న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రోహిత్, ధోని జట్టులో లేకపోతే కోహ్లీ ఏమీ సాధించలేడు: గంభీర్ సంచలన వ్యాఖ్యలు

Gautam Gambhir Comments on Indian captain Virat Kohli

హైదరాబాద్: జట్టులో రోహిత్ శర్మ, మహేంద్ర సింగ్ ధోని లాంటి ఆటగాళ్లు ఉండటబట్టే అంతర్జాతీయ విరాట్ కోహ్లీ విజయవంతమైన కెప్టెన్‌గా రాణించగలుగుతున్నాడని టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ అన్నాడు. గత కొన్ని సంవత్సరాలుగా విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా విజయాలు సాధించడంలో ధోని, రోహిత్‌లు కీలకంగా వ్యవహారిస్తున్నారని తెలిపాడు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్‌)లో ఓ ఫ్రాంచైజీని నడిపినప్పుడు ఒకరి కెప్టెన్సీ సామర్థ్యం నిజంగా పరీక్షించబడుతుందని గంభీర్ ఈ సందర్భంగా ప్రస్తావించాడు. ఐపీఎల్ ఫ్రాంచైజీ క్రికెట్‌లో ధోని, రోహిత్‌ శర్మలు తిరుగులేని కెప్టెన్లుగా నిలిచారని గంభీర్ కొనియాడాడు. వీరిద్దరూ లేకుండా కెప్టెన్‌గా చేస్తే కోహ్లీ ప్రతిభ ఏంటో బయటపడుతుందని గంభీర్ అన్నాడు.

World Wrestling Championships: వివాదాస్పదంగా మారిన భజరంగ్ ఓటమి!World Wrestling Championships: వివాదాస్పదంగా మారిన భజరంగ్ ఓటమి!

కెప్టెన్‌గా కోహ్లీ ఎన్నో విజయాలు

కెప్టెన్‌గా కోహ్లీ ఎన్నో విజయాలు

"ఇప్పటికీ కోహ్లీ కెప్టెన్సీ గురించి చర్చించాలి. ప్రపంచ క్రికెట్‌లో కెప్టెన్‌గా కోహ్లీ ఎన్నో విజయాలు సాధించాడు. ఇది గత కొన్నేళ్లుగా జరుగుతోంది. సుదీర్ఘకాలంగా ధోని, రోహిత్‌లు జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించబట్టే కోహ్లీ కెప్టెన్‌గా విజయవంతమయ్యాడు. ఓ ఫ్రాంచైజీని నడిపినప్పుడు ఒకరి కెప్టెన్సీ సామర్థ్యం నిజంగా పరీక్షించబడుతుంది" అని గంభీర్ చెప్పుకొచ్చాడు.

రోహిత్ శర్మ ఏం సాధించాడో తెలుసు

రోహిత్ శర్మ ఏం సాధించాడో తెలుసు

"నేను ఎప్పుడు దీని గురించి మాట్లాడినా నిజాయితీగా మాట్లాడుతున్నా. ముంబై ఇండియన్స్‌ జట్టు తరుపున రోహిత్ శర్మ ఏం సాధించాడో తెలుసు... ఇక చెన్నై సూపర్‌ కింగ్స్‌కు తిరుగులేని కెప్టెన్‌ ధోని. ఆర్సీబీ కెప్టెన్‌గా ఉన్న కోహ్లిని పరిశీలించండి. ఫలితాలు ఏమిటో అందరికీ తెలిసిందే" అని గంభీర్ పేర్కొన్నాడు.

ఓపెనర్‌గా రోహిత్ శర్మ

ఓపెనర్‌గా రోహిత్ శర్మ

సఫారీలతో అక్టోబర్ 2 నుంచి జరగనున్న మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో ఓపెనర్‌గా రోహిత్ శర్మను బరిలోకి పంపడంపై గంభీర్ మద్దతుగా నిలిచాడు. కేఎల్‌ రాహుల్‌కు ఓపెనర్‌గా చాలా అవకాశాలు ఇచ్చారని, ఇప్పుడు రోహిత్‌ సమయం వచ్చిందని గంభీర్ పేర్కొన్నాడు.

కేఎల్ రాహుల్‌కు ఓపెనర్‌గా చాలా సమయం

కేఎల్ రాహుల్‌కు ఓపెనర్‌గా చాలా సమయం

"కేఎల్ రాహుల్‌కు ఓపెనర్‌గా చాలా సమయం ఇచ్చారు. ఇప్పుడు టెస్టు క్రికెట్‌లో ఓపెనర్‌గా రోహిత్ శర్మ వంతు వచ్చింది. రోహిత్‌ శర్మ జట్టుకు ఎంపికయ్యాడంటే తుది జట్టులో ఉన్నట్లే. ఒకవేళ అతనికి తుది ఎలెవన్ జట్టులో చోటివ్వకపోతే, 15-16 మంది సభ్యుల జట్టులోకి తీసుకున్నా ఉపయోగం ఉండదు" అని గంభీర్ అన్నాడు.

Story first published: Friday, September 20, 2019, 14:39 [IST]
Other articles published on Sep 20, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X