న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

‘ఎ’ గ్రేడ్‌ కాంట్రాక్ట్‌: రిషబ్ పంత్ జాక్‌పాట్ కొట్టాడు

Full List Of BCCI's Contracted Players For 2019 | Oneindia Telugu
Full list of BCCIs contracted players for 2019; Kohli, Bumrah, Rohit in Grade A+; Pant, Kuldeep bag Grade A contracts

హైదరాబాద్: అంతర్జాతీయ క్రికెట్‌లో అద్భుత ప్రదర్శన చేస్తోన్న టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కు తొలిసారిగా బీసీసీఐ సెంట్రల్‌ కాంట్రాక్ట్‌లో చోటు దక్కింది. గురువారం బీసీసీఐ పాలకుల కమిటీ(సీఓఏ) ఖరారు చేసిన 2018-19 వార్షిక కాంట్రాక్టుల్లో రిషబ్ పంత్‌కు 'ఎ' గ్రేడ్‌ దక్కింది. దీని విలువ రూ. 5 కోట్లు. ఎ+ తర్వాత అత్యధిక మొత్తం లభించేది 'ఎ' గ్రేడ్‌లోనే.

రాంచీ వన్డేలో అరుదైన రికార్డు ముంగిట మహేంద్ర సింగ్ ధోని!రాంచీ వన్డేలో అరుదైన రికార్డు ముంగిట మహేంద్ర సింగ్ ధోని!

‘ఎ' గ్రేడ్‌లో రిషబ్ పంత్

‘ఎ' గ్రేడ్‌లో రిషబ్ పంత్

21 ఏళ్ల పంత్‌ 2017-18లో 26 మంది కాంట్రాక్ట్‌ గల ఆటగాళ్ల జాబితాలోనే లేడు. 2018-19 సీజన్‌కు గాను అతడికి రూ.5 కోట్ల వార్షిక వేతనం కలిగిన ‘ఎ' గ్రేడ్‌లో చోటిచ్చారు. ఇక, బీసీసీఐ గ్రేడింగ్‌లో గత ఏడాదే చేర్చిన ‘ఎ ప్లస్‌' గ్రేడ్‌ అన్నింటికంటే అత్యుత్తమం. ఏడాదికి రూ.7 కోట్లు లభించే ఈ విభాగంలోకి అన్ని ఫార్మాట్లలో ఆడే ఆటగాళ్లు వస్తారు.

ఎ+ గ్రేడ్‌లో ఈసారి ముగ్గురే

ఎ+ గ్రేడ్‌లో ఈసారి ముగ్గురే

ఈ జాబితాలో గత ఏడాది ఐదుగురు ఆటగాళ్లు ఉండగా.. ఈసారి ముగ్గురే ఉన్నారు. మూడు ఫార్మాట్లలో రెగ్యులర్‌గా ఉన్న కెప్టెన్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ, బుమ్రాలను మాత్రమే ఉంచి ఈ సారి భువనేశ్వర్‌ కుమార్, శిఖర్‌ ధావన్‌లను తప్పించారు. ‘బి' గ్రేడ్‌కు 3 కోట్లు, ‘సి' గ్రేడ్‌కు రూ. కోటి లభిస్తాయి. పుజారా గ్రేడ్‌-ఎలో తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు.

హనుమ విహారికి గ్రేడ్‌ ‘సి' కాంట్రాక్ట్‌

హనుమ విహారికి గ్రేడ్‌ ‘సి' కాంట్రాక్ట్‌

హనుమ విహారికి గ్రేడ్‌ ‘సి' కాంట్రాక్ట్‌ దక్కింది. మహిళల విభాగంలో అత్యుత్తమ గ్రేడ్‌ అయిన ‘ఎ' గ్రేడ్‌ (రూ.50 లక్షలు)లో మిథాలీ రాజ్‌, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌, స్మృతి మంధాన, పూనమ్‌ యాదవ్‌లకు చోటు లభించింది. తెలుగు అమ్మాయి అరుంధతి రెడ్డి రూ.10 లక్షలు లభించే గ్రేడ్‌ ‘సి'లో ఉంది. 2018 అక్టోబరు 1 నుంచి 2019 సెప్టెంబరు 30 వరకు కొత్త కాంట్రాక్టు అమలులో ఉంటుంది.

గ్రేడ్‌ ‘ఎ+'లో కోహ్లి, రోహిత్‌ శర్మ, బుమ్రా

గ్రేడ్‌ ‘ఎ+'లో కోహ్లి, రోహిత్‌ శర్మ, బుమ్రా

గ్రేడ్‌ ‘ఎ+' (రూ.7 కోట్లు): కోహ్లి, రోహిత్‌ శర్మ, బుమ్రా

గ్రేడ్‌ ‘ఎ' (రూ.5 కోట్లు): అశ్విన్‌, జడేజా, భువనేశ్వర్‌, పుజారా, రహానె, ధోని, ధావన్‌, షమి, ఇషాంత్‌, కుల్‌దీప్‌, రిషబ్‌ పంత్‌

గ్రేడ్‌ ‘బి' (రూ.3 కోట్లు): కేఎల్‌ రాహుల్‌, ఉమేశ్‌ యాదవ్‌, చాహల్‌, హార్దిక్‌ పాండ్య

గ్రేడ్‌ ‘సి' (రూ.1 కోటి): కేదార్‌ జాదవ్‌, దినేశ్‌ కార్తీక్‌, అంబటి రాయుడు, మనీష్‌ పాండే, హనుమ విహారి, ఖలీల్‌ అహ్మద్‌, సాహా

Story first published: Friday, March 8, 2019, 10:01 [IST]
Other articles published on Mar 8, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X