రవరి 24 వరకు

దక్షిణాఫ్రికా పర్యటనలో టీమిండియా: జనవరి 5 నుంచి ఫిబ్రవరి 24 వరకు

విరాట్ కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా దక్షిణాఫ్రికాతో మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను ఆడింది. ఈ సిరిస్‌ను 2-1తో చేజార్చుకున్నప్పటికీ ఆరు వన్డేల సిరిస్‌ను మరో వన్డే మిగిలుండగానే 4-1తో సొంతం చేసుకుంది. జోహెన్స్ బర్గ్ వేదికగా జరిగిన మూడో టెస్టులో కోహ్లీ సేన విజయం సాధించిన తర్వాత సఫారీ గడ్డపై వరుస విజయాలతో దూసుకెళ్తోంది.

టెస్టులు:
1st Test: Jan 05-09 2018 @ Newlands, Cape Town - SA won by 72 runs
2nd Test: Jan 13-17 2018 @ Supersport Park, Centurion - SA won by 135 runs
3rd Test: Jan 24-28 2018 @ New Wanderers Stadium, Johannesburg - Inda won by 63 runs
మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను సఫారీ జట్టు 2-1తో కైవసం చేసుకుంది.

వన్డేలు:
1st ODI: Feb 01 @ Kingsmead, Durban - India won by 6 wickets
2nd ODI: Feb 04 @ Supersport Park, Centurion - India won by 9 wickets
3rd ODI: Feb 07 @ Newlands, Cape Town - India won by 124 runs
4th ODI: Feb 10 @ Wanderers, Johannesburg SA won by 5 wickets
5th ODI: Feb 13 @ Port Elizabeth India won by 73 runs
6th ODI: Feb 16, 2018, Friday @ Supersport Park, Centurion 04:30 PM (IST)

టీ20లు
1st T20I: Feb 18, 2018, Sunday @ New Wanderers Stadium, Johannesburg 06:00 PM (IST)
2nd T20I: Feb 21, 2018, Wednesday @ Supersport Park, Centurion 09:30 PM (IST)
3rd T20I: Feb 24, 2018, Saturday @ Newlands, Cape Town 09:30 PM (IST)

కోహ్లీసేన శ్రీలంక పర్యటనకు

కోహ్లీసేన శ్రీలంక పర్యటనకు

శ్రీలంకలో నిదాహాస్ ట్రోఫీ 2018: ముక్కోణపు వన్డే సిరిస్
సఫారీ పర్యటన ముగిసిన అనంతరం కోహ్లీసేన శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో భాగంగా కోహ్లీసేన ముక్కోణపు టీ20 సిరిస్ ఆడనుంది. హీరో నిదాహాస్‌ ట్రోఫీ పేరిట జరిగే ఈ టోర్నీలో భారత్‌, బంగ్లాదేశ్‌, శ్రీలంక జట్లు పాల్గొంటాయి. మార్చి 6 నుంచి 18 వరకు శ్రీలంక రాజధాని కొలంబోలో జరగనుంది. శ్రీలంకకు స్వాతంత్యం వచ్చి 70 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా ఈ టోర్నీని నిర్వహిస్తోంది. ఈ టోర్నీ రౌండ్ రాబిన్ పద్ధతిన జరగనుంది.

Here is the full schedule of NIDAHAS Trophy T20I Tri-series:
6 March (Tuesday) - India Vs Sri Lanka
8 March (Thursday) - India Vs Bangladesh
10 March (Saturday) - Sri Lanka Vs Bangladesh
12 March (Monday) - India Vs Sri Lanka
14 March (Wednesday) - India Vs Bangladesh
16 March (Friday) - Sri Lanka Vs Bangladesh
18 March (Sunday) - FINAL
Note: అన్ని మ్యాచ్‌లు కూడా శ్రీలంకలోని ప్రేమదాస స్టేడియంలోనే జరుగుతాయి.

 ఐపీఎల్ 2018: ఏప్రిల్ 4 నుంచి మే 31 వరకు

ఐపీఎల్ 2018: ఏప్రిల్ 4 నుంచి మే 31 వరకు

శ్రీలంక పర్యటన ముగించుకుని భారత్‌కు చేరుకున్న టీమిండియా కోసం ఐపీఎల్ 11వ సీజన్ ఎదురు చూస్తోంది. ఐపీఎల్ 11వ సీజన్ ఏప్రిల్ 4న మొదలై మే 31వరకు జరగనుంది. ఈ టీ20 క్రికెట్ టోర్నీలో ప్రపంచంలోని పలు దేశాలకు చెందిన ఆటగాళ్లు పాల్గొనే సంగతి తెలిసిందే. ఐపీఎల్-11 సీజన్ ప్రారంభ, ముగింపు కార్యక్రమాలను ఈసారి ముంబైలో నిర్వహించనున్నారు. మొదటి మ్యాచ్ ఏప్రిల్ 7వ తేదీన ముంబైలో జరుగుతుంది. టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ కూడా మే 27వ తేదీన ముంబైలోనే జరగనున్నది.

 ఏకైక టెస్టు కోసం భారత పర్యటనకు ఆప్ఘనిస్థాన్

ఏకైక టెస్టు కోసం భారత పర్యటనకు ఆప్ఘనిస్థాన్

ఈ ఏడాది జూన్‌లో ఏకైక టెస్టు మ్యాచ్ కోసం ఆప్ఘనిస్థాన్ జట్టు భారత పర్యటనకు రానుంది. గతేడాది ఆప్ఘనిస్థాన్, ఐర్లాండ్ జట్లకు ఐసీసీ టెస్టు హోదా కల్పించిన సంగతి తెలిసిందే. ఆప్ఘనిస్థాన్‌కు టెస్టు హోదా వచ్చిన తర్వాత తన తొలి మ్యాచ్‌ని భారత్‌తో ఆడనుంది. ఈ మ్యాచ్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జూన్ 14 నుంచి 18 వరకు జరగనుంది.

 ఐర్లాండ్ పర్యటనకు టీమిండియా

ఐర్లాండ్ పర్యటనకు టీమిండియా

ఆప్ఘనిస్థాన్ జట్టు భారత పర్యటన ముగిసిన తర్వాత కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా ఐర్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. ఐర్లాండ్ జట్టుతో రెండు టీ20ల సిరిస్ ఆడిన తర్వాత కోహ్లీసేన ఇంగ్లాండ్‌కు వెళ్లనుంది. ఈ రెండు టీ20 మ్యాచ్‌లు కూడా డబ్లిన్ వేదికగా జరుగుతాయి.
1st Twenty20 - June 27 @ The Village, Dublin at 8:30 PM (IST)
2nd Twenty20 - June 29 @ The Village, Dublin at 8:30 PM (IST)

 ఇంగ్లాండ్ పర్యటకు టీమిండియా 2018: జులై 3 నుంచి

ఇంగ్లాండ్ పర్యటకు టీమిండియా 2018: జులై 3 నుంచి

సెప్టెంబర్ 11 వరకుఐర్లాండ్‌తో రెండు టీ20ల సిరిస్ ముగిసిన తర్వాత కోహ్లీసేన ఇంగ్లాండ్‌కు వెళ్లనుంది. ఇంగ్లాండ పర్యటన కోహ్లీసేనకు ఓ ఛాలెంజ్. ఈ పర్యటనలో టీమిండియా 3 టీ20లు, 3 వన్డేలు, 5 టెస్టుల సిరిస్ ఆడనుంది. ఇంగ్లాండ్ పర్యటనలో కోహ్లీసేన తొలుత పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడిన తర్వాత ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ ఆడనుంది. ఈ సిరిస్‌ను భారత్‌లో స్టార్ నెట్ వర్క్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.

 సెప్టెంబర్‌లో ఆసియా కప్

సెప్టెంబర్‌లో ఆసియా కప్

ఇంగ్లాండ్ పర్యటన ముగించుకుని భారత్‌కు చేరుకున్న టీమిండియా ఆ తర్వాత ఆసియా కప్‌లో ఆడనుంది. సెప్టెంబర్ 15 నుంచి30 వరకు జరిగే ఈ టోర్నీని ఈసారి టీ20 ఫార్మాట్‌లో నిర్వహిస్తున్నారు. ఈ టోర్నీలో ఇండియా, ఆప్ఘనిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, పాకిస్థాన్‌ జట్లు పాల్గొంటాయి. ఈటోర్నీని కూడా స్టార్ స్పోర్ట్స్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.

 అక్టోబర్-నవంబర్ నెలలో వెస్టిండిస్ పర్యటనకు టీమిండియా

అక్టోబర్-నవంబర్ నెలలో వెస్టిండిస్ పర్యటనకు టీమిండియా

ఆసియా కప్ ముగిసిన తర్వాత అక్టోబర్-నవంబర్ నెలలో వెస్టిండిస్ పర్యటనకు టీమిండియా వెళ్లనుంది. ఈ పర్యటనలో టీమిండియా 3 టెస్టులు, 5 వన్డేలు, ఒక టీ20 ఆడనుంది. అయితే, ఈ పర్యటనపై బీసీసీఐ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.

 ఆస్ట్రేలియాలో పర్యటనకు భారత్: నవంబర్ 2018-ఫిబ్రవరి 2019

ఆస్ట్రేలియాలో పర్యటనకు భారత్: నవంబర్ 2018-ఫిబ్రవరి 2019

2018లో టీమిండియాకు ఇదే అతిపెద్ద ఛాలెంజ్. ఈ ఏడాది రెండో అర్ధభాగంలో కోహ్లీసేన ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియాతో భారత జట్టు కనీసం 4 టెస్టు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి బీసీసీఐ-క్రికెట్ ఆస్ట్రేలియా అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. కోహ్లీసేన ఆస్ట్రేలియా పర్యటన మ్యాచ్‌లను సోనీ పిక్చర్స్ ప్రసారం చేయనుంది.

Story first published: Wednesday, February 14, 2018, 19:07 [IST]
Other articles published on Feb 14, 2018
Read in English: Team India's 2018 Calendar
POLLS

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి